10, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1200 (ధవున కపుడు గర్భమయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమ:
    ఓం స్వామియే శరణమయ్యప్ప. తప్పులను మన్నింప ప్రార్థన.

    భవుడే భయపడె నన కే
    శవుడే మోహినిగ నగుచు శత్రువు నణచెన్
    శివునకు మోహంబున మా
    ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  2. ధవునకు మరి గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్. అంటే ఎలా ఉంటుంది?


    రిప్లయితొలగించండి
  3. భువి నేలెడి రాజగు నట
    యవనా శ్వరుడనగ నతడు యాగము నందున్
    దివిజుల సలిలము ద్రాగిన
    ధవున కపుడు గర్భమ య్యేఁ దనయుఁ డుపుట్టెన్

    మాంధాత చక్ర వర్తి పుట్టాడు కదా ! యజ్ఞ జలము త్రాగి నందున
    అదన్న మాట

    రిప్లయితొలగించండి
  4. కలరొక్క యూరిలోపల ధర్మ నిరతులౌ
    ....దంపతుల్ రమయు మాధవు డనంగ
    చాల కాలము దన్క సంతానమే లేక
    ....వారు నలుగుచుండి స్వాంతములను
    వ్రతములు నోములు బహు పుణ్యకార్యముల్
    ....చేయుచు నుండిరి చివరి కొక్క
    యత్నమ్ముతో ప్రాప్తమయ్యె సద్యోగమ్ము
    ....భవుడు ప్రత్యక్షమై వరము నిడగ
    నతుల కృప వెల్గగ ధవున కపుడు, గర్భ
    మయ్యె దనయుడు పుట్టెన్ సమంచితముగ
    నా కవకు నంత వారు సమాదరమున
    నుత్సవమ్ములు జరిపిరి యూరిలోన

    రిప్లయితొలగించండి
  5. మాస్టరుగారూ !మన " శంకరాభరణము " లో చేసిన సరస్వతీ ప్రతిష్ట చాలా బాగున్నది

    రిప్లయితొలగించండి

  6. యవనిక ప్రేమించెను మా
    ధవునే తా పెండ్లియాడి తన్మయమందెన్
    నవవధువు ముదము గూర్పగ
    ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  7. నవ వైద్యము నందిన తన
    యువిదకు సంతాన భాగ్య యోగము లేకన్
    సవినయముగ మ్రొక్కగ మా
    ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  8. నవలావణ్యముఖాబ్జికి,
    వివహంబొనరించిరంత వేడుకతోడన్
    యువకుండాశ్రితజనబాం
    ధవుని, కపుడు గర్భమాయెఁ దయనుఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  9. అవునట వింటిరెమీరు మా
    ధవునకపుడుగర్భమయ్యె దనయుడు పుట్టెన్
    ఎవరెవరికెవరు పుట్టిరొ
    వివరముగా దెలుపుడార్య! వీనుల విందున్

    రిప్లయితొలగించండి
  10. పువుగర్భమ్మా నలువకు -
    పవనాశముపై తలనిడి భద్రము గలుగన్
    పవళించినట్టి యా మా
    ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్.

    రిప్లయితొలగించండి
  11. కళాపూర్ణోదయ గత సుగాత్రీశాలీనుల (సుముఖాసత్తి, మణిస్తంభుల) కథనిట ననుసంధానించుకొనవలసినది. శారదాదేవి కృపచే పతి పత్నిగాను, పత్ని పతిగాను మాఱిరి. ప్రస్తుత మీ సమస్యాపూరణమునకు మూలమిదియే...

    చివరకుఁ దన పతి కోర్కిని,
    ధవు రూపును సతియుఁ గోరె; ధవళాంగి కృపన్
    భువి నట సతి పతిగ వఱల,
    ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్!

    (ధవళాంగి=శారదాదేవి;
    వఱలు=ప్రకాశించు,ప్రవర్తిల్లు,వ్యాపించు;
    ధవుఁడు= సుముఖాసత్తి(సుగాత్రి)గా మాఱిన మణిస్తంభుఁడు)

    రిప్లయితొలగించండి
  12. అవునట నేనూ వింటిని
    భవుడట మోహించెహరిని భామగ జూడన్
    భువనము లేలెడి యామా
    ధవున కపుడు గర్బమయ్యె దనయుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శoకరయ్యగారికి
    వందనములు

    రవమోంకారమ్మవగా
    భవానియుదయింపనామె ప్రముదిత యవగా
    భవుడా దేశిoపగ మా
    ధవున కపుడు గర్భమయ్యె తనయుడు పుట్టెన్

    రిప్లయితొలగించండి
  14. భువిఁ గుంతి, ముని వరంబిడ
    వివరముఁ దెలియక నింతి వేగమె మ్రొక్కన్
    రవికి,ద్యుమణికి, కమల బాం
    ధవునకపుడు, గర్భమయ్యెఁ దనయుడు పుట్టెన్!

    రిప్లయితొలగించండి
  15. నా రెండవ పూరణము:

    ఎంత కాలమైనను సంతానవతి కాని యొక యువతి, శివునర్చించి, ముడుపుఁ గట్టినచో సంతానము కలుగు ననఁగా, నటులే సేసి, సంతానవతి యైన సందర్భము...


    శివు నర్చసేసి సంతా
    నవతిగఁ గాఁగోరి యువతి నమ్మియు నెదలోన్
    దివిరి ముడుపుఁ గట్టె నుమా
    ధవున కపుడు, గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్!(2)

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రోజంతా కరెంటు లేక బ్లాగును చూడలేకపోయాను. తీరా కరెంటు వచ్చాక నా ఇంటర్ నెట్ పనిచేయలేదు. ఇప్పుడుకూడా వేరే సిస్టం నుండి పోస్ట్ చేశాను.
    చక్కని పూరణలు పంపిన......
    శ్రీపథి శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    శైలజ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    సహదేవుడు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. "బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్య"

    రవిగాననిచో గాంచెడి
    కవులకు సంతౌ కవితలు కన్నుల పండుల్
    నవలా రచయిత మా మా
    ధవునకపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్

    రిప్లయితొలగించండి