గత చరిత్రను ప్రౌఢ కావ్యంబులన్ నిల్పి ........... కలకాల మొనరించె కలము గాదె ఘనకీర్తి రాజేంద్రు కంఠంబులను కోసి ............కాలగర్భముఁ జేసె కత్తి గాదె శాంతి సౌఖ్యదకారి శాశ్వతాఖిలకీర్తి ......... కార్యదక్షత నేర్పె కలము గాదె విద్వేషభావంబులుద్వేగభరితమై .............కష్టకారకమయ్యె కత్తి చేత
మార్పు చేయగోరు మహితాత్ములకునెల్ల కలము చేతబట్ట బలము కలుగు భావ జాలములను ప్రతిబింబమొనరించ కత్తి మీద సాము కలమటన్న
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ అద్భుతమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు. * శైలజ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. ‘ఘన ఆయుధమ్ములు’అని విసంధిగా వ్రాసారు. ‘ఘనమగు శస్త్రముల్’ అందామా? * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
కత్తి సాధించు కార్యమ్ము కాలగతిని మాసిపోవును ;ఘనమైన మార్పు కలిగి కలముచే కలకాలమ్ము ,నిలచియుండు. కత్తికన్నను పదునైన కలమె గొప్ప భుజబలము కన్నమేలౌను బుద్ధిబలము.
చంద్రశేఖర్ గారూ, మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * కమనీయం గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం.‘బలముగ ఝళిపించ నసిని’ అందాం.
తలలను గోయును కత్తియె
రిప్లయితొలగించండితలలన్నిటి కత్తిలాగ తలపుల మార్చున్
కలమది తలచిన, గలుగవె
కలకలములు పదునుదేరు కవితలు వ్రాయన్ .
గత చరిత్రను ప్రౌఢ కావ్యంబులన్ నిల్పి
రిప్లయితొలగించండి........... కలకాల మొనరించె కలము గాదె
ఘనకీర్తి రాజేంద్రు కంఠంబులను కోసి
............కాలగర్భముఁ జేసె కత్తి గాదె
శాంతి సౌఖ్యదకారి శాశ్వతాఖిలకీర్తి
......... కార్యదక్షత నేర్పె కలము గాదె
విద్వేషభావంబులుద్వేగభరితమై
.............కష్టకారకమయ్యె కత్తి చేత
మార్పు చేయగోరు మహితాత్ములకునెల్ల
కలము చేతబట్ట బలము కలుగు
భావ జాలములను ప్రతిబింబమొనరించ
కత్తి మీద సాము కలమటన్న
కత్తి కలము రెండు ఘనఆయు ధమ్ములు
రిప్లయితొలగించండికలము బలము మిన్న కత్తి కన్న
కత్తి చేయలేని కార్యము సైతము
కదల కుండ నదియె కలము చేయు
కత్తి చేత బట్టి కాలుడ గుటయేల
రిప్లయితొలగించండికలము బట్టి నీవు కాంతి నింపు
కలము బలము జూప కదులును లోకాలు
కత్తి వలదు కలము నందుకొనుమ
పండిత నేమానిగారికి పూజ్యులుగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
కత్తికి పదు ను౦డ౦గను
మిత్తినె గోరును నిరతము మేలో కీడో
దెత్తును చూడుమ ట౦చును
సత్తువ జూపి౦చి పలుకు సాహసమొదవన్
కలములు వ్రాయును గాధలు
త్రిలింగ దేశమ్ము నందు తెలుగుల ఖ్యాతిన్
తులలేని శౌర్య సంపద
కలకాలము నిల్చునట్టి ఘన కావ్యములన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ
అద్భుతమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
‘ఘన ఆయుధమ్ములు’అని విసంధిగా వ్రాసారు. ‘ఘనమగు శస్త్రముల్’ అందామా?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
దినమంత కత్తి దూసిన
రిప్లయితొలగించండివినగలమె? తెగి పడె నంచు వేలాదితలల్!
కొనగోటి కలపు పోటున
వినుచుండగ జాతిఁ దెంచి విడదీయుదురే?
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
"కత్తికంటె పదును కలము" నాడన్నది
రిప్లయితొలగించండికలము కంటె పదును కత్తి నేడు
మాట కున్న విలువ మరుగున బడిపోయె
విచ్చలవిడితనము ముచ్చటాయె!
రిప్లయితొలగించండికత్తి సాధించు కార్యమ్ము కాలగతిని
మాసిపోవును ;ఘనమైన మార్పు కలిగి
కలముచే కలకాలమ్ము ,నిలచియుండు.
కత్తికన్నను పదునైన కలమె గొప్ప
భుజబలము కన్నమేలౌను బుద్ధిబలము.
కలమును కదిపిన చాలును
రిప్లయితొలగించండిమలినమ్ములు మాయు రచన మహిమా న్వితమౌ
బలముగ ఝళి పించ కత్తిని
కలతల నేరేపు నంట కాపురుషు లనన్
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం.‘బలముగ ఝళిపించ నసిని’ అందాం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,
రిప్లయితొలగించండిఅర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
కత్తి బట్టి రాజులు కాలగర్భమందు
కలిసిపోయిరి,కవులెల్ల కలముతోడ
పద్య కావ్యములను వ్రాసి వాసికెక్కి
నిలిచె ప్రజల నాలుకలందు నిక్కముగను
కలమునుఁ బట్టు ధీమతులు, కత్తినిఁ బట్టిన వీరులిద్ధరన్
రిప్లయితొలగించండినిలిచి యశమ్ముఁ బొందుదురు,నిశ్చయమియ్యది యాలకించినన్
పలువిధ గాధలియ్యెడను పాడగ వింటిమి బాల్యమందునన్;
తలచినఁ గంట నీరమిక ధారలు గట్టును సంతసమ్మునన్.