17, అక్టోబర్ 2013, గురువారం

పద్య రచన - 497 (ముద్దబంతిపూలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ముద్దబంతిపూలు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

 1. ముద్ద బంతి వంటి ముదిత మోమును గాంచి
  స్నిగ్ద మధుర హాస శ్రీని దలచె
  ముగ్ధ మోహ నాంగి మురిపించి గెలువంగ
  పెద్ద లంత గలసి పెండ్లి జేసె

  రిప్లయితొలగించండి
 2. ముద్దబంతి పూవు ముద్దుగా గనిపించు
  నెరుపు పసుపు రంగు లెదను దోచు
  ఇంతికొప్పులోన నీశ్వరి మెడలోన
  బంతి కాంతులీను నింతకింత.

  రిప్లయితొలగించండి
 3. ముద్దబంతి పూలు ముచ్చట గానుండు
  దండ గ్రుచ్చి కట్ట దండి గాను
  అంద గించు దార బంధములు మిగుల
  పూల లోన బంతి పూలు మిన్న

  రిప్లయితొలగించండి
 4. మరులఁ గొలుపనిక మరలుము, నాపై
  కరుణఁ గలుగదొ? సిగఁ దురుమ బంతుల్
  విరిసె మనకు గల పెరటిని; కెంపౌ
  విరులఁ గనిన తనివి కలుగునోయీ!

  రిప్లయితొలగించండి
 5. ముద్ద బంతి పూలు ముద్దులొలుకుచుండు
  రకము లెన్నొ కలవు రాణి బంతి
  సీమ బంతి జూడ సింధూర వర్ణము
  బంతి సొగసు బొగడ బ్రహ్మ తరమె

  రిప్లయితొలగించండి
 6. ఇంతి కొప్పు లోన యెంతెంత సింగారం!
  ముద్ద బంతి జేర ముదిత కొప్పు
  తురుమ వేంక టేశు తోమాల యందున
  ముద్ద బంతి పూవు మోక్ష మందు!

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
  ‘దండిగాను + అందగించు’ అని విసంధిగా వ్రాసారు. ‘ద్వారబంధము’ టైపాటు వలన ‘దారబంధము’ అయింది. మూడవ పాదానికి నా సవరణ....
  ‘ద్వారబంధములకు దగ నందమును బెంచు’
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘లోన నెంతెంత’ అనాలి. ‘సింగారం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
  ‘ఇంతి కొప్పులోన నెంత సింగారమ్ము’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ!ధన్యవాదములు. తమరి సూచిత సవరణ:

  ఇంతి కొప్పులోన నెంత సింగారమ్ము
  ముద్ద బంతి జేర ముదిత కొప్పు
  తురుమ వేంక టేశు తోమాల యందున
  ముద్ద బంతి పూవు మోక్ష మందు!

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మూగవైనట్టి యో బంతిపూవ నీకు
  మోదమెందుకే?యనగను మూగపలికె
  ధన్యతను జెందె మాజీవితమ్ము గిరిజ
  సిగను ధరియింప జాబిలి సేమమడిగె

  భువిని మాముద్దబ౦తులుమురియుచుండు
  పెండ్లి వేడుక వరుడాడు పెండ్లమునకు
  బంతి వేయును వధువును బాణమేయు
  పంచశరునికితూపులబంతి మేము

  రిప్లయితొలగించండి
 10. దైవారాధన కొఱకై
  సేవకులుగ హారరూప జీవిత మెసఁగన్
  గేవల నిమిత్తమాత్రపు
  పూవులయ్యె ముద్దబంతిపూవులు ధాత్రిన్!

  పసుపు పచ్చ వన్నె పదహారణాల ప
  సిండి పూఁత సొగసు సిరులు గురియు!
  మహిళ కంద మిడియు మహిలోన వెలుఁగొందు
  ముద్దబంతిపూలు ముద్దులొలుకు!!

  రిప్లయితొలగించండి
 11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మధురమైన పద్యాలను రచించారు. అభినందనలు.
  మొదటి పద్యం నాల్గవ పాదంలో గణదోషం.. ‘పూవులయెన్ ముద్దబంతిపూవులు ధాత్రిన్!’ అంటే ఎలా ఉంటుందంటారు?

  రిప్లయితొలగించండి
 12. కంది శంకరయ్యగారికి ధన్యవాదములు! నేను గమనించనేలేదు. సవరణమునకు కృతజ్ఞుఁడను. సవరించిన పద్యములు...

  దైవారాధన కొఱకై
  సేవకులుగ హారరూప జీవిత మెసఁగన్
  గేవల నిమిత్తమాత్రపు
  పూవులయెన్ ముద్దబంతిపూవులు ధాత్రిన్!

  పసుపు పచ్చ వన్నె పదహారణాల ప
  సిండి పూఁత సొగసు సిరులు గురియు!
  మహిళ కంద మిడియు మహిలోన వెలుఁగొందు
  ముద్దబంతిపూలు ముద్దులొలుకు!!

  రిప్లయితొలగించండి
 13. ముద్దబంతిపూలు,మూగకనులయూసు
  లతివ మనసు కందమైన గుర్తు
  లోయి యువక!వలపు లొలుకు నామె
  భావమెరిగి మెలగు,ఫలితమొసగు.

  రిప్లయితొలగించండి


 14. మూడవపాదంలో గణదోషం దొర్లినది.దానిని సరిచెస్తున్నాను.''ఓయి యువక,వలపులొలికెడి యా భామ ''అనిసరిచేస్తున్నాను.

  రిప్లయితొలగించండి