7, అక్టోబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1197 (ఆనప పాదునకుఁ జూడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ఆనప పాదునకుఁ జూడ ననుములు పండెన్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

26 కామెంట్‌లు:

 1. ఏనారు పోసి యుంటినొ
  ఆనప పాదునకుఁ జూడ ననుములు పండెన్
  వానకు తడిసిన గింజలు
  నానా టికి పెరిగి పెరిగి నవ నవ లాడెన్

  రిప్లయితొలగించండి
 2. ఇది నా నిన్నటి అనుభవము. లలితా దేవి స్తుతిగా ఆర్యా వృత్తములను (కంద పద్యములను) వ్రాయుటకు సంకల్పించితిని. కాని ఆ అమ్మ నాచే అనుష్టుప్పు ఛందములో రచింపజేసినది. అందుచేత --

  పూనితి నార్యా వృత్తము
  కాని యనుష్టుప్పు లొదవె కమనీయముగా
  నేనంతట దలచితి గద
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి
 3. పూనా లోయొక బామ్మకు
  కానక కానక కడుపున కవలలు బుట్టెన్
  శీనయ గారిపెరటిలో
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి

 4. వానలు కురియగ నాటితి
  నీనేలను త్రవ్వి కొన్ని నెలలున్ గడిచెన్
  కానగ కాయలు కాసెగ
  నానప పాదునకు - జూడ ననుములు పండెన్.

  రిప్లయితొలగించండి
 5. చీనా దేశములో నామకరణము చేసేటప్పుడు బాలెంతరాలు ఒక వెండి చెంచాను పళ్ళెములో పడవేస్తుందిట. అప్పుడు వచ్చే ధ్వని ననుసరించి శిశువికి నామకరణం చేస్తారుట ! మన బ్లాగులో చీనా వారెవరైనా ఉంటే నన్ను మన్నించ గలరు !

  రిప్లయితొలగించండి
 6. ఆనప మఱియును ననుములు
  వానలు కురవ మొలకెత్తె పార్శ్వము లందున్
  ఏనుకొనె రెండు మొక్కలు
  ఆనప పాదునకుఁ జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి
 7. చీనా దేశపు వింతలు
  కానగ కనికట్టు వలెనె గంటికిఁ దోచున్
  హ్యూన త్సీ సుంగ్ మడిలో
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
  =======*============
  వానా కాలము నందున
  బినామి స్థలమందు నాట,పెరిగెను తంత్రుల్
  మానును బ్రాకి,బహుమతిగ
  నానప పాదునకు జూడ ననుములు పండెన్.

  రిప్లయితొలగించండి
 9. ఏనా డోనా టినదిది
  కానగ కాయలు దినములు గడచిన రావే!
  మేనెల లోగన గచిత్రము!
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్.

  రిప్లయితొలగించండి
 10. నానావిధ జన్యుపరం
  బైన క్రియలతో టమోట పైనన్ గాయన్
  లోనన్ వేర్లకు దుంపలు,
  యానప పాదుకుఁ జూడ ననుములు పండెన్!

  రిప్లయితొలగించండి
 11. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....

  మీ వంటి భక్తులతో ఆ దేవి ( శ్రీ దేవి,శ్రీ వాణి ) తమకు కావలసిన మంచి మంచి వృత్తములను వ్రాయించుకొనును.

  సర్వదా ఆ దేవి కృపతో మీరు వ్రాయు పద్యములను చదివిన తప్పక మా జన్మజన్మల పాపములు హరియించును.

  రిప్లయితొలగించండి
 12. నానాజీ తోటనగల
  ఆనపపాదునకుజూడ ననుములు పండెన్
  గా ననుచుండిరిజనములు
  వీనులకది బాగులేదు వినుటకు సామీ!

  రిప్లయితొలగించండి
 13. కానగరాదని దుఃఖము
  తానెంతయు తపనఁ బడెను; తనయుండా మో
  హానఁ బడక బుద్ధుడవగ
  నానపపాదునకుఁ జూడ ననుములు పండెన్.

  రిప్లయితొలగించండి
 14. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  పూనిక గొని శాస్త్రజ్ఞులు
  మానుగ రజ జన్యువులను మార్చుచు కృషి వి
  జ్ఞానమ్మును సాధించగ
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ఇంతకీ నవనవలాడుతున్న ఏ గింజలు?
  *
  పండిత నేమాని వారూ,
  దైవసంకల్పం ఆనపపాదుకు అనుములను పండిస్తుంది. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పూనాలో నొక’ అనండి.
  రెండవ పూరణలో మూడవ పాదంలో గణదోషం. ‘గనగ’ను ‘గన’ అంటే సరి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఆనపకాయలు, అనుములు ఒకేసారి పండాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పార్శ్వమ్ములలో/ నేనుకొనె...’ అనండి.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  కుమారుని వివాహపు పన్నుల్లో వ్యస్తులై కూడా పూరణకు సమయం కేటాయించినందుకు సంతోషం. ధన్యవాదాలు.
  మీ చీనాదేశపు వింత పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. ఆనప కాయలు గాసెర
  ఆనప పాదనకు జూడ, ననుముల పండెన్
  మానవులకు తిండినిడగ
  నే నాటిన యనుప మడిన నిష్కర్షముగా

  రిప్లయితొలగించండి
 17. ఈనాడీ కలికాలము
  లోనను కని వినని వింత లు జరుగు నుండెన్.
  ఆనాడనె బ్రహ్మంగా
  రానప పాదు నకు జూడ ననుములు పండెన్ .

  రిప్లయితొలగించండి
 18. ఈనాడీ కలికాలము
  లోనను కని వినని వింత లు జరుగు చుండెన్
  ఆనాడనె బ్రహ్మంగా
  రానప పాదు నకు జూడ ననుములు పండెన్ .

  రిప్లయితొలగించండి
 19. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  ఆ నవరాత్రుల దేవిని
  పూనుచు శాకంబరి గను పూజలు సేయన్
  బోనము నైవేద్యమిడగ
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి
 20. ఆనప గింజలు నాటిన
  స్థానమునన్ ననుము గింజ జారగ నెట్లో
  నేనుకొనె రెండు లతలు
  ఆనప పాదునకు జూడ ననుములు పండెన్ !

  రిప్లయితొలగించండి
 21. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్షినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. బ్రహ్మంగారిని గుర్తు చేసిన గండూరి వారి పూరణ బాగుంది.అన్వయ లోపం వుందేమొ?

  రిప్లయితొలగించండి
 23. బ్రహ్మంగారిని గుర్తు చేసిన గండూరి వారి పూరణ బాగుంది.అన్వయ లోపం వుందేమొ?

  రిప్లయితొలగించండి
 24. కోనేటిలోని మధుకము
  లానప విత్తులను మేసి
  యానందముగా
  వానలలోపురి విప్పగ
  నానప పాదునకుఁ జూడ ననుములు పండెన్

  రిప్లయితొలగించండి
 25. "ఈనాడు" కబురు తెలిపెను:
  సానసి స్మగ్లరు కడుపున స్కానింగుననున్
  శానా బిస్కటు లుండెన్:
  "ఆనప పాదునకుఁ జూడ ననుములు పండెన్"

  సానసి = బంగారు

  రిప్లయితొలగించండి