కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
బాంధవుడై ధరిత్రి గల ప్రాణులకూపిరులూదు వాని నా
రిప్లయితొలగించండికంధరసీమ సంచరణి గౌరవమొప్పగ నేలు భాస్కరున్,
సింధువులో జనించెడు నశీతమయూఖుని, చాయపెన్మిటిన్
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
సింధువునఁ బుట్టినవాడు సైంధవుడు అనుట సరియౌనా కాదా అను సందేహమున్నది.
అంధనరేంద్రుగూతురగునాసతి దుస్సలపెండ్లియాడగాఁ
రిప్లయితొలగించండిసైందవుఁగూడి; కుంతిగనెశౌర్యరసోజ్వలమూర్తిఁగర్ణునిన్
బంధుజనాళిలోన్ మిగులబమ్మరఁజూచుచునాతనిన్ త్విషీ
బాంధవుఁబుత్రుగానెరిఁగె బాష్పపరీవృతనేత్రయుగ్మయై ||
సింధుర వక్త్ర! నీవు కవిశేఖర మాన్యుడవౌట నెంతయున్
రిప్లయితొలగించండిబంధుడ వీ సమస్య విని బాగుగ పూరణ చేయుమా కృపా
సింధుడ వంచు ప్రార్థనము సేయుదు నొప్పుగ నాలకింపుమా
సైంధవు గూడి కుంతి గనె శౌర్య రసోజ్జ్వల మూర్తి గర్ణునిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభారత యుద్ధము జరుగుటకుముందు అక్కడ సమావేశమైన వారిని కుంతి చూచినదని నాభావం.
రిప్లయితొలగించండిబంధువు కృష్ణుడున్ మరియు పాండవులేవుర నొక్క చోటనే
బంధులు గుర్వులందరును భారతయుద్ధము జేయ జేరగా
నంధుని పుత్రులందరిని యాతని పుత్రిక దుస్సలాపతిన్
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్
క్రమాలంకారము :
రిప్లయితొలగించండిబంధనమందు జొప్పిడక పాండవవీరుల నిల్వరించిరే
సైంధవు కౌరవాది కురుసైన్యము ద్రుంచిన వాని ఫల్గునిన్,
బంధుల పక్షముల్ దెగడి భారతవీరుని చేత చచ్చునీ
సైంధవుఁ గూడి, కుంతి గనె, శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగంధగజేంద్రయాన తన కమ్ముని యిచ్చిన మంత్ర వైభవో
రిప్లయితొలగించండిద్బంధమునుం గనుంగొనఁగ భానునిఁ బిల్చెను; పిల్వఁగన్ జగ
ద్బాంధవుఁడున్ వరమ్మిడెను; తద్రవిఁ బూషుని సప్తశుక్ల స
త్సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్జ్వలమూర్తిఁ గర్ణునిన్!
(సప్తశుక్లసత్సైంధవుఁడు=ఏడు తెల్లని మేలి గుఱ్ఱములు గలవాఁడు=సప్తాశ్వరథుఁడు=సూర్యుఁడు)
బంధము లెర్గ నట్టి తన బాల్యము నందున కోరి నంత సం
రిప్లయితొలగించండిబంధము నొంది సంతు ననివార్యముగా గను మంత్ర మొంది యా
నందముతోడ బిల్చి రవి నందను కర్ణుని నొందె, యెట్టు లా
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్య రసోజ్వల మూర్తిఁ గర్ణునిన్?
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి సమస్యకు మంచి మంచి పూరణలు వచ్చుచున్నవి. సంతోషము. అందరికీ అభినందనలు. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా ప్రయత్నము :
రిప్లయితొలగించండిసైంధవ సప్తకమ్ము గొని చక్కగ బూన్చిన స్యందనమ్మునన్
బాంధవుడై జగమ్ములకు వారిజమిత్రుడు వచ్చుచుండగన్
బంధమునన్ దగుల్కొనుచు పాపము ! మంత్రజపమ్ముచే *తమో
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
*చీకటి కడ్డం పడే వాడు
పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండి"బాంధవ!నన్నువీడుపొరపాటునమంత్రపరీక్ష సేసితిన్
అంధత మిమ్ము బిల్చితిని యాచనసేతు క్షమించగా" ననన్
'బందితుడైతి తప్పదిక పాపనిడం'గనె సప్తవర్ణ స
త్సైంధవు గూడి కుంతి గనె శౌర్యరసోజ్జ్వలమూర్తి గర్ణునిన్
సైంధవు డన్న సూర్యుడని చక్కని యర్థము చెప్పుకొందునా
రిప్లయితొలగించండిబంధము లేదె యిద్దరికి! పద్మపు బంధు వదేమి కూడెనే
బంధన మొప్ప కుంతిని? కృపామతియై సుతునిచ్చె గాని యే
సైంధవుఁ గూడి కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్?
బంధము వీడలేక నెడ బాటు సహించక గుండె బండ యై
రిప్లయితొలగించండిపొందిన మంత్ర శక్తినిల పున్నెము నెంచక బుద్ధి హీనతన్
నెందుల కిట్టి దుస్థితిని నేరక బిల్చితి సూర్య దేవరన్
సైం ధవు గూడి కుంతి గనె శౌర్య రసోజ్వల మూర్తి గర్ణునిన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగంధసుగంధపుష్పముల కాంచనరత్నకిరీటకాంతితో
బంధము వేయుచున్ బొగడి భాస్కరు నందను రాజు జేసి వా
రంధనృపాలనందనులు హారతి బట్టుచు కొల్వు జేరి రా
సైంధవుఁ గూడి, కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగంధసుగంధపుష్పముల కాంచనరత్నకిరీటకాంతితో
బంధము వేయుచున్ బొగడి భాస్కరు నందను రాజు జేసి వా
రంధనృపాలనందనులు హారతి బట్టుచు కొల్వు జేరి రా
సైంధవుఁ గూడి, కుంతి గనె శౌర్యరసోజ్వలమూర్తిఁ గర్ణునిన్.
మిత్రులందరు మంచి మంచి పద్యములను వ్రాసి మన బ్లాగును అలరింప జేసిరి. అందరికీ శుభాశీస్సులు మరియు అభినందనలు.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిగత వారం రోజులుగా ఊళ్ళు తిరుగుతూ తీరిక లేకపోవడం, ఇంటర్ నెట్ అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల బ్లాగును చూచే అవకాశం లభించడం లేదు. నా పరోక్షంలోనూ మిత్రులు నిరాటంకంగా, ఉత్సాహంగా పూరణలు చేస్తూ, పద్యాలను వ్రాస్తూ, గుణదోష విచారణ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
రేపటి నుండి బ్లాగుకు అందుబాటులో ఉండగలనని అనుకుంటున్నాను.