12, అక్టోబర్ 2013, శనివారం

పద్య రచన - 492

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"ప్రకృతి వైపరీత్యములు"

9 కామెంట్‌లు:

 1. ప్రకృతికి కోపము వచ్చిన
  వికృతముగా మారిపోవు విధ్వంసమగున్
  సుకృతము జేయుచు నుండిన
  ప్రకృతియె శాంతించి కొంత బాధల దీర్చున్.

  రిప్లయితొలగించండి

 2. వింత పోకడలను విపరీత బుద్ధితో
  ప్రకృతి మేలు మరచి పాడు మనిషి
  హాని చేయుచుండ నట్లె యగుం గదా
  ప్రకృతివైపరీత్యపాపి నరుడె.

  రిప్లయితొలగించండి
 3. వాయుగుండములీమధ్య వరుసవరుస
  వచ్చుచుండెను గప్రకృతి వైపరీత్య
  ములివియెగమఱి,వాటిల్లు ముప్పులు, పలు
  విధములగునష్టములుగల్గు వేంకటేశ!

  రిప్లయితొలగించండి
 4. ఇదేమి వైపరీత్యమంచునిప్పుడిట్లు చింతలున్
  పదింతలైన వేళలన్ సభాముఖమ్ముగా నిదో
  యదో యటంచు నేతలెల్లరర్థరూపదానముల్
  విదల్చ మేలుగాదు! కొంత వృద్ధిఁ జూపగా తగున్
  సదా ప్రయోజనమ్ముకల్గు సద్వివేక రీతులన్.

  సహృదయతతో కూడిన వ్యాఖ్యలతో ప్రోత్సహించే మిస్సన్న గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 5. మనుజ పాప మెల్ల మహిలోన గుణితమై
  ప్రకృతి వైపరీత్య పగిది మారి
  ప్రాణ యాస్తి రూప హాని కారకమగు
  తెలిసి నడువ నరుఁడు కలత వీడు

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమానిగారికి పూజ్యులు శంకరయ్యగారికి
  వందనములు
  కలత జెంది ప్రకృతి యలిగె జ్వాలముఖిగ
  గాలివాన పుడమి కడలి కదల
  వరద పొంగు కలుష పర్యావరణముచే
  కలిగె వైపరీత్యములు తెలియుమ

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి అంశము గురించి మంచి రచనలు వచ్చినవి. అందరికీ అభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  ప్రకృతికి వచ్చే కోపము గురించి ప్రస్తావించేరు. బాగుగ నున్నది.

  శ్రీ మిస్సన్న గారు:
  పర్యావరణ కాలుష్యము అనే స్వయంకృతాపరాధము అన్నారు. చాల బాగుగ నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  వరుసగా వాయుగుండాలు వచ్చుటను ప్రస్తావించేరు. బాగుగ నున్నది.

  శ్రీమతి లక్ష్మీదేవి గారు:
  పంచపాద పంచచామరమును చక్కగా వ్రాసిరి. చాలా బాగుగనున్నది - నేతలకు మీ బోధలు చేరును లెండి.

  శ్రీ సహదేవుడు గారు:
  మనుజ పాపమెల్ల గుణితమగును అన్నారు. బాగుగ నున్నది. ప్రాణ యాస్తి అన రాదు - ప్రాణ విత్త అందాము.

  శ్రీ తిమ్మాజీ రావు గారు:
  కలత జెంది ప్రకృతి యలిగె అన్నారు. చాల బాగుగ నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ నేమని గురువర్యులకు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:

  మనుజ పాప మెల్ల మహిలోన గుణితమై
  ప్రకృతి వైపరీత్య పగిది మారి
  ప్రాణ విత్త రూప హాని కారకమగు
  తెలిసి నడువ నరుఁడు కలత వీడు

  రిప్లయితొలగించండి