హ్రా ప్రాసతో చక్కని పూరణలు చేసిన కవిమిత్రులందరికీ అభినందనలు. మాస్టరుగారూ డెహ్రాడూన్ నుండి మెహ్రాను తెచ్చిన పూరణ బాగుంది. మీ హ్రీ దూరుని చూచినతరువాత నాకు వచ్చిన అలోచనతో మరియొక పూరణ...
ఏ హ్రస్వ బుధ్ధి జెప్పెను నే హ్రాదిని ఘాతమిత్తు నెపమెంచుటకై ఏహ్రీ దూరుండిట్లనె నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుఁ డనన్?
ఏల్చూరి మురళీదర రావు గారూ, అనన్యసామాన్య పదప్రయోగమూ, అత్యద్భుతమూ అయిన మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘లహ్రానా జేయ’ అంటే బాగుంటుందేమో! * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. మూడు పాదాల గణదోషాలను సవరించారు కదా... సంతోషం. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘పొగడన్ + ఏ’ ఇక్కడ యడాగమం రాదు.‘మారుతమ్ము లదె పొగడ నొకం/డే హ్రీదూరుడు వదరును...’ అందామా? * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది.అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణలు రెండూ మీ సంస్కృత భాషాజ్ఞానానికి అద్దం పడుతున్నాయి.అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నము ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు. 2,3 పాదాల ప్రారంభంలో యడాగమం దోషం. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ‘హ్రా’ప్రాసను ప్రస్తావిస్తూ ఎవరు పూరణ చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక మీరు తీర్చారు. చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
ఈ హ్రీవిరహితదుర్నీ
తిహ్రదగతులకు దురాత్మధీనిష్ఠురదృం
భూహ్రీకుం డగు సన్మతి
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
01అ)
రిప్లయితొలగించండి__________________________
నెహ్రూ ప్రధానమంత్రిగ
లహ్రానా నింప, దేశ, - ప్రజలందరిలో;
ప్రహ్రాదము గాదె ? వినగ
నెహ్రూ తగడంట రాజ - నీతిఙ్ఞు డనన్ !
__________________________
లహ్రానా = ఆనందముగ నుండుట
ప్రహ్రాదము = ధ్వని/శబ్దము(అపవాదు)
రిప్లయితొలగించండినెహ్రూ కాలంబందున
నెహ్రూ ప్రత్యర్థి కూడ నెవ్వరుగూడన్
నెహ్రూననలేదిట్టుల
నెహ్రూ తగడంట రాజ - నీతిఙ్ఞు డనన్ !
నెహ్రూజి విజ్ఞాన ఖనికద
రిప్లయితొలగించండినెహ్రూజి బాలల మనసుల నిలిచిన చాచా
నెహ్రూజి నెవరందురిటుల
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్
పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిఈహ్రదములు నీశైలము
లా హ్రాదిని మారుతమ్ములన్నియు బొగడన్
యే హ్రీకమ్మో వదరును
నెహ్రూ తగడ౦ట రాజ నీతిజ్ఞుడనన్
రాజకీయ దుష్ట క్రీడలో...
రిప్లయితొలగించండినెహ్రూ నచ్చిన వారికి
నెహ్రూ తగునంట రాజ నీతిజ్ఞుడనన్!
నెహ్రూ నచ్చని వారికి
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుడనన్!
అహ్రీణనాటకాంచిత
రిప్లయితొలగించండిదుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
త్సుహ్రీచ్యుత నేతల కిల
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్!(1)
కొద్ది మార్పులతో...మఱి రెండు...
అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
ద్విహ్రేపణోత్కుల కిల
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్! (2)
అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
త్సహ్రీకపదోత్కటులకు
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్! (3)
ఏ హ్రదిని హతికి జంకని
రిప్లయితొలగించండినేహ్రూయే ధైర్యశాలి నిజముగ నాడే !
నెహ్రూ నెవ రందు రిలా ?
" నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్ "
నెహ్రూ విజ్ఞాన ఖనికద
రిప్లయితొలగించండినెహ్రూ బాలల మనసుల నిలిచిన చాచా
నెహ్రూ నెవరందురిటుల
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్
నా పూరణములలో రెండవ పాదములో టైపాటు: "దుర్య"ను, "ధుర్య"గాఁ జదువుకొనవలసినదిగా మనవి.
రిప్లయితొలగించండిఈ హ్రీకము వంటి జనులు
రిప్లయితొలగించండియా హ్రీవేరము యనదగు యధి కాధికునిన్
యే హ్రీకుడు బలుక దగడు
నెహ్రూ తగడంట రాజ నీతిజ్ఞు డనన్
హ్రీకము = ముంగిస
హ్రీవేరము = కురు వేరు ,సుగంధి వృక్షము ,కేశము
హ్రీకుడు = సిగ్గు కలవాడు
ఈ హ్రా ప్రాసము దుష్కర
రిప్లయితొలగించండిమై హ్రాదినివోలెతోచెనయ్యా, నేడీ
ప్రహ్రాద కలుష జాతికి
నెహ్రూ తగఁడంట రాజ నీతిజ్ఞుఁడనన్.
హ్రాదిని = వజ్రాయుధము
ప్రహ్రాదము = రొద, రోత,
శ్రీ గుండు మధుసూధన్ గారూ,
రిప్లయితొలగించండిఅధ్భుతంగా వ్రాశారండీ. దుష్కరప్రాసను హేలారీతిగా పూరించారు. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినెహ్రాయని పలుకంగా
మిహ్రా తాన్ తప్పు వ్రాసె మీనాక్షివలెన్
చౌహ్రా జదివెను వడిగా
"నెహ్రూ తగడ౦ట రాజ నీతిజ్ఞుడనన్"
డెహ్రాడూన్ వాస్తవ్యుఁడు
రిప్లయితొలగించండిమెహ్రా యనువాఁ డొకండు మిథ్యాజ్ఞానుం
డై హ్రీదూరుఁడయి యనెను
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుఁ డనన్.
ధన్యవాదాలు సంపత్ కుమార్ శాస్త్రిగారూ. మీ పూరణము కూడ చక్కగ నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమిత్రులు ఏల్చూరివారికి నేఁడు ప్రథమతాంబూలం దక్కినది. అటులనే వారి పూరణ కూడా ప్రశస్తముగ నున్నది. దుష్కర ప్రాస నవలీలగా భావావిష్కరణమునకు సూచికనుగా మలచుకొన్నారు. అభినందనలు...మఱియు...జన్మదిన శుభాకాంక్షలు!
మిత్రులు కంది శంకరయ్యగారూ! తమరి భావము అద్భుతముగ నున్నది. మా కెవ్వరికిని తట్టలేదు. అభినందనలు.
హ్రా ప్రాసతో చక్కని పూరణలు చేసిన కవిమిత్రులందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ డెహ్రాడూన్ నుండి మెహ్రాను తెచ్చిన పూరణ బాగుంది. మీ హ్రీ దూరుని చూచినతరువాత నాకు వచ్చిన అలోచనతో మరియొక పూరణ...
ఏ హ్రస్వ బుధ్ధి జెప్పెను
నే హ్రాదిని ఘాతమిత్తు నెపమెంచుటకై
ఏహ్రీ దూరుండిట్లనె
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుఁ డనన్?
ఏల్చూరి మురళీదర రావు గారూ,
రిప్లయితొలగించండిఅనన్యసామాన్య పదప్రయోగమూ, అత్యద్భుతమూ అయిన మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లహ్రానా జేయ’ అంటే బాగుంటుందేమో!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడు పాదాల గణదోషాలను సవరించారు కదా... సంతోషం.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పొగడన్ + ఏ’ ఇక్కడ యడాగమం రాదు.‘మారుతమ్ము లదె పొగడ నొకం/డే హ్రీదూరుడు వదరును...’ అందామా?
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది.అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణలు రెండూ మీ సంస్కృత భాషాజ్ఞానానికి అద్దం పడుతున్నాయి.అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నము ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
2,3 పాదాల ప్రారంభంలో యడాగమం దోషం.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
‘హ్రా’ప్రాసను ప్రస్తావిస్తూ ఎవరు పూరణ చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక మీరు తీర్చారు. చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండినా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నా పూరణను మెచ్చినందుకు ధన్యవాదాలు.
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.