అతి భోజనకాంక్షల నా యతి మైధున వాంఛల మరి యతిధోరణులన్ మితిమీరిచరించగ నా పతితల-ఖండించెనంట-పార్వతి కినుకన్. మనవి: అన్నీ స గణాలే పడ్డాయి అనుకోకుండా, రెండోపాదం మధ్యలో నల తప్ప. మరి జ కాక పోతే నల తప్పదుకదా!
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
అందరికీ అభివందనములు !
(కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో సేవకుడు జరిగిన విషయమును తన మిత్రులకు దెలుపుచు, నా పేరు చెప్పవలదని జెప్పుచు ) =========*======== సుతులకు'సిరి'బంచిన భూ పతి తల ఖండించెనంట!పార్వతి కినుకన్! హితులకు రయమున దెలుపుడు వితరణ జేయ వలదనుచు, పేరు దెలుపకన్!
వసంత కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ రమ్యంగా ఉంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘ఉమాపతి’ సాధారణ వ్యక్తియేగద! * వరప్రసాద్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * ఆదిత్య గారూ, అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు. మా అబ్బాయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకున్నాడనీ, రేపు ఆపరేషన్ అనీ ఫోన్ వచ్చింది. మేము మా అమ్మాయి దగ్గర ఉన్నాము. వెంటనే బయలుదేరుతున్నాము. రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను.
అయ్యా! శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. శ్రుతి అనుట సాధు ప్రయోగము. మీరు శృతి అని ఉపయోగించుట సాధువు కాదు. స్వస్తి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ముల్లోకములనూ పీడిస్తున్న మహిషుణ్ణి వధించుటకై పార్వతి :
01)
___________________________________
స్థితి, లయముల జేయుటకై
అతివీర ,భయదపు రూపు - నంబిక దాల్చెన్ !
గతి తప్పిన గర్వాంధా
పతి తల ఖండించె నంట - పార్వతి కినుకన్ !
___________________________________
స్థితి = శిష్ట రక్షణ
లయము = దుష్ట శిక్షణ
భయదము = భయకరము
అంబిక = పార్వతి = కాళి = జగజ్జనని = మహిషాసురమర్ధిని
గతి తప్పిన గర్వాంధాపతి = మహిషాసురుడు
పార్వతీ నందనుడని తెలియని శివుడు :
రిప్లయితొలగించండి02)
___________________________________
అతడెవరో తెలియని, సతి
పతి , తల ఖండించె నంట ! - పార్వతి కినుకన్
హత మొనరించగ హరుడే
బ్రతికించె కరటి శిరమున - బాలగణేశున్ !
___________________________________
సతిపతి = శివుడు
కరటి = ఏనుగు
అతి భోజనకాంక్షల నా
రిప్లయితొలగించండియతి మైధున వాంఛల మరి యతిధోరణులన్
మితిమీరిచరించగ నా
పతితల-ఖండించెనంట-పార్వతి కినుకన్.
మనవి: అన్నీ స గణాలే పడ్డాయి అనుకోకుండా, రెండోపాదం మధ్యలో నల తప్ప. మరి జ కాక పోతే నల తప్పదుకదా!
మహిషాసురుని స్త్రీ సైన్యం పార్వతి చేత హతం :
రిప్లయితొలగించండి03)
___________________________________
అతి ఘోరమైన రూపున
అతివ లనుచు నెంచకుండ - నాహవ మందున్
మితి నెరుగని రీతి నపుడు
పతితల ఖండించె నంట ! - పార్వతి కినుకన్ !
___________________________________
ఆహవము = యుద్ధము
మితి = హద్దు
పతిత = భ్రష్టురాలు (ధర్మభ్రష్టురాలు)
(దుష్టుణ్ణాశ్రయించుట ధర్మ భ్రష్టత్వమే గద)
అతి భయద రణక్షోణిన్
రిప్లయితొలగించండిధృత దివ్యాయుధ మహేశి తీవ్ర బలముతో
దితిసుతు మహిషు నసురరాట్
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్
మితిమీఱిన కృతములఁ గని
రిప్లయితొలగించండిసతతదురితు మహిషు దుష్టు సాహంకారున్
గ్రతువిధ్వంసకు దానవ
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్!
గతినీవెయనుచు మ్రొక్కగ
రిప్లయితొలగించండిమతిహీనుడు మందబుద్ధి మహిషాననుడౌ
అతిదుర్మార్గుడు రాక్షస
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్
కవిమిత్రుల పూరణలు బాగున్నవి.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ ! ' స ' లక్షణంగా రాశానంటారు..బాగుంది.
ప్రతిసతి పార్వతి గాదే
రిప్లయితొలగించండిమతిచెడి పరసతులగోరు మహిషుల నణచన్
అతిహీనుండయినఉమా
పతి తల ఖండించెనంట-పార్వతి కినుకన్
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
అందరికీ అభివందనములు !
(కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో సేవకుడు జరిగిన విషయమును తన మిత్రులకు దెలుపుచు, నా పేరు చెప్పవలదని జెప్పుచు )
=========*========
సుతులకు'సిరి'బంచిన భూ
పతి తల ఖండించెనంట!పార్వతి కినుకన్!
హితులకు రయమున దెలుపుడు
వితరణ జేయ వలదనుచు, పేరు దెలుపకన్!
(భూ పతి= ముఖ్యమంత్రి, పార్వతి= సోనియా )
మహా దేవుడు (శివుడు) తన మాట వినని గణపతి శిరము ఖండించేను !ప్రమద గణములతో సురలోకమున శిరము నిచ్చు వానిని వెదకి,ఆ శిరమును పట్టుకు రమ్మునును.
రిప్లయితొలగించండి=========*========
హిత బలుకులను వినని గణ
పతి తల ఖండించెనంట!పార్వతి కినుకన్!
సతి పతి ఖిన్నుడయి దెలిపె
సుతునకు వెదకుడు శిరమును సుర లోకమునన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్యగారికి వందనములు
అతి వాదము లాడిన వా
క్పతితల ఖండించె నంట "పార్వతి కినుకన్
వెతలను"బాపగ నీశుడు
ప్రతీతమయె"బ్రహ్మతలగ"శ్రాద్ధము లిడగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమితి మీఱిన కామముతో
రిప్లయితొలగించండినతివల మన్నది మఱచియునహరాత్రములున్
జతగూడగ వెనుకాడని
పతితల ఖండించె నంట పార్వతి కినుకన్
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ రమ్యంగా ఉంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఉమాపతి’ సాధారణ వ్యక్తియేగద!
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
ఆదిత్య గారూ,
అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
శృతి దూరుఁడగుచు విద్వ
రిప్లయితొలగించండిత్పతి వరమున నెగడు దురిత భావంబుల స
న్మతులన్ జెరచెడు దానవ
పతి తల ఖండించి వైచె పార్వతి కినుకన్.
గురువు గారికి వందనములు.
రిప్లయితొలగించండిఈ సమస్యను అవధానివర్యులు శ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ గారిచే కాకినాడలో జరిగిన అష్టావధానములో పూరించడము జరిగినది.
ఆ పూరణ మన కవిమిత్రుల కొఱకు.
సతి మహిషాసురమర్దని
గతి తప్పిన దేవతాళి కష్టము తొలగన్
మతిదాకరుణన్ రాక్షస
పతి తల ఖండించి వైచె పార్వతి కినుకన్.
మన కవిమిత్రుల పూరణలు కూడా అవధానుల పద్యానికి ధీటుగానే ఉన్నాయి. పూరణలను పంపిన కవిమిత్రులందరికి అభినందన పూర్వక ధన్యవాదములు.
దన్యవాదములు గురువుగారు,..నా పద్యములో ఉమాపతి, పార్వతి, సాధారణ వ్యక్తులే..
రిప్లయితొలగించండిఅతి దుర్మార్గుడు సురలను,
రిప్లయితొలగించండియతులను నరకాసురుండు నారడి పెట్టన్
నుతి విని వారల దానవ
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్.
ఇతడిక వధార్హు డెన్నగ
రిప్లయితొలగించండిశతమాయెను దోషములును చంపెద నని శ్రీ
పతి పల్కి చేది ధరణీ
పతితల ఖండించె నంట పార్వతి! కినుకన్.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా అబ్బాయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకున్నాడనీ, రేపు ఆపరేషన్ అనీ ఫోన్ వచ్చింది. మేము మా అమ్మాయి దగ్గర ఉన్నాము. వెంటనే బయలుదేరుతున్నాము. రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమొదటి పద్యములో నరకాసు రుండని పొరపాటున వ్రాశాను
సరిదిద్దినాను గమనించ ప్రార్థన
అతి దుర్మార్గుడు సురలను,
యతులను మహిసాసురుండు నారడి పెట్టన్
నుతి విని వారల దానవ
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్.
అయ్యా! శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రుతి అనుట సాధు ప్రయోగము. మీరు శృతి అని ఉపయోగించుట సాధువు కాదు. స్వస్తి.
శంకరార్యా !
రిప్లయితొలగించండిమీ అబ్బాయి ప్రమాద వార్త విని చాలా బాధ కలిగింది !
త్వరలోనే స్వస్థత చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండి"చేది ధరణీ పతితల ఖండించె నంట పార్వతి"
ఇందులోని అంతరార్థమేమో
నా మట్టిబుర్ర కందడం లేదు !
దయచేసి కొంచెం వివరిస్తారా ?
మిత్రులు వసంతకిశోర్ గారూ! మిస్సన్నగారి పూరణంలోని మాటలు...ఒక వక్త, పార్వతి అనే శ్రోతతో అన్నవి. పార్వతిని సంబోధించుచు "పార్వతీ! చేది ధరణీపతి దోషములు ఎన్నగ శతసంఖ్యాకములైనవి. అతనిని చంపెదను...అని పల్కి, శ్రీపతి(శ్రీకృష్ణుఁడు)కినుకతో అతని తలను ఖండించెనంట!" అని వక్త, పార్వతి అనే శ్రోతతో అన్నదని మిస్సన్నగారి పద్యభావము.
రిప్లయితొలగించండిఅమ్మా నీ దర్శనాభిలాషినైతి అని, అనుష్టాన రీతి
రిప్లయితొలగించండిపూజించు బిడ్డ సాధన,బ్రహ్మ-విష్ణుల దాట కలిగి ప్రీతి,
అనుగ్రహించి ద్యుతి, తొలగించుటకు సుధాసారపు మితి
అజ్ఞా-చక్ర, పతి తల ఖండించేనంట పార్వతి కినుకన్
నిన్నటి నా పంక్తులలో తప్పు ఉన్నది అందుకే మార్పు చేసి మరల వ్రాశాను. నా రచనకు స్ఫూర్తి
మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ || ౩౮ ||
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ || ౩౯ ||
మిస్సన్నమహాశయుల అంతరార్థం విప్పి చెప్పినందులకు
రిప్లయితొలగించండిమిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు !
నా మట్టిబుర్ర యెంతసేపూ శివపత్ని పార్వతి గురించే
ఆలోచిస్తూ ఉండిపోయింది గాని
పార్వతి ఒక మామూలు మనిషనే ఆలోచన రాలేదు !
శ్రీ గుండు మధుసూదను గారికి, కిశోర మహోదయులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగతిలేక వాని పదముల
రిప్లయితొలగించండిసతతము సేవించుచున్న జనులందరికా
వెతలను దీర్పంగ మహిషపతి
తల ఖండించెనంట పార్వతి కినుకన్.
అతిబల రాముడు లంకా
రిప్లయితొలగించండిపతి తల ఖండించెనంట; పార్వతి కినుకన్
ప్రతిమను ఖండించిన తన
పతిచే పునరుద్ధరించి పరవశ మొందెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికుతినిన్ శంకర శాస్త్రియె
రిప్లయితొలగించండిమితిమీరిన కర్చు జేసి మీనము కొనగా
నతిగా రోయుచు మత్స్యపు
పతి తల ఖండించెనంట పార్వతి కినుకన్
పతి = రాజు