24, అక్టోబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1214 (గౌరియె యేఱు గంగ నదికాదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
గౌరియె యేఱు గంగ నదికాదని యందురు పండితోత్తమ్ముల్.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. శంకరార్యా !
    మీ అబ్బాయి ప్రమాద వార్త విని చాలా బాధ కలిగింది !
    త్వరలోనే స్వస్థత చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    సంధి ప్రేలాపనలను శివుడు మెచ్చడు గదా :

    01)
    ___________________________________________

    మారిన నేటి కాలమున - మాటల కర్థము మారి పోవునా ?
    నీరును , నిప్పు నీ వనిన - నీర మదగ్నిగ మారి కాల్చునా ?
    పేరును యూరు లేని యవి - వేకులు , మూర్ఖులు, పిచ్చివారలే
    గౌరియె యేఱు, గంగ నది - కాదని యందురు ! పండితోత్తమ్ముల్
    దూఱుదు రట్టి వారలను ! - ధూర్తుడు మెచ్చునె ధూర్త వర్తనన్ !
    ___________________________________________
    ధూర్తుడు = శివుడు
    ధూర్తవర్తన = మోసపూరితముగా ప్రవర్తించు

    రిప్లయితొలగించండి
  3. పాఱును నీరు పల్లమున పావన గంగయె భోగ మందుచున్
    కోరదు హెచ్చు తగ్గులను కోమలి యీశుని యాజ్ఞ మీరకన్
    జేరును సంత సంబునను సింధువు నందున వాగు వంకలన్
    గౌరియె యేఱు గంగ నది కాదని యందురు పండి తోత్తముల్

    రిప్లయితొలగించండి
  4. (పరమార్థ దృష్టితో జూచినచో గౌరి యొక కరుణా రస ప్రవాహినియై భక్తుల సంసార తాపములెల్లను బోగొట్టును, వారి జ్ఞాన సంపద యను పంటలను వృద్ధి చేయును, వారికి సంతతము జీవనాధరముగా నుండును - గంగ అట్లు కానేరదు అని నా భావము).

    గౌరియె యేరు, భక్తులకు కల్గెడు తాపము లెల్ల దీర్చు, పెం
    పారగ జేయు విద్యయను పంటల నెల్లను, సంతతమ్ము నా
    ధారము జీవకోటికగు, తద్దయు గాంచుచు జ్ఞానదృష్టితో
    గౌరియె యేరు, గంగ నది కాదని యందురు పండితోత్తముల్

    (సూచన: సమస్యను వ్రాయునపుడు శ్రీ కంది శంకరయ్య గారికి ఒకె టైపు పొరపాటు దొరలినది - సమస్య చివరలో పండితోత్తముల్ అనుటకు బదులుగా పండితోత్తమ్ముల్ అని పడినది - మిత్రులు సరి చేసుకొనండి - స్వస్తి).

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! మీ అబ్బాయికి త్వరలోనే స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి

  6. గౌరియె వ్రాసి చూపె నొక కాగితమందున తండ్రికిట్లు ' శ్రీ
    గౌరియె యేఱు, గంగ నది కాదని యందురు పండి తోత్తముల్ '
    మారిచి వ్రాసెనిట్లు నొక మాటను ' యేఱు' కు నెత్వమీయగా
    గౌరియె యేఱు, గంగ - యెఱుగంగ -గ మారెను చూడనర్థమౌ.

    రిప్లయితొలగించండి

  7. గౌరికి జెప్పె తండ్రి యొక కాగితమందున వ్రాయమంచు నా
    గౌరియె గౌరియేగ - యెరుగంగగ మార్చుము యేరు గంగనే
    ఘోరమనర్థముల్ గనగ గొప్పగ మారునటంచు నిట్లు "శ్రీ
    గౌరియె యేరు, గంగ నది కాదని యందురు పండితోత్తముల్"

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    శ్రీ శంకరయ్య గారికి,మీ అబ్బాయికి త్వరలోనే స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను.

    కందములో
    =========*============
    గిరి పై వసియిం చెడి వా
    నర! గౌరియె యేఱు,గంగ నది కాదని యం
    దురు పండి తోత్తములు!ఈ
    శ్వర భార్యకు, గంగ నది యు సమమౌనిలలో ?

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    వారిధి నల్పపీడనము వర్ధిలుచుండగ కారు మేఘముల్
    భూరిగ విస్తరించగను బోరన నాగక కుoభవృష్టియై
    మీరుచు తొట్రిలంగ నిక మిన్నుయు నేలయు నేకమై చనన్
    గౌరియె యేరు.గంగ నదికాదని యందురు పండితోత్తముల్

    గౌరి =భూమి
    శంకరయ్యగారికి మీఅబ్బాయి స్వాస్థ్యము కై భగవంతుని
    ప్రార్ధించుచున్నాను

    రిప్లయితొలగించండి
  10. విచక్షణ మరచిరి యాంత్రిక జీవన పరుగులందు నరుల్
    కాలుష్య నియంత్రణ విడిచిరి వారి తరము కాక ఉద్యోగుల్
    అంబుధి కళ తప్పె, ముముక్షులు విడిచిరి గంగలో తమ శవముల్,
    గౌరియె యేఱు, గంగ నది కాదని యందురు పండితోత్తముల్.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భూరిదయాస్వరూపుడగు పుంగవ వాహనుడైన గోపతిన్
    కోరితపించి జేరె సతి కోమలి గౌరియె యేరు గాగ నీ
    ధారుణి జీవరాసులకు దంపతులిద్దరు అన్నదాతలన్
    గౌరియె యేరు గంగనది కాదని యందురు పండితోత్తముల్

    ఏరు=నాగలి ;గంగనది =గంగను +అది

    రిప్లయితొలగించండి
  12. దారుణి యందు కల్లరులు ధర్మవిహీనలు జ్ఞాన శూన్యులున్
    గౌరియె యేఱు గంగ నది కాదని యందురు, పండి తోత్తముల్
    వారవివేకు లిట్టులనె వాగుచు నుందు రవాస్త వాక్కులన్
    మీరది నమ్మబోకుడని మిక్కిలి నొక్కుచు జెప్పుదుర్సదా .


    రిప్లయితొలగించండి
  13. Laxminarayan Ganduri గారూ మీ చమత్కార పూరణ బాగుంది.
    దారుణి యందు కల్లరులు ధర్మవిహీనలు జ్ఞాన శూన్యులున్
    గౌరియె యేఱు గంగ నది కాదని యందురు, పండి తోత్తముల్
    వారవివేకు లిట్టులనె వాగుచు నుందు రవాస్త వాక్కులన్
    మీరది నమ్మబోకుడని మిక్కిలి నొక్కుచు జెప్పుదుర్సదా .

    శ్రీ శంకరయ్య గారికి,మీ అబ్బాయి ప్రమాదం గురించి తెలిసినది. త్వరలోనే స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి నమస్సులు. మీ అబ్బాయి త్వరలోనే కోలుకోవాలని భగవంతునకు మా ప్రార్ధనలు.

    రిప్లయితొలగించండి
  15. గౌరియె యేరు, గంగ నది కాదని యందురు పండితోత్తముల్

    'గౌరియె' ని 'గౌరియే' గా ... 'యేరు గంగ' ను 'యెరుగంగ ' గా మార్చితే అర్థవంతముగా నుండునని నాభావన..నా పూరణలో అది స్పష్టముగా తెలియుచున్నదా...

    రిప్లయితొలగించండి
  16. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    నమస్సులతో, చిరంజీవి మీ అబ్బాయికి స్వస్థత చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, క్షేమవార్తను ఎప్పుడు వినిపిస్తారా అని ఎదురు చూస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మీ అబ్బాయి కోలుకొనుచున్నట్లు తలంచుచున్నాను. భగవంతుని కృప వలన త్వరలో సంపూర్ణ స్వస్థత చేకూరును. మీ నుండి క్షేమ వార్తకై ఎదురు చూచుచున్నాను. స్వస్తి.
    సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  18. కూరిమి దాను భక్తులకు కోర్కెల దీర్చు దయామృతాబ్ధి శ్రీ
    నీరజనేత్రి దీవనల నెమ్మనమందున కోరువారికిన్
    చేరి పదాంబుజమ్ములను సెల్వమటంచు భజించువారికిన్
    గౌరియె యేఱు గంగ నదికాదని యందురు పండితోత్తమ్ముల్.

    రిప్లయితొలగించండి
  19. ధారుణి యందు మానవులు ధర్మపరాయణులై వసింప నా
    పౌరుల రక్షణార్థమయి బాధ్యత తోడుత కూడు గుడ్డలన్
    నీరము నిచ్చి కాచునని నిత్యము పూజల నందు నామె యీ
    గౌరియె యేఱు గంగ నది కాదని యందురు పండితోత్తముల్!

    రిప్లయితొలగించండి
  20. బొడ్డు శంకరయ్య గారూ,
    మీరు వృత్తరచనలో రోజురోజుకు నిపుణతను సంతరించుకుంటున్నారు. సంతోషం. అభినందనలు..

    రిప్లయితొలగించండి
  21. వారము వారమున్ విరివి వ్యాజ్యము చేయగ మాతలిర్వురున్
    మీరిన యాశ తోడుతను మిక్కిలి దుడ్డును లాగి నవ్వుచున్
    పోరగ కోర్టునందునను పోకిరి సిబ్బలు తాండవించుచున్
    గౌరియె యేఱు గంగ నదికాదని యందురు పండితోత్తముల్

    సిబ్బలు = Kapil Sibal

    రిప్లయితొలగించండి