5, ఏప్రిల్ 2014, శనివారం

సమస్యాపూరణం - 1373 (మార్జాలము సింహ మయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో.

23 కామెంట్‌లు:

  1. ఘూర్జర సీమలలో నొక
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో?
    నిర్జరవర! యన బదులిడె
    ఖర్జూరము తినుట వలన కాబోలు సుమా!

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.
    మార్జాలమునకు ఖర్జూరము తిని పించుట చాలా బాగున్నది !

    రిప్లయితొలగించండి
  3. దర్జగ నేతలు సంపద
    లార్జించి బలిష్టులైరి యవినీతి గతిన్
    దుర్జన పరిపాలనలో
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో

    రిప్లయితొలగించండి
  4. దుర్జన శ్రేష్టులు ధనసం
    పార్జనయే పరమమనుచు పాలిం పంగన్
    గర్జించలేనిఓటరు
    మార్జాలము, సింహమయ్యె మర్మoబేమో !!!

    రిప్లయితొలగించండి
  5. అర్జున్ యింటను పెరిగిన
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో!
    ఖర్జువు కుట్టిన దేమో!
    గర్జించుచుసింహమువలె గడపను దాటెన్

    రిప్లయితొలగించండి
  6. మీర్జా ప్రేమగ పెంచన్
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో?
    కార్జముకూరయు లేదని
    యూర్జిత కోపము గలుగగ నుఱికెను సుమ్మా!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..

    సరదాగా:"గుర్జారి"మురార్జీ వారి వంశమని,మురార్జి దేశాయ్ నీతి నిగమము లందు కుబేరుడు,నేటి రాజకీయ నాయకులు రాక్షసులని
    ===========*============
    గుర్జారి వంశ మందున
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో?
    తర్జన భర్జన లేల ము
    రార్జి కుబేరుడుగ నేటి రక్కసుల గనన్!

    రిప్లయితొలగించండి
  8. నిర్జన ప్రదేశ మందున
    మార్జాల తపంబు మెచ్చి మహిమాన్వితుడే
    తర్జనితో గీర నుదుట
    మార్జాలము సింహ మయ్యె మర్మంబేమో?

    రిప్లయితొలగించండి
  9. తర్జన భర్జన సలుపక
    "మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో"
    ధూర్జటిగా బలుకుమనిన
    దుర్జనులిట పదవి గోర దూషించుడనెన్

    రిప్లయితొలగించండి
  10. సార్జెంటు ప్రేమఁ బెంచిన
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో?
    మార్జికఁ ద్రాగెనని కనలి
    మార్జని తోడఁ దఱుమసతి,మార్కొనె కసితో.

    రిప్లయితొలగించండి

  11. అర్జును డనె బావా యె
    ట్లార్జించెను ధైర్య మట్టు లానా డనిలో
    దుర్జనుడు జయద్రధుండు ?
    మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో!
    ********************
    ********************
    అర్జున! నిజమే కనగా
    మార్జాలము సింహమయ్యె మహనీ యంబౌ
    ధూర్జటి వర గర్వంబున
    దుర్జనుడౌ సైంధవుండు దుడుకుగ మసలెన్.

    రిప్లయితొలగించండి
  12. నిర్జీవమైన బ్రతుకును
    వర్జింపగ ప్రభుతపైన బాహాటముగా
    గర్జించ పేద వాడను
    'మార్జాలము' సింహమయ్యె మర్మంబేమో?

    రిప్లయితొలగించండి
  13. దర్జా యొకడ ట బ్రీతిని
    మార్జాలపు బొమ్మ గీయ మఱి యది చూడన్
    నిర్జీవపు రూపంబున
    మార్జాలము సింహమయ్యె మర్మంబే మో

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి సమస్యకు వైవిధ్యముతో కూడిన పూరణలు వచ్చినవి. అన్నియును బాగుగ ఉన్నవి. అందరికి అభినందనలు.
    అక్కడక్కడ ఉన్న కొన్ని పొరపాటులకు కొన్ని సూచనలు:

    శ్రీమతి శైలజ గారూ:
    అర్జున్ యింటను అన్నారు. అక్కడ యడాగమము రాదు. అర్జునునింటను అనవచ్చును.

    శ్రీ మిస్సన్న గారూ:
    మీ పద్యములో కందపద్యము 3 వపాదము ఇలాగ నున్నది:
    దుర్జనుడు జయద్రధుండు.
    3వ గణము (బేసి గణము) జగణము ఉండకూడదు కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ వరప్రసాద్ గారు:
    శుభాశీస్సులు.
    మా పద్యమును గూర్చి మీరు స్పందించినందులకు సంతోషము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఆర్జించె పదవి నాల్గవ
    దర్జాలో జేరి తొల్లి ,దైవము కరుణన్
    మీర్జా తో స్నేహమమరె
    మార్జాలము సింహమయ్యె మర్మంబేమో

    రిప్లయితొలగించండి
  17. దుర్జనుల ప్రకృతి మరి యది
    గర్జింతురు బలముఁ జూపి; కరుణయు లేదా
    పర్జన్యునకని తలచిన
    మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇల్లు మారడం జరిగిపోయింది. నా సిస్టంను సెట్ చేసుకున్నాను. నెట్ కనెక్షన్ కూడా వచ్చింది. కాకుంటే బాగా అలసిపోయాను. ఈ మూడు రోజులు సమస్యాపూరణలు చేసిన వారికి అభినందనలు.
    మిత్రుల పూరణలను సమీక్షించిన గురుదేవులు పండిత నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. దర్జీ వాడే చూడగ
    మార్జాలము , సింహమయ్యె మర్మంబేమో
    దర్జాగా యెన్నికలో
    దుర్జనులను మట్టిగరపి దొరగా గెలిచెన్.





    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా ధన్యవాదములు. పద్యం నడకలో ఏదో తేడా ఉన్నట్లనిపించింది కానీ దోషాన్ని పట్టుకో లేక పోయాను. సవరించిన నా పద్యం:


    అర్జును డనె బావా యె
    ట్లార్జించెను ధైర్య మట్టు లానా డనిలో
    దుర్జనుడు సైంధవుం డొక
    మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో!
    *

    రిప్లయితొలగించండి
  21. అర్జంటుగ కుట్టిమ్మని
    యర్జీ పెట్టగ డిజైను నాహా కనుమా!
    దర్జీ మిషనందున భళి
    మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో

    రిప్లయితొలగించండి
  22. వర్జించుచు సిగ్గు షరము
    దర్జాగా మోడిఁ దిట్టి తసభుసమని భల్
    గర్జించుచు మ్యావనెడిది
    మార్జాలము సింహ మయ్యె మర్మం బేమో

    రిప్లయితొలగించండి