8, ఏప్రిల్ 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1376 (లంకేశుఁడు రాముఁ జంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్.
(అందె వెంకట్రాజం అష్టావధానంలో ఇచ్చిన సమస్య)

28 కామెంట్‌లు:

  1. పంకజనయనుని శిరమును
    లంకేశుదు చూపగానె రాక్షస వనితల్
    శంకింపక తలచి రిటుల
    లంకేశుడు రాము జంపె లలనేఛ్ఛ మెయిన్

    రిప్లయితొలగించండి
  2. జింకను యెరగా వేసెను
    లంకేశుడు , రాము జంపె లలనేచ్చ మెయిన్
    శంకర భక్తుడు యసురుని
    సంకట బుద్ధిని యణచె సంకల్పము నన్

    రిప్లయితొలగించండి
  3. పూజ్య గురువులకు సోదర సోదరీ మణులకు అందరికీ శ్రీరామ నవమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్యగారికి, గురువుగారికి నమస్సులు. మిత్రులందఱికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి

  5. శ్రీ రామ నవమీ నాడు లంకేశు చేత రాముల వారిని చంపిస్తారా !! కబడ్ దార్ !

    (పూరణ లో ఇట్లా రాముల వారిని లంకేశు చేత ఎన్ని విధాలు గా చంపిస్తారో మరి !)

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో
    రామో విగ్రహవాన్ ధర్మః

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురువులకు ప్రణమిల్లుతూ ..శ్రీరామనవమి శుభాకాంక్షలు...మిత్రులందరికీ, వీక్షకులకు , శ్రీరామ నవమి శుభాకాంక్షలు....

    రిప్లయితొలగించండి
  7. పూజ్య గురుదేవులకు,బ్లాగు కవిమిత్రులకు మరియు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
    శంకరునే మెప్పించిన
    లంకేశునశోక వనపు రాక్షస వనితల్
    శంకించగ స్వప్నంబున
    లంకేశుడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్!

    రిప్లయితొలగించండి
  8. సంకటహరణుని శిరమును
    కింకరు లందరు కనుగొని కేరింతలతో
    బింకముగ దలచి రిటులన్
    లంకేశుడు రాము జంపె లలనేచ్చ మెయిన్

    రిప్లయితొలగించండి
  9. లంకకు దెచ్చెను సీతను
    లంకేశుడు; రాముజంపె,లలనేచ్చమెయిన్
    పంకమ్మై నలరాడెడు
    లంకేశుని బింకమణచి;లలనలు మెచ్చన్ !!!

    రిప్లయితొలగించండి


  10. శ్రీ రామనవమి శుభా కాంక్షలతో ...

    వంకర బుద్ధుల మాటలు
    లంకేశుడు రాము జంపె లలనేచ్ఛ మెయిన్
    పంకజ నయనుడు జంపెను
    బింకము గల రావణున్నె భీకర మొందన్

    రిప్లయితొలగించండి
  11. హంకారముతో చెరగొని
    సంకటములపాలు జేసె సతి సీతన్, ని
    శ్శంకితు మానసికంగా
    లంకేశుడు రాము జంపె లలనేఛ్ఛ మెయిన్

    రిప్లయితొలగించండి
  12. బొంక సమసె రాముడని
    లంకేశుడు రాముజంపె లల నేచ్చమెయిన్
    జంకువిడిచియని వగసిరి
    పంకజమునుబోలు సీత బాధను గనుచున్

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులకు, యితర మిత్రులకు శ్రీరామనవమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  14. శ్రీమతి జిలేబీ గారి వ్యాఖ్య నన్ను కడుపుబ్బ నవ్వించింది.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు:

    శ్రీరాముడు సీతాహృద
    యారాముడు భవ్యనాము డానంద సుధా
    ధార కురిసి మీ కొసగుత
    సార శుభ పరంపరలును శాంతి సుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
  16. లంకనుగల దనుజులనిరి
    లంకేశుఁడు రాముఁ జంపె; లలనేచ్ఛ మెయిన్
    లంకను జేరిన రాముడు
    లంకేశుని జంపె దివిజులానందింపన్

    1375వ సమస్యకు పూరణ (07-04-14)

    దండిగ ధనమున్న తరుగు
    ముండన్ జేరిన నరునకు; పుణ్యము గలుగున్
    తిండికి లోపము జేయక
    నుండుటకొక గూడు జూపి యూరట జేయన్

    రిప్లయితొలగించండి
  17. గురుదేవులకు,పెద్దలకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:

    సరదాగా :
    ============*================
    లింకను గారికి దెలుపగ
    లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్,
    జంకక లింకను బలికెను,
    లంకేశుఁడు జచ్చె ఘోర రణమున విఠలా!

    రిప్లయితొలగించండి
  18. ఫేస్ బుక్ మిత్రులందరకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

    "కరుణా సింధుడు నిర్మల
    చరితోన్నత రాఘవుండు సద్గుణ ఘనుడున్
    ధరలో కాపాడు భక్తుల
    దురితమ్ముల నెల్ల బారద్రోలును కృపతోన్ "

    రిప్లయితొలగించండి
  19. గురువులకు, పెద్దలకు, మిత్రులకు శ్రీరామ నవమీ పవిత్ర శుభ కామనలు.

    కింకర వనితలు సీతను
    శంకింపగ జేయ నిట్లు సంభాషణలన్
    పంకించుచు తలల ననిరి
    లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్.

    రిప్లయితొలగించండి
  20. లంకను పుకారు బెంచిరి
    కింకరులే సీత మనసు కేకలు వెట్టన్
    ఢంకాగొట్టుచు జెప్పిరి
    "లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్. "

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు.కవిమిత్రులందరికీశ్రీరామ
    నవమి శుభాకాంక్షలు

    బొంకెనుసీతతొ రక్కసి
    లంకేశుడు రాము జంపె లలనేచ్ఛమెయిన్
    శంకను మాన్పగ జూపెను
    లంకాపతివైరి యైన రాముని శిరమున్

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొక పూరణ:శంకరు భక్తుండెవ్వడు?
    జింకనెవరు జంపినారొ జెపుమా వేగన్?
    రంకుకు కారణ మెయ్యది ?
    లంకేశుడు. రాము జంపె. లలనేచ్ఛమెయిన్.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులారా! శుభాశీస్సులు.
    అందరి పద్యములు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. వంకర కీమాయణమున
    జంకక బొంకులను వల్కి జయహో యనునా
    కుంకల ద్రావిడుల నడుమ
    లంకేశుఁడు రాముఁ జంపె లలనేచ్ఛ మెయిన్ :)

    రిప్లయితొలగించండి