10, ఏప్రిల్ 2014, గురువారం

సమస్యాపూరణం - 1378 (శంకరుఁ డుద్ధతిం బఱపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శంకరుఁ డుద్ధతిం బఱపె సాయకకోటిని రామచంద్రుపై.
(ఆకాశవాణి సౌజన్యంతో..)

21 కామెంట్‌లు:

  1. పంకజసంభవాదులు శుభంబుల గోరుచు జూచుచుండగా
    పంకజనేత్రు హస్తమున భగ్నముగాగ ధనుస్సు, పొంగగా
    శంకరు, డుద్ధతిన్ బరపె సాయకకోటిని రామచంద్రుపై
    పంకజ సాయకుండు, సురవర్గము గూర్చెను పుష్పవర్షమున్

    రిప్లయితొలగించండి
  2. శంకరుడు పొంగగా, పంకజ సాయకుడు రామచంద్రుపై వేసిన సాయక కోటి...బాగుందండీ..

    రిప్లయితొలగించండి
  3. విరుపును బాగా వాడుకొని రామయ్య పెండ్లి పనులు మొదలుపెట్టినారు.
    బాగున్నది.
    పంకజపరిమళము చుట్టుముట్టినది.

    కుంకవు నీవటంచు మిగక్రోధముఁ జూపి లలాటనేత్రమున్
    శంకరుఁ డుద్ధతిం బఱపె సాయకకోటిని, రామచంద్రుపై
    శంకలు లేక ధర్మమును చక్కగ నిల్పగ భక్తుడయ్యు తా
    వంకర బుద్ధి జూపు తఱి పాతకుఁ జంపగ నిల్చెతోడుగా.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యను సమర్థముగ పూరించుటలో సఫలురైన శ్రీమతి లక్ష్మీ దేవి గారికి మరియు శ్రీ నాగరాజు రవీందర్ గారికి ప్రత్యేక అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    లంకను గాల్చి పోయె గపి,రాముడువారధి గట్టి వచ్చె, తా
    జంకక జంపె పుత్రు, ననుజన్ము, విభీషణు డేగె వైరియై,
    యింక సహించలేక నని కేగెను రావణు, డాదితేయ నా
    శంకరు డుద్ధతిన్ బరపె సాయక కోటిని రామచంద్రుపై .

    రిప్లయితొలగించండి
  6. శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పంకజ నేత్రి జానకిని వంచనతో చెరబట్టి రాముతో
    జంకక చేసె యుద్దమును సంశ్రయ ముండునటంచు సర్వదా
    శంకరు, డుద్ధతిన్ బరచె సాయక కోటిని రామచంద్రుపై
    బింకముతోడ రావణుడు, పేరడగించెను రాముడాతనిన్

    రిప్లయితొలగించండి
  8. లంకకు ముప్పనెంచక నరాచక రీతిగ జానకీ సతిన్
    బింకముతోడ నెత్తుకొని వెళ్ళిన రావణు ద్రుంచ రాము డా
    లంకకు జేరి పోరగ విలక్షణ లక్ష్యము గల్గినట్టి నా
    శంకరు డుద్ధతిన్ బఱపె సాయకకోటిని రామచంద్రుపై!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    పంకజనేత్ర అనవలెను. నేత్రి అను పదమునకు అర్థము నాయకురాలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో కొంచెము మార్చితే ఇంకను అన్వయ సౌలభ్యము ఉండును. ఇలాగ మార్చుదామా:
    ......"విలక్షణ లక్ష్యయుతుండు, ధర్మ నా
    శంకరుడు................"

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. లంకను గాచుచుండెడి కళంకుమదంబణంచగన్
    భీకర రోదనం బరపి వేడగ వీడ్కొనె కొండనంతటన్
    శంకరు, డుద్ధతిన్ బరపె సాయకకోటిని రామచంద్రు పై
    లోకము బొందగా జనియె లోకవిపక్షుడు రావణుండిటన్

    రిప్లయితొలగించండి
  11. లంకను గాచుచుండెడి కళంకుమదంబణగించగా మహా
    భీకర రోదనం బరపి వేడగ వీడ్కొనె కొండనంతటన్
    శంకరు, డుద్ధతిన్ బరపె సాయకకోటిని రామచంద్రు పై
    లోకము బొందగా జనియె లోకవిపక్షుడు రావణుండిటన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీమతి సుమలత గారు: శుభాశీస్సులు.
    మీ ప్రయత్నము బాగుగ నున్నది. అభినందనలు.
    మీకు ప్రాస నియమముపై అవగాహన లేదు. శంకరుడు అనుచోట ప్రాస స్థానములో బిందు పూర్వక క కారము కలదు కదా. అన్ని పాదములలోను బిందు పూర్వక క కారము ఉండవలెను. మీరు చెప్ప దలచుకొనిన భావము ఇంకను సులభముగా ఉండునట్లు ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గురుదేవులకు నమస్సులు, తమరు సూచించిన సవరణ చాల బాగుంది. సవరణతో...

    లంకకు ముప్పనెంచక నరాచక రీతిగ జానకీ సతిన్
    బింకముతోడ నెత్తుకొని వెళ్ళిన రావణు ద్రుంచ రాము డా
    లంకకు జేరి పోరగ విలక్షణ లక్ష్యయుతుండు ధర్మ నా
    శంకరు డుద్ధతిన్ బఱపె సాయకకోటిని రామచంద్రుపై!

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు గురువు గారు. అవును, ప్రాస నియమము పై అవగాహన లేదు. తెలుగు వ్యాకరణ పుస్తకములున్న ( సులభ రీతిలో నేర్చుకొనుటకు ) తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  15. అమ్మా శ్రీమతి సుమలత గారూ! శుభాశీస్సులు.
    ఛందస్సు గురించి సులక్షణ సారము అనే చిన్న పుస్తకమును చదవండి - చాలును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శంకర భక్తుడయ్యు తగు సభ్యత లేకనె పట్టి కానలో
    లంకకు దెచ్చె రామ ప్రభు భామిని సీతను , యుద్ధ భూమిలో
    జంకక గెల్తునంచు మరి శంకరు దల్చుచు నార్షధర్మ నా
    శంకరు డుద్ధతిన్ బరపె సాయక కోటిని రామచంద్రుపై .

    రిప్లయితొలగించండి
  17. ధన్యవాదములు గురువు గారు. తప్పకుండా ఆ పుస్తకము తెప్పించుకుంటాను.

    లంకను గాచుచుండెడి కళంకుమదంబణగించ బాధచే
    రంకెల పెట్టుచు శివుని రంజిల సేయగ కాచె వాని నా
    శంకరు, డుద్ధతిన్ బరపె సాయకకోటిని రామచంద్రు పై
    కంకటమూడి కుక్షి తెగి కంటకు రావణుడంతరింపగా

    రిప్లయితొలగించండి
  18. ఆదశకంఠుడున్ వరము లన్నియు నివ్వగ భక్తుడంచు నా
    శంకరుడుద్ధతిన్ బఱపె సాయక కోటిని రామచంద్రుపై
    పంకజ నాభుడున్ కనలి వానర సేనయు తమ్ముడండతో
    నంకెకు దెచ్చె లంకపురి నందరు మెచ్చగ తున్మి రావణున్

    రిప్లయితొలగించండి
  19. జంకుచు నేను వ్రాయగను చక్కని చుక్కల పద్యపూరణల్
    వంకలు బెట్టి చూపుచును వ్యాకరణంబున ఘోరకృత్యముల్
    శంకరుఁ డుద్ధతిం బఱపె సాయకకోటిని;...రామచంద్రుపై
    శంకరు డాగ్రహించకయె చల్లగ చూచెను ధన్వభంగమున్

    రిప్లయితొలగించండి