16, ఏప్రిల్ 2014, బుధవారం

సమస్యాపూరణం - 1384 (పవమానతనూజు నెవఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

22 కామెంట్‌లు:

  1. భవనము లందున కులుకుచు
    నవినీతిని బ్రతుకు చున్న నాయకు లుండన్
    శవములు మిగులగ జగతిని
    పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయన్

    రిప్లయితొలగించండి
  2. అవకాశవాదు లగుచును
    భువనంబును మ్రింగు వారె భువి నేత లవన్
    దివికేగక గిరినున్నను
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి
  3. అవినీతి పంకమందున
    నవనాడులు మునిగి పోయి నలిగిన వారే
    భువినేలమరలరాగా
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి
  4. పవలున దిరుగరు వారలు
    దివి భువి గానట్టి మధ్య దేశము మసలున్
    ఎవరన పిశాచులందున
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి
  5. యువకులు భవితను తల్చక
    దివిచూచుచు మద్యమందు, దిశ లేకుండన్
    చెవిగొన కున్నన్ భక్తిని
    పవమాన తనూజు నెవడు ప్రస్తుతిచేయున్

    రిప్లయితొలగించండి
  6. అవమానము లెక్కించక
    భువిలో బహు జనులు భాగ్య భోగమ్ములకై
    యవసరమగు పని జేతురు
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి

  7. ఎవరీ ప్రశ్నను వేసిరి ?
    పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయు
    న్నె వరైనను సరి ,చెప్పుదు
    నవనిం గలయట్టి మేటి హనుమద్భక్తుల్

    రిప్లయితొలగించండి
  8. అవిధే యులయినవారలె
    భువినేలెడినేతలగుచు పూజ్యులు కాగా
    చవినీయదురామభజన
    పవమానతనూజు నెవడు ప్రస్తుతి సేయున్

    రిప్లయితొలగించండి
  9. అవిరళ భక్తికి శక్తికి
    యవతారుడు హనుమ యనగ నవనిని వినమే !
    కవితలతో నుతియించక
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి
  10. భవ భయహరమగును గదా
    పవమాన తనూజు చాల ప్రస్తుతి సేయన్
    శివ శివ! లంకాపురిలో
    పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    సవివరముగ నే తెలిపెద
    పవమాన తనూజు నెవడు ప్రస్తుతి సేయున్?
    జవసత్వబుద్ధి ధైర్య
    మ్మువిశ్రుతియు నిర్భయత్వ మును వా౦ఛి౦పన్

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    తల్చక అనుటకు బదులుగా తలపక అనినచో ఇంకయునూ బాగుగ నుండును.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు
    మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    2వ పద్యములో శక్తికి + అవతారుడు అనుచోట యడాగమము రాదు. నుగాగమము వచ్చును. సవరించండి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
    మీ సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  15. అవమానించగ సతినే
    చవటవలె సభను భరించు, సత్తువమేలా?
    యవనీ తలంబు నందున
    బవమాన తనూజు నెవడు ప్రస్తుతి జేయున్!

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీమత్ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో.............గురువులకు ప్రణమిల్లుతూ.......

    చిందులువేయుచున్ చిలిపిచేష్టలచే వనమెల్ల డించి యా
    నందవిభూతి గాంచి ఘననాయక శత్రువులన్ వధించి ని
    ష్యందనభక్తితత్పరుఁడవై రఘురామునికాప్తుఁడైతివే,
    వందనమాచరింతును శుభంబులగోరుచునంజనీసుతా!

    రిప్లయితొలగించండి
  19. శివరాతిరి పస్తులలో
    చవిగొను బతుకమ్మ పూజ చామంతులలో
    కవితమ్మల బోనాలన్
    పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    రిప్లయితొలగించండి


  20. హ! వడముల వడ ఘుమఘుమల
    గవనం బంతే, జిలేబి, గట్టిగ హనుమం
    త! విడువను విడువననుచున్
    పవమాన తనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి