24, ఏప్రిల్ 2014, గురువారం

సమస్యాపూరణం - 1392 (ఖలసంబంధమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఖలసంబంధమ్ము క్షేమకారణ మయ్యెన్.
(ఆకాశవాణి వారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. ఇల వెదకిన నరులెవ్వరు
    ఫలితము లేకుండ పనులు పాపపు జగతిన్
    నిలువున దోచగ నొకపరి
    ఖల సంబంధమ్ము క్షేమ కారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    గంధర్వ కవ అను సమాసము సాధువు కాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. అలనాటి మేటి నాయిక
    తలపులలో మెదిలె నేమొ తన పుత్రికనే
    పిలువగ ననియెన్ "మణి మే
    ఖల" సంబంధమ్ము క్షేమ కారణ మయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  4. అలనాటి కధలు తెలిపెను
    చెలికానికి రాజహంస చేర్చెను లేఖల్
    చెలికిని చెలికానికి లే
    ఖలసంబంధమ్ము క్షేమకారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  5. కలహములుదెచ్చునొకపరి
    ఖల సంబధమ్ము, క్షేమ కారణమయ్యెన్
    నిలలో సుజనులచెలిమిన్
    పొలుపును కలిగించుగాదె పొందగ యశమున్

    రిప్లయితొలగించండి
  6. ఇలలో దేశములెన్నో
    కలవట,సంస్కారములను కలిగినదిదె మ
    మ్మలరించున్; సాగర మే
    ఖలసంబంధమ్ము క్షేమకారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. ఇలలో సజ్జను జెరచెను
    ఖల సంబంధమ్ము ; క్షేమ కారణమయ్యెన్
    మలరహితుని సస్నేహ
    మ్మలమట, వేదనల దీర్చి యనవరతంబున్

    రిప్లయితొలగించండి
  8. జలగల వలె పీ డించును
    ఖల సంబంధమ్ము, క్షేమ కారణ మయ్యె
    న్నల రాముని సహవాసము
    నిల సుగ్రీ వునకు గలిగె నిధ్ధర లోనన్

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పులివాతబడక పథికుడు
    నలయక జొత్తెంచె కంటకావృతకుజముల్
    కలగలుపుగ పెరిగిన శా
    ఖల సంబంధము క్షేమకారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. కలువకనుల చిన్నదొకటి
    కలువగ మిత్రుని పరిణయ కాలము నందున్
    చెలిగా గైకొనగా నా
    ఖల సంబంధమ్ము క్షేమ కారణమయ్యెన్

    ఖల: చోటు


    రిప్లయితొలగించండి
  11. అలివేణి తోడ నేనును
    పలునృత్యంబులు సలుపగ పదుగురు మెచ్చన్
    కలిసెను మనసులు, మాప్రేం
    ఖల సంబంధమ్ము క్షేమ కారణమయ్యెన్

    రిప్లయితొలగించండి
  12. పలువత్సరంబులు కలసి
    పలుసేవలఁ జల్పినట్టి పావన సఖికిన్
    చెలికాడివ్వ పసిడి మే
    ఖల సంబంధమ్ము క్షేమ కారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. కలవారలనుచు తగ్గిన
    పలుమారులు దాడిజేసి బాధలు పెట్టన్
    తలపడ లేకను కలియగ
    ఖల సంబంధమ్ము, క్షేమ కారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి మీ పద్యము లన్నియును అలరించు చున్నవి.
    అందరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి ప్రయత్నం చేశారు. పద్యం సలక్షణంగా ఉంది. అభినందనలు.
    కానీ పద్యంలో అన్వయలోపం ఉన్నట్టుగా తోస్తున్నది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవపాదాన్ని ‘నిలలో’ అని ప్రారంభించారు. అక్కడ ‘క్షేమకారణ మయ్యె/ న్నిలలో...’ అనండి. ఇలాంటి ప్రయోగాలు కొందరు కవులు చేశారు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఇల బాపల చంప జడిసి
    ఖలవర్గము వదలి వేయ కంపము మీరన్
    పిలకల పంతుళ్ళ చిరుశి
    ఖలసంబంధమ్ము క్షేమకారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి
  17. అలవోకగ తిండి దొరకు
    విలపించగ బైలు దొరకు వేడుక మీరన్
    పలువిధముల చిద్దుకు శృం
    ఖలసంబంధమ్ము క్షేమకారణ మయ్యెన్

    రిప్లయితొలగించండి