6, ఏప్రిల్ 2014, ఆదివారం

పద్య రచన – 558

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. పాల బుగ్గలఁ కన్నీరు జాలు వార
    కారణంబేమి చిన్నారి కలికి చెపుమ?
    అమ్మ నాన్నలు కొట్టిరా? యలుక వీడు
    నీదు శ్రేయముఁ గోరెడి నేస్తులమ్మ!

    రిప్లయితొలగించండి
  2. ముద్దు లొలికించు బాలిక మొగము జూడ
    కంటి నుండియు కన్నీరు కారి నట్లు
    కాన వచ్చెను మఱి యేమి కారణం బొ ?
    యడిగి జెప్పుదు మీకును నార్యు లార !

    రిప్లయితొలగించండి
  3. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. తల్లిదండ్రులు కొలువుకు వెళ్ళి పోవ
    కారుచుండెను కన్నీరు ధారవోలె
    పసిడి బొమ్మకు కరువయ్యె పలుకరింపు
    చిరుకుటుంబము లోనున్న చింత గనుడు

    రిప్లయితొలగించండి
  5. పాలు గాఱెడు చిన్నారి పాప యొకతి
    ఏడ్చు చుండెను బుగ్గలు యెఱ్ర బడగ
    కనుల జారెను నీలాలు కలవరమున
    ఏమి కారణ మేమియో యెవ్వ రెరుగు?

    రిప్లయితొలగించండి
  6. పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై
    చిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్
    సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో
    కన్నీరు గార్చుచుండిరి సకాలమునందున ప్రేమ నొందగా!

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బుగ్గలు + ఎఱ్ఱబడగ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘తనబుగ్గ లెఱ్ఱబడగ’ అందాం.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ఉత్పలమాల బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో ‘కన్నీరు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘కన్నుల నీర్దొఱంగిరి...’ అందాం.

    రిప్లయితొలగించండి

  8. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, గణభంగము జరిగింది. తమరు సూచించిన సవరణతో....

    పిన్నవయస్సులో తగిన ప్రేమను బొందగ తల్లి దండ్రిపై
    చిన్నది బెంగ పెట్టుకొని చెంపల వెంబడి నీరు కార్చుచున్
    సన్నగ యేడ్చుచుండెను, విశాల ప్రపంచమునందు నెందరో
    కన్నుల నీర్దొరంగిరి సకాలమునందున ప్రేమ నొందగా!

    రిప్లయితొలగించండి