10, ఏప్రిల్ 2014, గురువారం

పద్య రచన – 562

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. విమల చిత్తంబుతో భీష్మాదులు వచింప
    ....భక్తి భావమ్ముతో వల్లె యనుచు
    ఘన రాజసూయ యాగమున శ్రీకృష్ణుని
    ....సకల లోకేశు బ్రశస్త చరితు
    నంచిత సింహాసనాధిష్ఠితుని జేసి
    ....పాదపూజను జేసె సాదరమతి
    ధర్మజుడంత మాత్స్సర్యమ్ముతో శిశు
    ....పాలుండు దూషించి పరుషముగను
    కడు నగౌరవ మొనరింప ఘనుల కెల్ల
    చాలు చాలంచు నంతట చక్రపాణి
    చక్రమును బంచి శిశుపాలు సంహరించె
    కురిసె నంతట హరిపైని విరుల జల్లు

    రిప్లయితొలగించండి
  2. రాజసూయంబునకు వచ్చె రాజులెల్ల
    వాడసూయతొ కృష్ణునిన్ వదరి తిట్టె
    వంద తప్పుల పై శిశుపాలు పైకి
    చక్ర మంపుచు చంపెగా చక్రియపుడు

    రిప్లయితొలగించండి
  3. కుదురుగనుండకుండ కడు క్రోధముఁ జూపెడు వాని తప్పుల
    న్ని దయను గాచె కృష్ణుడల; హీనుని నాశిశుపాలుఁ జంపనా
    పదునగు చక్రమున్ విడిచె; భక్తుల బ్రోచెడు శ్రీహరిన్ సదా
    సదమలమైన మానసుని చల్లగఁ జూడగ వేడుకొందమా!

    రిప్లయితొలగించండి
  4. రాజ సూయమ్మునకువచ్చె రాజు లంత
    వాసుదేవుని పూజించె పాండు సుతుడు
    తూల నాడుచు శిశుపాలు గేలి జేయ
    నూరు తప్పులు నేటితో తీరె ననుచు
    చక్రమునుబంపి చంపెను చక్రియపుడు

    రిప్లయితొలగించండి
  5. ధర్మ మార్గంబు జొప్పున ధర్మ రాజు

    అర్ఘ్య పాద్యాదు లీయగ యాదవునకు

    నోర్వ లేకయ శిశుపాలు గేలి సేయ

    సంహరించెను నాతని జక్రి యపుడు

    రిప్లయితొలగించండి
  6. శిశుపాలుడు దూషించెను
    పశుపాలకుడంచు పంద పరుషంబులతో
    నిశితంపు చక్ర మంపగ
    శిశుపాలుడు తనువు వీడి చేరెను హరినే!

    రిప్లయితొలగించండి
  7. శిశుపాలుడు దూషించెను
    పశుపాలకుడంచు పంద పరుషంబులతో
    నిశితంపు చక్ర మంపగ
    శిశుపాలుడు తనువు వీడి చేరెను హరినే!

    రిప్లయితొలగించండి
  8. "అగ్ర తాంబూలమున కర్హు డచ్యు తుండ "
    యంచు నధిపతుల్ రాజసూ యంబు నందు
    పలుకగా విని, శిశుపాలు వ్రజవరున్ని
    గర్వభరితుడై ధూషించ గణన మించె
    చక్ర ఘాతంబునను వాన్ని జక్రి చంపె .

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి అందరి పద్యములు అలరించుచున్నవి., అందరికి అభినందనలు. కొన్ని సూచనలు:

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీరు అన్వయమునకు తగిన ప్రాముఖ్యము నీయండి. వచ్చిరి అను బహువచనమునకు బదులుగా వచ్చె అనరాదు.

    శ్రెమతి లక్ష్మీ దేవి గారు:
    మీ పద్యములో ఇంకను మెరుగులు కొరకై : సదమల మానసాంబుజుని - అందామా?

    శ్రీమతి శైలజ గారు:
    మీరు కూడా వచ్చిరి అనుచోట వచ్చె అని వాడేరు. మీ పద్యము 3వ పాదమును ఇలాగ మార్చుదామా:
    గేలి చేయగ నట శిశుపాలు డలిగి - అని.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మీ పద్యములో 3వ పాదమును ఇలాగ మార్చుదామా:
    గేలిచేయగ నట శిశుపాలు డకట -- అని.

    శ్రీ సహదేవుడు గారు:
    మీరు మరికొంచెము అన్వయ సౌలభ్యమును మెరుగు పరచవలెను.

    శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
    మీరు అన్వయమునకు మరికొంత ప్రాధాన్యమును ఈయవలెను. వ్రజవరున్ని మరియు వాన్ని అను ప్రయోగములు బాగుగ లేవు.

    స్వస్తి.


    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    రాజసూయము ముగిసెను రాజితముగ
    నగ్ర తాంబూలమా?వెఱ్ఱి యాదవునకు?
    యనుచు దూషించు శిశుపాలు నాగ్రహమున
    తలను ఖండించె చక్రి సభ్యులు భయపడ

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
    మీ సూచన ధన్యవాదములు . సవరించిన ఈ పద్యము ....
    "అగ్ర తాంబూలమున కర్హు డచ్యు తుండ "
    యంచు నధిపతుల్ రాజసూ యంబు నందు
    పలుకగా విని, శిశుపాలు డీర్ష్యచేత
    నంద నందుని నిందించె వంద మార్లు
    చక్ర ఘాతంబునను జక్రి చంపె నతని

    రిప్లయితొలగించండి

  12. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు
    మీ సూచన ధన్యవాదములు . సవరించిన ఈ పద్యము ....
    "అగ్ర తాంబూలమున కర్హు డచ్యు తుండ "
    యంచు నధిపతుల్ రాజసూ యంబు నందు
    పలుకగా విని, శిశుపాలు డీర్ష్యచేత
    నంద నందనున్ నిందించె వంద మార్లు
    చక్ర ఘాతంబునను జక్రి చంపె నతని

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీరు సవరించిన పద్యములో కూడ ఒక తప్పు దొరలినది. 3వ పాదములో యతిని గమనించ లేదు. సవరించండి.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    మీ 2వ పద్యములో 3వ పాదమును ఇలాగ సవరించుదామా:
    అంచు శిశుపాలు డచ్యుతు కొంచపరచ ..

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా ! ధన్యవాదములు...దోష సవరణ చేయుచున్నాను...

    రాజసూయంబునందుండ రాజులెల్ల
    వాడసూయతొ కృష్ణునిన్ వదరి తిట్టె
    వంద తప్పుల పై శిశుపాలు పైకి
    చక్ర మంపుచు చంపెగా చక్రియపుడు

    రిప్లయితొలగించండి
  15. రాజ సూయ యాగముగనన్ రాజ లోక
    మెల్ల తరలిరాగన్ శౌరి కిచ్చి రగ్ర
    పీఠమును పాండవు లధిక ప్రీతితోడ
    చేదిరాజది గాంచి తాఁ జీత్కరించి
    దుషణలనెన్నొ జేసెను ధూర్త మథిన
    చిరునగవుతోడ శిశుపాలు చేష్టల గని
    యత్త కిచ్చినవరముల నాదరించి
    వంద తప్పులు గాచె నా నంద సుతుడు
    మదము తో శిశుపాలుడు కదము ద్రొక్క
    కనలి ఖండించె నాతని కంఠ మపుడు
    మూడు జన్మల శాపమ్ము ముగియ గానె
    చనియె శిశుపాలు డప్పుడు చక్రి కడకు
    నిత్య కర్తవ్యములను తా నియతి జేయ

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి ధన్యవాదాలు. తమరి సూచిత సవరణతో పద్యం :
    శిశుపాలుడు దూషించగ
    పశుపాలకుడంచు పంద పరుషంబులతో
    నిశితంపు చక్ర మంపగ
    శిశుపాలుడు తనువు వీడి చేరెను హరినే!

    రిప్లయితొలగించండి