27, ఏప్రిల్ 2014, ఆదివారం

పద్య రచన – 579

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. కుంభకర్ణుని లేపుట కొరకు నచట
    యత్నముల జేయుచున్నవా రసురతతులు
    వాడు లేవగనే తినవలెను గాన
    నోగిరము సిద్ధమొనరించి యున్నవారు

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా ! గతములో ఒకసారి మన బ్లాగు ద్వారా కుంభకర్ణుని నిద్రలేపినట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి
  3. కుంభ కర్ణుని లేపుట కునసు రులట
    కష్ట పడుచుం డి రైనను గదల కుండె
    నేమి నిద్రయో యే రికి నెఱు క బడదు
    పండు కొనుట యే ,వేరేమి పనియు లేద ?

    రిప్లయితొలగించండి

  4. పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే.. అనుమానపడుతూనే ఇచ్చాను. మతిమరుపు ఎక్కువైపోతున్నది. ధన్యవాదాలు.
    అప్పుడు వ్రాయని మిత్రులు, అప్పుడు వ్రాసి మళ్ళీ ఇప్పుడు వైవిధ్యంగా వ్రాసేవాళ్ళకు అవకాశం దొరుకుతుంది కదా!

    రిప్లయితొలగించండి
  5. ఇంద్రజిత్తుడు మరణించి యిలను వీడ
    కుంభకర్ణుని మేల్కొల్పు కోర్కెతోడ
    రావణుండు తా నియమించె రక్కసులను
    వలయు యశన పానియములు వారి తోడ
    నిద్ర లేవగనె భుజింప భద్రపరచి
    కుంతములతోడ రక్కసుల్ గ్రుచ్చు చుండ్రి
    తురగములు యేనుగులు చేరి త్రొక్కుచుండ

    రిప్లయితొలగించండి
  6. రామ రావణ యుద్ధము రగిలి నపుడ
    రక్కసులు బల్లెములతోడ పెక్కు చోట్ల
    కుమ్మి కరులతో ద్రొక్కించి కుంబ కర్ణు
    మేలుకొన జేయుచుండిరి మెయి గదల్చి

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికిపూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    కుంభకర్ణుని నిద్ర ఆరు నెలలు నిద్రించును యారు నెలలు
    మేలుకొని యగ్రజుని యాజ్ఞ మీరకుండ
    దనకు దోచిన విధమున దనరు చుండు
    కుంభకర్ణుడు.గాని యా కుటిల రాజ
    కీయ వేత్త ప్రజల సేవ కియ్య కొనడు
    వేట మాంసము,లంచముల్,వెలది,మందు
    కొఱకు దేశ మాతను యమ్ము కొనగ బూను

    రిప్లయితొలగించండి

  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నాల్గవపాదాన్ని ఇలా అందాం ‘వలయు నశన పానీయముల్ వారితోడ’
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నిద్రించుఁ దా నారునెలలు’, ‘దేశమాతనే యమ్ముకొనగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మీసూచనకు ధన్యవాదములు."నిద్రించు తానారునెలలు"
    సవరణ గావించితినియని "దేశ మాతనే"యనిన గణభంగమగును. కావున "దేశమాతనె"యనిసవరించితిని.

    రిప్లయితొలగించండి
  10. పరివార గదా మోదులు ,
    కరముల ఘీంకార హోరు , గాయని స్వరముల్ ,
    సురుచుల వాసన లేవి య
    సురవీరుడు కుంభకర్ణు స్పృహకున్ దేవే !

    రిప్లయితొలగించండి