29, ఏప్రిల్ 2014, మంగళవారం

పద్య రచన – 581

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. కంటి కింపుగ నుండెడి కంట ఫలము
    ఔషధీ గుణము లకిది యాట పట్టు
    వేద భాగంబు పనసల వేలు పనుచు
    తొనలు అమృతపు గుళిక లనుచు మురియ

    రిప్లయితొలగించండి
  2. క్షమించాలి
    చివరి పాదం " తొనలు అమృతపు గుళిక లనుచు తినగ " అంటే బాగుంటుం దేమొ

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    సవరించిన పాదంలోనూ గణదోషం. ‘తొనలు + అమృతపు’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! ‘తొనల నమృతపు గుళికలే యనుచు తినగ’ అంటే సరి|

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    ఒకోసారి ఎంత కుస్తీ బట్టినా గుర్తురావు .చక్కని సవరణ జేసి నందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  5. చెట్టు తల్లిఁ జూడ చెన్నుగా నున్నది
    మధురఫలములిచ్చు ముదముతోడ
    పనస తొనలఁ దినుట పండుగే జనులకు
    తీపితోడ మిగులు తృప్తి నిచ్చు

    రిప్లయితొలగించండి
  6. పనస పళ్ళను జూడగా మనసు నిండు
    పనస తొనలను తినినచో ఫలము మెండు
    ఔషధీకృత గుణములు పోషకములు
    కలిగి యుండిన కంటక ఫలము తినుడు

    రిప్లయితొలగించండి
  7. పనస చెట్టును గా సెను బనస కాయ
    లార్య !చూడుడు పండ్లుగ నైన పిదప
    తొనలు తొనలుగా విడదీసి తోటి కవివ
    రులకు బెట్టుదు తీయటి ఫ లపు తొనలు

    రిప్లయితొలగించండి
  8. పనస పండులోపలనుండు పసిడి రంగు
    పండు పైభాగ ముననుండు పసరు పచ్చ
    పండు పెద్దదే గని దాని వాసి సున్న
    పనస తొనలను తినినను పరమ వసువు

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పనసపండు
    తండ్రి కరకు గరుకు తల్లి పసిడి చాయ
    బిడ్డ మధురమౌను బెడ్డ పౌత్రి
    కాల్చి తినగ నెoతొ కమ్మగా నుండిన
    ఫలమదేదొ చెపుమ?పంనస పండు

    రిప్లయితొలగించండి
  10. కాండముపై నీ పనసయె
    కుండలు వ్రేలాడినట్లు గుత్తులుగానే
    మెండుగ కాయును తినగా
    రండో చిన్నారులార రయమున రారే !

    రిప్లయితొలగించండి
  11. ఈనాటి పద్యరచన శీర్షికకు మంచి పద్యాల నందించిన మిత్రులు....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అన్నపరెడ్డి వారూ,
    ‘మిగుల’ టైపాటువల్ల ‘మిగులు’ అయినట్టుంది.
    *
    గండూరి వారూ,
    ‘కని’ .. మీ భావం ‘కాని’ అనుకుంటాను. అక్కడ ‘పెద్దదైనను దాని వాసి...’ అంటే బాగుంటుందేమో!
    *
    గోలి వారూ,
    రండో, రారే పునరుక్తి అయినట్టుంది. ‘రయమున నిటకున్’ అంటే ఎలా ఉంటుంది?

    వరప్రసాద్ గారూ,
    ‘సజ్జనులైరే’ అనండి.
    *
    తిమ్మాజీ రావు గారూ,
    ‘కలదు + అనుచు’, ‘జూపెను + అనిలజునకు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మీ మొదటి రెండు పాదాలను ఇలా సవరిస్తున్నాను.
    ‘పందికొక్కుల వలనలాభమ్ము కలద
    టంచు విదురుడు జూపినా డనిలజునకు’
    *
    సుబ్బారావు గారూ,
    ‘ప్రజలార’ సరియైన ప్రయోగం. అక్కడ ‘ప్రజలు వినుడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    మీ సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి