30, ఏప్రిల్ 2014, బుధవారం

పద్య రచన – 582

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. సైకిలు నేర్పిన పాపకు
    బైకులు నడుపంగ నిలను బాధ్యత దెలియున్
    ప్రాకట మగుచదు వుచదివి
    లోకంబున పేరు గాంచి లోపా ముద్రై

    అగస్త్యు డంతటి వానికి భార్య కావాలని

    రిప్లయితొలగించండి
  2. తనయకు సైకిలు నేర్పుచు
    అనిశము తనవెటనడచు ననురాగముతో
    ఘనమైనతండ్రి ప్రేమను
    కొనగల నిధులంటు గలవె కువలయమందున్

    రిప్లయితొలగించండి
  3. బుడి బుడి నడకల నేర్పెను
    కడు చక్కగ నేర్పు చుండె గద సైకిలు తా
    వడి వడి పెరిగెడి బిడ్డకు
    సడి చప్పుడు లేని చోట సంబర పడుచున్

    రిప్లయితొలగించండి
  4. కన్న తండ్రియె గురువుగ చిన్న తల్లి
    నేర్చుకొనుచుండె సైకిలు నిష్ట తోడ
    భావి జీవిత మందున బైకుపైన
    స్వారిచేయును ముదముతో చక్కనమ్మ

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. తండ్రియనే వాడు...
    గుండెల మోయును సైకిల్
    బండీ నేర్పుచు బ్రతుకు బాటను జూపున్
    కొండల రాయుని బోలిన
    దండిగ మనసున్న వాన్కి దంపతి జేయున్

    రిప్లయితొలగించండి
  7. నేర్పు చుండెను సైకిలు నెమ్మి తోడ
    తనదు దుహితకు నోర్పుతో దండ్రి యచట
    రక్త సంబంధ మన యిట్లు రక్తి గలుగు
    చిత్ర మండున జూడుము శేష సాయి !

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘బండిని నేర్పుచును బ్రతుకు...’ అంటే సరి.
    ‘వాని దారగ జేయున్’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘శేషశాయి’ అనాలి కదా!

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి ధన్యవాదములతో సవరించిన పద్యం:
    తండ్రియనే వాడు...
    గుండెల మోయును సైకిల్
    బండిని నేర్పుచును బ్రతుకు బాటను జూపున్
    కొండల రాయుని బోలిన
    దండిగ మనసున్న వాని దారగ జేయున్

    రిప్లయితొలగించండి