1, జులై 2015, బుధవారం

సమస్యా పూరణము - 1718 (వాణి వీణ యెల్లపు డపస్వరము లొలుకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వాణి వీణ యెల్లపు డపస్వరము లొలుకు.

27 కామెంట్‌లు:

  1. సరస సంగీత గమకమ్ములరయలేక
    శుద్ధ సాహిత్య మైన సంస్తుతము గనక
    నిరతమును దుష్ట తలపులఁ నెగడుచున్న
    వాణి వీణ యెల్లపుడపస్వరము బలుకు

    రిప్లయితొలగించండి
  2. మధుర మంజుల గానమ్ము సుధలు కురియు
    వాణి వీణ , యెల్లపుడ పస్వరము లొలుకు
    ఘూక ములవలె కాకోల ఘోర రవము
    శృతి లయలు తెలియని బధిరు నకును

    రిప్లయితొలగించండి
  3. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘వీణ పలుక దపస్వరాల్ వినెద మన్న’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. గురువుగారు
    మీ సూచనల ననుసరించి
    ఎన్న పద్మసంభవు వాక్కు నేలు వాణి
    వీణ పలకదపస్వరాల్ వినెద మన్న
    ఇపుడు జనులక రంబుల నేలెడి చర
    వాణి వీణ యెల్లపుడపస్వరము లొలుకు

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మధుర నాదము సృష్టించు మహిమ గలిగి
    తుంబురుడు నారదులను ముగ్ధులను జేయు
    వాణి వీణ; యెల్లపు డపస్వరము లొలుకు
    రాసభంబులు యెలుగెత్త రాగమనుచు

    "వాణి వీణ యెల్లపు డపస్వరము లొలుకు"
    ననుట సంగీత మెరుగని శునుల కొప్ప,
    శిశువు లాడుచు నిదురించ చింతలుడిగి
    రుజను బాపు నటందురు రూఢిగాను

    రిప్లయితొలగించండి
  9. నవరస భరిత సంగీత నాద వీణ
    పలుకు త్యాగరాజ కృతులు పరవసించ
    కాని యా కృతుల్ నేర్వని సాని, మధుర
    వాణి, వీణ యెల్లపు డపస్వరము లొలుకు.

    రిప్లయితొలగించండి
  10. ధాత వేదములను తడబడి చదువును
    హరి సుదర్శనంబు గురి తొలంగు
    విబుధవంద్య"వాణి వీణ యెల్లపుడప
    స్వరములొలుకు" ననుట పాడిగాదు.

    రిప్లయితొలగించండి
  11. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    ఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వీణ వాయించు కాంక్షతో వేయి మార్లు
    వీణ వాయించు చున్నను విసుగు లేక
    యెన్ని మార్లయి ననుమఱి యన్ని మార్లు
    వాణి ,వీణ యెల్లపుడ పస్వరము పలుకు

    రిప్లయితొలగించండి
  13. రాగమనురాగ తాళ మైసాగినపుడు?
    మమత మాధుర్య మందించు మనసు కెపుడు|
    సాధ నన్నది లేకున్న?సాగుపాట
    వాణి వీణ యెల్లపు డప స్వరములొలుకు.
    2.కవల లిద్దరి కంఠమ్ము కలసిపాడ?
    వాణి వీణ యెల్లపుడప స్వరము|” లొలుకు
    నిండబోనట్టి కుండనునెత్తుకొనగ?
    నిశ్చలత్వములోపించు|”నేర్పులేక|

    రిప్లయితొలగించండి
  14. శ్రీ కే.యస్ గురుమూర్తి గారి పూరణం
    ------------------------
    ప్రముఖ గాయకు డైనట్టిభరత శాస్ర్తి
    వాణియను తనయకు వీణనేర్పె
    వాణి వీణ యెల్లపు డప స్వరములొలుకు
    తండ్రి ఘనుడైనమాత్రాన ధరణి యందు
    వానిసంతతియంతయు వాసిగనున?
    చెరకు తుడగల ఒగుడు రుచింప గలదె?

    రిప్లయితొలగించండి


  15. సమస్య:వాణి వీణ [యెల్ల+అపుడు]యెల్లపుడపస్వరము లొలుకు
    వల్లకినిమీటివాయించ వాణి. ధాత
    సృష్టి జేసె నహల్యను హృష్టుడగుచు
    కూతు కాంక్షింప నత్యంత రోత గల్గి
    వాణి వీణ [యెల్ల+అపుడు]యెల్లపుడపస్వరము లొలుకు

    రిప్లయితొలగించండి
  16. 2.మగడుమగనిని,మగువయు మగువతోడ
    పేడి పేడిని పెండ్లాడ స్వేచ్చ నిచ్చి
    చట్టబధ్ధమ్ము జేసెను జడ్జి యనగ
    వాణి వీణ యెల్లపుడప స్వరము లొలుకు

    రిప్లయితొలగించండి
  17. 3.కేకి యెన్నడు కూయునో కాకి వలెను
    ఖరము యోండ్రించుటన్ మాని గర్జ జేయు
    వార్ధిభూమిని కబళించు ప్రళయవేళ
    వాణి వీణ యెల్లపుడప స్వరము లొలుకు

    రిప్లయితొలగించండి
  18. మేటి దర్శకుఁడని మొహమాట పడుచు
    స్వరములన్ గూర్చ నొప్పియు సాహసించె!
    స్వచ్చత కరువైన నెదకు నచ్చకున్న
    వాణి, వీణ యెల్లపుడపస్వరము బల్కు!

    రిప్లయితొలగించండి
  19. కొందరౌత్సాహికులొకట కూడి,వారు
    పాటతా దూరవాణిని పాడునపుడు
    పరగు వాద్యాలు తప్పునాపైన,దూర
    వాణివీణ యెల్లపుడపస్వరము లొలుకు

    వీణ వాయించువారికి విద్వతున్న
    తప్పుశృతియది నొకయెడ తప్పకయును
    దానినొప్పగు రీతిగా దాటకున్న
    వాణివీణ యెల్లపుడపస్వరము లొలుకు

    సరస గాంధార రిషభాలు సరిగ జేర్చి
    వీణ వాయించు టొప్పగు విధముదెలియ
    కుండి,సత్యవాణను కన్య కూర్చురాగ
    వాణివీణ యెల్లపుడపస్వరము లొలుకు

    దూరవాణిని విద్వత్తు దూరమైన
    వారు వాద్యాల వాయింప వచ్చుతప్పు
    నైన పలుకది,పాటలయందు దూర
    వాణి,వీణ యెల్లపుడపస్వరము లొలుకు

    రిప్లయితొలగించండి
  20. తే.గీ:నలువ రాణి వాణి జనుల నాలుక పైన
    వాస మెనరించి దీవించు వరమొ సంగి
    ఙ్ఞాన శూన్యు డొకడిలన ఙ్ఙతన బలికె
    వాణి వీణ యెల్లెడ నపస్వరము లొలుక

    రిప్లయితొలగించండి
  21. వీణ దోషము కాదిది వింటి నేను
    మెట్ల తీగల వంపుల మెలిక కాదు
    గురువు నొద్దను నేర్వక గోట మీట
    వాణి! వీణ యెల్లపు డపస్వరము లొలుకు.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    మీ పద్యం సుస్వరాలతో శ్రుతి సుభగంగా ఉన్నది

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులారా,
    ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  24. గురువు వద్ద సంగీతముఁ గూర్చుకొనక
    స్వంత సాధనతోడుత సాధ్యమగునె?
    అందు చేతన నాధయౌ యంధ బాలిక
    వాణి వీణ, యెల్లపుడపస్వరము పలుకు

    రిప్లయితొలగించండి
  25. మిత్రులకందఱకు నమస్సులతో...

    గాత్ర సంగీత సాధనకై యెపుడును
    వాణి వీణలు స్పర్థనుఁ బరిఢవింతు!
    రెన్నఁడేని యపస్వర మెసఁగఁ జనదు
    వాణి! వీణ యెల్లపు డపస్వరముఁ బల్కు!!


    రిప్లయితొలగించండి
  26. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    "మనసు కెపుడు" అనరాదు. మనసున కెపుడు అనవలసి ఉంటుంది. "సాధన+అన్నది" అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
    *****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. "వాణి యను తన తనయకు...' అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో "పాట తా"...?
    రెండవ పూరణలో "విద్వతున్న" అనడం దోషమే. అది తెలుగులో విద్వత్తు. "విద్వత" అనకూడదనుకుంటాను. విద్వత+ఉన్న అనుకున్నా అక్కడ సంధి దోషమే.
    మూడవ పూరణలో "సత్యవాణి+అను" అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "నాలుక పైన" అన్నచోట గణదోషం. "నాల్క పైన" అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "అంధ బాలిక" అన్నచోట గణదోషం. "అంధ కన్య" అందామా?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి