2, జులై 2015, గురువారం

సమస్యా పూరణము - 1719 (హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

32 కామెంట్‌లు:

  1. సత్పధమున శశి రాకకు
    ఉత్పల ములువిక సించె హృదయము పొంగన్
    తత్పర తకుసిగ్గు పడగ
    హృత్పద్మము ముడుచు కొనియె నినుఁ డుదయింపన్

    రిప్లయితొలగించండి
  2. సత్పథమున నెల విరియగ
    హృత్పద్మము ముడుచుకొనియె, నినుడుదయింప
    న్నుత్పలములు ముకుళించును
    తత్పరుడగు హిముని గనక తారాపథమున్!!!

    తత్పరుడు=ఆశగలవాడు

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణ,యతి దోషాలున్నాయి. సవరించండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "హిముని"...?

    రిప్లయితొలగించండి
  4. ఉత్పాటించగ నలసతఁ
    దత్పరతయె లేకపోయె; తామస గుణమౌ
    యుత్పాతకారి, మనుజుని
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. సత్పధము తప్పియుంట సు
    హృత్పద్మము ముడుచుకొనియె;నినుడుదయింపన్
    చిత్పరిమళ మెగజిమ్ముచు
    తత్తత్పరిధులను దాటె తామరకొలకుల్

    రిప్లయితొలగించండి
  8. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. "తత్పరిధుల నొనర దాటె..." అందామా?

    రిప్లయితొలగించండి
  9. మూర్తి గారూ,
    సవరించిన పూరణలో ప్రాస తప్పింది.

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారికి దొరలిన టైపాటు సవరించేలోపుననే మీరు నా పద్యాన్ని సమీక్షించారు గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  11. నిజమే,నేను గమనించలేదు మీసవరణయే సబబు

    రిప్లయితొలగించండి
  12. అయినా,పద్మము ముడుచుకోవడం ఇనుడుదయించడమే ఒక సమస్య అయితే దానికి"హృత్"అనేదికూడాఎందుకు జేర్చారండీ?మాలాంటివాళ్ళకి దుష్కరం అయ్యేందుకేనా?

    రిప్లయితొలగించండి
  13. సత్పథ గామిని సుమతి
    తత్పురుషాదుల మొరవిని తపనుని విడువన్
    తత్పరి ణామంబు సుదతి
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. తత్పరమాత్మను మరచిన
    హృత్పద్మము ముడుచుకొనియె, నినుడుదయింపన్
    సత్పథము గాంచె . యాభగ
    వత్పాదుల చరణసేవ భాగ్య మనంగన్

    రిప్లయితొలగించండి
  16. సత్పధము లేమి నాతని
    హృత్పద్మము ముడుచు కొనియె నినుడు దయింప
    న్నుత్పలములు ముకుళించును
    దత్పరి ణా మంబులెపుడు ధరలో గలుగున్

    రిప్లయితొలగించండి
  17. ఉత్పలములు వికసించెను
    హృత్పూర్వకముగ విభుని సాయంసంధ్యన్
    తత్పరత తోడ కలువగ
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్.

    రిప్లయితొలగించండి


  18. ఈ త్పప్రాసను నే న
    వ్యుత్పన్నుడ నా సమస్య పూరించుటలా?
    ఉత్పలమున నవనీతసు
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

    రిప్లయితొలగించండి
  19. సత్పథికుండౌ పక్షపు
    తత్పరు రాజీవుఁ గూల్చి తప్పించగ నో
    యుత్పాతమ్మున, సోనియ
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁడుదయించన్!

    రిప్లయితొలగించండి
  20. సత్ఫలమందున బెరిగిన
    నుత్పత్తిగ శాస్త్ర వేత్త నుత్సాహమునన్
    ఉత్పల మైనది కృత్రిమ
    హృత్పద్మము ముడుచు కొనియె|నిను డుదయించన్|
    2.ఉత్పత్తిని బెంచుటకై
    సత్పలమాసించి రైతు సరియని కల్తీ
    ఉత్పాతకమౌ మందిడ?
    హృత్పద్మము ముడుచుకొనియె|నినుడుదయించన్.

    రిప్లయితొలగించండి
  21. హృత్పీఠము నందు సఖినటు
    తత్పర భావంబుతోడ దరినే జేర్పన్
    తత్పీన స్థని కేళిని,
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    హృత్పీఠి భీతి వీడియు,
    తత్పశ్చిమ సూర్యుడటుల,తటుకున గ్రుంకన్
    కృత్పాపి సైంధవునకును
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    హృత్పథము కోర్కె నింపుక
    తత్పతి దలచెడి సకియకు,దయలేకుండన్
    హృత్పతి యుదయము జేరగ,
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    తత్పార్వతి శివునకునై
    హృత్పథమున తా,తపమిడ హేయపు వృద్ధై
    తత్పరమశివుని తిట్టగ
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    రిప్లయితొలగించండి
  22. ఉత్పల నాథుని సందిట
    నుత్పన్నసరస విలాసి తోత్సవ సద్యో
    తత్పరతాంచిత యామిని
    హృత్పద్మము ముడుచుకొనియె నినుడుదయింపన్

    రిప్లయితొలగించండి
  23. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    సత్పధ గామిని నని శశి
    నుత్పల మాలయె నుతించ నో రాతిరి లో ;
    తత్పరతను మునిగి పిదప
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

    రిప్లయితొలగించండి
  24. సత్పధమున శశి రాకకు
    నుత్పలములు వికసించె నుప్పొంగు మదిన్
    తత్పరతకు సిగ్గుపడగ
    హృత్పద్మము ముడుచు కొనియె నినుఁ డుదయింపన్

    రిప్లయితొలగించండి
  25. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    (శప్తుఁడగు పతి మరణ కారకమైన సూర్యోదయము నరికట్టుటకై సతీసుమతి పలికిన సందర్భము)

    "మత్పతి శప్తతఁ గని మ
    ద్ధృత్పద్మము ముడుచుకొనియె! నినుఁ డుదయింపన్
    సత్పథగామిగఁ గాక, వి
    య త్పరివృత తిమిరము వెలయఁగవలె నెపుడున్!!"

    రిప్లయితొలగించండి