4, జులై 2015, శనివారం

సమస్యా పూరణము - 1721 (స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె.

36 కామెంట్‌లు:

  1. వేడుకపడగా జానకి - వెంబడించె
    స్వర్ణ మృగమును రాముడు - పట్టి తెచ్చె
    నా యయోనిజనా రావణాసురుండు
    దుష్టబుద్ధితో లంకకు దొంగవలెను

    రిప్లయితొలగించండి
  2. భార్య కోరిక దీర్చెడి భర్త గాను
    వెతల నెఱుగక మారీచు వెంట నంటె
    స్వర్ణ మృగమును రాముఁడు , పట్టి దెచ్చె
    సాద్వి సీతను రావణు సంత సముగ

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రావణు’ అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘దనుజుడు సంతసమున’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    రాముడు బంగారుజింకకు తీసుకువచ్చినట్టుగా ఊహాలోకంలో విహరిస్తున్న సీత విషయంగా నేను పూరణ చేయాలనుకున్నాను. ముందుగా మీరే ఆ పని సమర్థంగా చేశారు.
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రాముని సామర్థ్యము పై యిసుమంతైనా సందేహం లేని సీత తప్పకుండా
    స్వర్ణమృగమును రాముడు తెచ్చుననీ దానిని పట్టుకొని తాను ముద్దాడుదు
    నని ఊహలలో మునిగిన సమయాన "హా సీతా హా లక్ష్మణా " యని పతి
    యార్తరావము వినిపింప వాస్తవము గమనించిన సందర్భము :

    01)

    _________________________________

    ఊహలలో మునిగిన సీత :

    స్వర్ణమృగమును రాముఁడు - పట్టి తెచ్చె
    ననుచు లక్ష్మణు డరచిన - నాత్రపడుచు
    పరుగు పరుగున వెలువడి - పర్ణశాల
    మురిసి మృగమును జానకి - ముద్దులిడుచు

    వాస్తవమున సీత :

    నున్న సమయాన వినిపించె - నువిద కంత
    నార్తరావము పతినోట - నాపదనుచు !
    తల్లడిల్లుచు లక్ష్మణు - దరిమె నంత
    నన్న మాటలు కావవి - యన్న వినక !
    _________________________________

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! శుభోదయము మరియు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! మీ ఆలోచనను నేను తస్కరించ లేదు గదా ?

    రిప్లయితొలగించండి
  8. శంకరార్యా ! ఈ సరికే మీ పూరణ సిద్ధమైతే - మాకూ వినిపించొచ్చు గదా !

    రిప్లయితొలగించండి
  9. వసంత కిశోర్ గారూ,
    మీ కోరికపై నా పూరణ.....

    తన మనోరథ మీడేర్చ చనియు వేగ
    స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె
    ననుచు నూహలలో మున్గె నవనిజాత
    కలలు కల్ల లౌనని యెఱుంగని లతాంగి.

    రిప్లయితొలగించండి
  10. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ నిస్సందేహంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. "ప్రేమలత"తనపతి"రాము"గోరుకొనెను
    స్వర్ణమృగమునౌర!బహుమతిగను
    మెచ్చి మదిని "స్వర్ణమృగమునురాముడు
    పట్టితెచ్చె"చేత కొట్టున గొని.

    రిప్లయితొలగించండి
  12. మాయ లేడని యెరుగక మనసు పడిన
    సీత కోరిక దీర్చగ ప్రీతి తోడ
    స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
    దనని వెంబడించుచు వేగ తరలె నతడు!!!

    రిప్లయితొలగించండి
  13. దువ్వూరి రామమూర్తి గారూ,
    ఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లేడి+అని’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాయలేడిగ నెఱుగక మనసు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. కర్ణు డన్నయగును కుంభ కర్ణు నకును
    స్వర్ణ మృగము రాముడు పట్టి దెచ్చె
    పరశురాముడు రాముని భ్రాత యగును
    అనున వెల్లన సాధ్యము లైనవి గద

    రిప్లయితొలగించండి
  15. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మృగమును’లో ‘ను’ టైపాటువల్ల తప్పిపోయింది.

    రిప్లయితొలగించండి
  16. స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె
    దనని పరుగెత్తుచున్నట్టి దానివెంట
    వెడలి పోయె నదునుగని భిక్ష వేష
    దారి యైవచ్చి సీతను తత్క్షణంబె
    ఎత్తుకొని రావణాసురుండేగె లంక

    రిప్లయితొలగించండి
  17. అవనిజాత కోరిక దీర్చగ వెనుదగిలె
    అడవిదారిన పారిన యసురకృతక
    స్వర్ణ మృగమును రాముడు.పట్టి తెచ్చె
    రక్ష లేనట్టిసీతను రావణుండు

    రిప్లయితొలగించండి
  18. స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
    ననుట సరిగాదు మారీచు డ దియ ,మారి
    యటుల ,మాయను గల్పించి యాయమ పుడ
    మి దుహిత నపహరింప గ నదను జూచి

    రిప్లయితొలగించండి
  19. తే.గీ: పసిడి జింకను గోరెనా పడతి సీత
    స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
    ద ననుచు కదిలె,వలదని తమ్ము డన్నఁ
    వినక దుష్టుని/మారీచు శిక్షింప వెడలె తాను

    రిప్లయితొలగించండి
  20. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
    ననుచు కమ్మని కలగను నవనిజాత
    అయ్యె-హాసీత|హా లక్ష్మణా యటన్న
    ఆర్త నాదము విని వికలాత్మ యయ్యె
    ----------------------
    శ్రీకే.యస్ గురుమూర్తి గారి పూరణం
    జులై 04, 2015 2:02 [PM]

    రిప్లయితొలగించండి
  23. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘సువర్ణమయపు స్వర్ణమృగ’మన్న చోట పునరుక్తి ఉన్నది.
    రెండవపూరణలో ‘వర్ణలేడి’ అన్నది దుష్టసమాసం. ‘వర్ణమృగము’ అనండి.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ప్రీతిఁ గలిగించ సీతకు, వెదుకఁ బోయె
    స్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
    రాక్షసాధముండట కొక భిక్ష పాత్ర
    మరణ కబళము నందగ మాత కడకు.

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యా ! మీ పూరణ చక్కగా నున్నది !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు ధన్యవాదములు. చిన్న పొరబాటును సవరించేలోగా మీ సమీక్ష జరిగిపోయింది.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పడతి కోర్కెను దీర్చగ బట్ట నేగ
    స్వర్ణమృగమును రాముఁడు, పట్టి తెచ్చె
    నడవి నొంటరి వైదేహి నసురరాజు ;
    రావణుని జంపె రఘుపతి గావ నామె

    రిప్లయితొలగించండి
  29. స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
    ననుచు కలలను కనుచుండ నడవిలోన
    రావణాసురు డేతెంచి రయముగాను
    మహితనూజఁగొనిపోయె మాయతోడ

    రిప్లయితొలగించండి
  30. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మహితనూజను’లో ‘ను’ తప్పిపోవడం టైపాటనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  31. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    (బంగరు జింకనుఁ దెచ్చుట కేఁగిన రామునిం గూర్చి సీత తన మనస్సున వితర్కించిన సందర్భము)

    "స్వర్ణ మృగమును రాముఁడు పట్టి తెచ్చె
    నా, మదీయ హృదయమున హర్షమెసఁగుఁ!
    దేక పోయెనా, మదిని భ్రాంతియు నణంగు!
    నేమి యైనను నేను గ్రహింతు నిపుడు!!"

    రిప్లయితొలగించండి
  32. గుండు మధుసూదన్ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ అలరింపజేసింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. పందెమట్లుగ పోటీలు పొందుబరచ?
    ఉంచుసమయానికే ముందు నుంచుటాయె|
    స్వర్ణ కారుడుగూర్చె-విశ్వాసమందు
    స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె|
    2.కోర్కె లందించు నాశకు కొదవ లేదు
    స్వర్ణ మృగమును రాముడు పట్టితెచ్చె
    అనెడి యూహలుసీతమ్మ నందుకొనగ?
    పర్ణ శాలన దిరిగెను వర్ణ-మృగము.

    రిప్లయితొలగించండి
  34. పడతి కోరిక వినినంత భారమనక
    విల్లు బాణముల్ చేగొని వెంబడించె
    స్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
    నంత సీతను మోసాన యసుర రేడు

    రిప్లయితొలగించండి
  35. పడతి కోరిక వినినంత భారమనక
    విల్లు బాణముల్ చేగొని వెంబడించె
    స్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
    నంత సీతను మోసాన యసుర రేడు

    రిప్లయితొలగించండి
  36. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి