7, జులై 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1723 (భారమనిరి తాళి భార్య లెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భారమనిరి తాళి భార్య లెల్ల.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు. 

37 కామెంట్‌లు:

  1. నేటి యుగము నందు సాటిమా కెవరంచు
    బొట్టు దీసి పెట్టె గట్టు మీద
    సూత్ర మేల ఇకను సొగసైన పతియుండ
    భార మనిరి తాళి భార్య లెల్ల

    రిప్లయితొలగించండి
  2. శుభ గుణావహమ్ము శోభాయమానమ్ము
    పరమ పావనమ్ము భర్తృ జీవ
    కారణమ్ము కలికి గళ మహాభరణ సం
    భారమనిరి తాళి భార్య లెల్ల !

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    శ్రీ విష్ణు నందన్ గారూ మీ పద్యం అద్భుతంగా ఉంది .అభినందన మందారములు

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యంలో కర్తృపదం ‘భార్యలు’ బహువచనం. ‘పెట్టె’ ఏకవచనం. అక్కడ ‘బొట్టు తీసి పెట్టి గట్టుమీద’ అనండి.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ మనోజ్ఞంగా, ఔత్సాహికకవులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. బొట్టు నుదుట బెట్టి పూలు సిగనుముడ్చి
    కనుదోయి కింత కాటుకద్ది
    భర్తలుండ తమకు భావ్యమే యనుచు సం
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి
  6. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కనుదోయి’ అంటే గణదోషం..‘కన్నుదోయి’కి టైపాటు కావచ్చు.

    రిప్లయితొలగించండి
  7. వంశ గౌరవ మ్ము వర్ధత గలిగించు
    కులసతి యని జెప్ప కొండ గుర్తు
    స్వగృహ నిర్వహణమ జస్రము సలిపెడి
    భారమనిరి తాళి భార్య లెల్ల

    రిప్లయితొలగించండి
  8. మెడను పసుపుకొమ్మ మేలుగా ధరియించి
    తీర్చుడనుచు ఋణము తీరుగాను
    పతులకిచ్చినారు బంగారమేయుండ
    భారమనిరి తాళి భార్య లెల్ల.

    రిప్లయితొలగించండి
  9. పట్టుచీరకట్టు బొట్టు కాటుకరేఖ
    మెట్టెలుమురిపంపు పట్టెడలును
    వాలుజడలు పూలు మేలుమేల్ మాకేమి
    భారమనిరితాళి భార్యలెల్ల.

    రిప్లయితొలగించండి
  10. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పసుపుకొమ్ము’ టైపాటువల్ల ‘పసుపుకొమ్మ’ అయింది.
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ద్రవిడ సంస్కృతి యని తమిళనాడున కొంద
    రిదియె హేతువాద మిదియె నీతి
    యనిన తాళిబొట్టులను తీసివేసిరి
    భార మనిరి తాళి భార్య లెల్ల.

    (కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలతో)

    రిప్లయితొలగించండి
  12. నాగజ్యోతి సుసర్ల గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒదిలేసి, వొళ్ళు’ అని గ్రామ్యపదాలను వాడారు. ‘...కొరకు నన్నమ్మును వదలి..... యొంటినిండ కప్పు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. వెలది జీవనంబు పెండ్లితో ముడిపడు
    మనువు నాడి నట్టి మగడె తోడు
    నీడ, అతడు కట్టి నట్టి సూత్రమ్మె సం
    భార మనిరి తాళి భార్య లెల్ల.

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరమ్మ గారికి , శంకరయ్య గారికి ధన్యవాదాలు.

    నాగజ్యోతి సుసర్ల గారు , 'లేక' పదము - కళ, ద్రుతాంతము కాదు కనుక మీ పద్యం రెండవ పాదం చివర మరియు మూడవ పాదం మొదలు ఇలా సవరించండి ----> ... లేక యొంటి నిండ ....

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదములండీ శంకరయ్య గారూ సరిజేసిన పద్యము

    సున్న బరువు కొరకు నన్నమ్మును వదలి
    చిన్న బరువు నోప దన్ను లేక
    యొంటి నిండ కప్పు నుడుపులతోపాటు
    భారమనిరి తాళి భార్యలెల్ల

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వస్త్ర ధారణమ్మె బహు కష్టమై యుండ
    భారమనిరి తాళి భార్య లెల్ల
    పశ్చమాన; భావి భారత గృహిణులు
    గేలి సేతురేమొ తాళిజూప !

    రిప్లయితొలగించండి
  17. తీర్థ యాత్రలందు తిరుగ పుత్తడి తోడ
    క్షేమకరము కాదు, చిన్న పసుపు
    దారమున్న చాలు, తప్పదు తీయక
    భారమనిరి తాళి భార్య లెల్ల.

    రిప్లయితొలగించండి
  18. పసుపు తాడు చాలు భార్యలకనుచును
    తాళి నిమ్మనె పతి త్రాగుటకును
    తాళి మెడ ధరింప తస్కరింతు రనుచు
    భారమనిరి తాళి భార్యలెల్ల

    రిప్లయితొలగించండి
  19. బానిసత్వమనుచు భావించి కొందరు
    తాళి బొట్లు తీసె తమిళనాట
    కట్టు బట్ట బొట్టు కడకుమాంగల్యమున్
    భారమనిరి తాళి భార్యలెల్ల !!!

    రిప్లయితొలగించండి
  20. ధన్యవాదములు గురువుగారూ.. సవరణతో.,

    బొట్టు నుదుట బెట్టి పూలు సిగనుముడ్చి
    కన్నుదోయి కింత కాటుకద్ది
    భర్తలుండ తమకు భావ్యమే యనుచు సం
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి
  21. పుట్టినపుడు వచ్చు పూలుబొట్టులతోడ
    నాడువారి సొగసు యందగించు
    గళము తళుకులాడు కమనీయ మైన సం
    భారమనిరి తాళి భార్యలెల్ల

    రిప్లయితొలగించండి
  22. ఆ.వె:ధనమదమును బూని తరుణి యొకతె తాను
    పసిడి నగల నెల్ల భామ లెదుట
    జూపి గేలి సేయ జూడుమిట తులలేని
    భారమనిరి తాళి భార్యలెల్ల.

    రిప్లయితొలగించండి
  23. సొగసు దనము నికను సోకులు గలిగియు
    కన్ను మిన్ను గాన క గరు వమున
    భార మనిరి తాళి భార్యలె ల్లరు మఱి
    కలియు గమిది ,యెన్నొ కలుగు నికను

    రిప్లయితొలగించండి
  24. వాడ నున్న జనులు వనభోజనములకు
    జనుచు, భర్త లెల్ల జాల వడిగ
    నేగ, బిడ్డ లతల నిడుచు నడువ
    భార మనిరి తాళి(నిధానించి)భార్య లెల్ల

    రిప్లయితొలగించండి
  25. వాడ నున్న జనులు వనభోజనములకు
    జనుచు, భర్త లెల్ల జాల వడిగ
    నేగ, బిడ్డల తల నిడి నడువగ లేక
    భార మనిరి తాళి,(నిదానించి) భార్య లెల్ల

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. పదుగు రాడ వారి భర్తయై వెలుగొందు
    పరమ తాగు బొతు భ్రష్టు డైన
    వాడు పెట్టు బాధ భరియింప లేకనే
    భారమనిరి తాళి భార్యలెల్ల

    రిప్లయితొలగించండి
  28. "పెండ్లి ఖర్చు వెరసి విభుని కట్నమ్ము తో
    పది "ల"కారములకు పైన బడెను"
    పతిని తెచ్చుకొన్న వైనము వినినంత
    భారమనిరి "తాళి' భార్యలెల్ల.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    సకల భువనములను సంతసమ్మునఁ దాల్చి
    ప్రోచునట్టి మగఁడు పురుష వర్యుఁ
    డష్టభార్యలకును హర్షంబునను గట్ట
    "భార" మనిరి తాళి భార్యలెల్ల!

    (చతుర్దశ భువన భాండములను భరించు భర్త [=తాళి] భారముగాఁ గాక తేలికగా నుండునా? యని చమత్కారము!)

    రిప్లయితొలగించండి
  30. కట్టు కున్న వాడు కనుమూసి నంతనే
    దిగులు పడుచు నున్న మగువఁ జూచి
    బొట్టు కాటుకలవి మోమునఁ జెల్లవు
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి
  31. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కొందరు’ అన్నారు కనుక తీసే అని కాకుండా ‘తీసిరి’ అని ఉండాలి. ‘తాళి తీసినారు తమిళనాట’ అందామా?
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    ‘కాటుక+ అద్ది’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘కాటుక నిడి’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సొగసు+అందగించు = సొగ సందగించు’ అవుతుంది. యడాగమం రాదు. అయినా సొగసు, అందము పునరుక్తి అవుతున్నది. ‘తోడ| నాడువారి రూప మందగించు’ అందామా?
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భామల+ఎదుట’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పదుగు రెదుట’ అనండి. మూడవ పాదంలో గణదోషం. ‘జూడుమిట’ను ‘జూడుము’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    సీసపద్యంలో ‘ఆకతాయుల కవి యడ్డుకట్ట, ... ఆకర్షణమునకు నాటకట్టు.... (నగ్నత+అందు= నగ్నత యందు).. నగ్నత యన హాయి...’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తాగుబోతు’... టైపాటు వల్ల తాగుబొతు అయింది.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    వ్యంగ్యార్థభరితమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. ఒక్క భార్య గాక మక్కువ బెరుగంగ
    చంచలత్వమందు నెంచుకొన్న
    భార్య లెక్కువైన?పడతులు గనుపించ
    భారమనిరి తాళి –భార్యలెల్ల
    2.కాళ్ళకు మెట్టెలు కనుపించుతాళియు
    ------ఆకతాయులకవి –యడ్డుకట్ట|
    నుదుటకుంకుమ బొట్టు- కుదురు చీరయుకట్టు
    -------ఆకర్ష ణమునకు-నాటకట్టు|
    నవజీ వనంబున భవితకు భారమౌ
    --------కలిమి బలిమి వింత కల్మషంబు
    నాటి సంస్కృతు లెల్ల చాటెడిపద్ధతుల్
    -------మట్టుబెట్ట గలుగు మగువ లెల్ల
    కొప్పుజడలుద్రుంచి కోర్కెల ముసుగులో
    అర్ద నగ్నతయనహాయి యనెడి
    ఊహలున్న వారి మోహము బెరుగగ?
    భార మనిరి తాళిభార్య లెల్ల
    3.చదువుకున్న గుణము ?సంస్కార వంతమే
    పదవులందు జేర?పట్టుదప్పే
    నవ్య నాగరికత నట్టేట ముంచగ?

    రిప్లయితొలగించండి
  33. గురువుగారు! సవరించాను
    వెలది జీవనంబు పెండ్లితో ముడివడు
    మనువునాడి నట్టి మగనితోడ
    అతడు మెడన గట్టు యా సూత్రమౌను సం
    భారమనిరి తాళి భార్యలెల్ల.

    రిప్లయితొలగించండి
  34. కె. ఈశ్వరప్ప గారూ,
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీరు సవరించిన పూరణలు బాగున్నవి. సంతోషం, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. బొట్టు నుదుట బెట్టి పూలు సిగనుముడ్చి
    కన్ను దోయి కింత కాటుక నిడి
    భర్తలుండ తమకు భావ్యమే ననుచు సం
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి
  36. బొట్టు నుదుట బెట్టి పూలు సిగనుముడ్చి
    కన్ను దోయి కింత కాటుక నిడి
    భర్తలుండ తమకు భావ్యమే ననుచు సం
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి
  37. బొట్టు నుదుట బెట్టి పూలు సిగనుముడ్చి
    కన్ను దోయి కింత కాటుక నిడి
    భర్తలుండ తమకు భావ్యమే ననుచు సం
    భారమనిరి తాళి భార్య లెల్ల!

    రిప్లయితొలగించండి