12, జులై 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1728 (హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము.

30 కామెంట్‌లు:

  1. ఎన్నికల సమయమ్మున నెటులనైన
    గెలువ నేతలు మాయమాటలను చెప్పు
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    కూడ తెచ్చెదమనవచ్చు గొప్పకొరకు

    రిప్లయితొలగించండి
  2. అప్సరసలిచట జలక మాడవచ్చు
    గార్ధభాలు తిరగవచ్చు గగనమందు
    హైదరాబాదులోన నౌకాశ్రయంబు
    సాధ్యమవనిదేది కలదు స్వప్నమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సకల సౌకర్యములతోడ స్వర్గ మనగ
      నొప్పుచుండెడి నగరమీ యుర్విలోన
      దీప్తులొసగు చుండిన నేమి? లుప్త మయ్యె
      హైదరా బాదులోన, నౌకాశ్రయమ్ము

      తొలగించండి
    2. గురువు గారికి ప్రణామములు

      సకల సౌకర్యముల తోడ స్వర్గ మనగ
      నొప్పు చుండెడి నగరంబు ఉర్వి లోన
      దీప్తులొసగుచుండిననేమి? లుప్త మయ్యె
      హైదరాబాదులొన, నౌకాశ్రయమ్ము

      తొలగించండి
  3. హైదరాబాదు లోననౌ కాశ్ర యమ్ము
    కలను గాంచిన పౌరుడు కలత బడుచు
    సంత సంబున పలికెను సతిని బిలిచి
    గగన మంటిన కోరిక తగదు నిలకు

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘నగరంబు+ఉర్విలోన’ అన్నచోట సంధి నిత్యం. అక్కడ ‘నగరమీ యుర్విలోన’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తగదు భువిని’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సంప్రాప్త స్థాన’మన్నప్పుడు ‘ప్త’ గురువై గణదోషం. ‘సకల సౌకర్య విలసిత స్థాన మిదియు’ అందామా?

    రిప్లయితొలగించండి
  5. ఆది నుండియే పేరుంది యవనియందు
    లేదిట కొరత దేనికి లేశమైన
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    తప్ప, సంద్రమున్ననదియు తప్పకగును

    రిప్లయితొలగించండి
  6. విశ్వ పర్యాటకులు మెచ్చ విరివి గాను
    కళ్ళు మిరిముట్లు గొలిపేటి కట్ట డమ్ము
    గ్రంధి మల్లికార్జునరావు కల్పితమ్ము
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము!!!

    రిప్లయితొలగించండి
  7. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  8. వరదపాలౌచు నుప్పొంగ,శరధి యాయె
    నగరిమేడలు గననాయె నౌకలవలె
    వాడలందున మోటార్లు పడవలవగ
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము

    రిప్లయితొలగించండి
  9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. హైదరా బాదులోన నౌ కాశ్ర యమ్ము
    బాగు సెప్పితి రార్యులు ,వారు కట్టు
    దురట టాంకుబండు దరిన తోయజాక్షి !
    పోయి చూడుమ యొకసారి భూమి నచటి

    రిప్లయితొలగించండి
  11. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    1) సర్వ సౌఖ్యములకు తోడు సైనికపురి
    యున్న దైనను సంద్రమ దేది యచట ?
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    నల్ల సునామి యె సృష్టించ నపుడె వచ్చు

    2) అల నిజాములె సృష్టించి రద్భుతముల;
    నడిగి రల్లాను సంద్రము నచట నుంచ;
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    కలియుగమ్మున రాదని కలను దెలిపె

    రిప్లయితొలగించండి
  12. ఓడ రేవున నక్రమాలున్నవంటు
    తిరిగి వచ్చిన మంత్రియే తేల్చెనంట!
    యెంత మందిని ముంచునో యెవరికెరుక
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము!

    రిప్లయితొలగించండి
  13. సాగరపు తీరమేలేక సాధ్యమౌనె
    హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
    యాధ్ర రాష్ట్రపు తోడ్పాటు నందుకొన్న
    సరుకుల రవాణ సలుపుట సాధ్యమగును

    రిప్లయితొలగించండి
  14. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారు కృతజ్ఞతలు,
    మీసూచనకు అనుగుణంగా

    హైదరాబాదు సర్వుల కాశ్రయమ్ము
    సకల సౌకర్య విలసిత స్థానమిదియ
    లేమి యనుమాట కనమిందు, లేని దొకటె
    హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము

    రిప్లయితొలగించండి
  16. రాజకీయ నాయకుడు:

    పోయె భాగ్యనగరమని పొగల వలదు
    దాని మించుపురము కట్టెదమొకొ పేరు
    నదియె పెట్టుచున్ గట్టెదమట్టి క్రొత్త
    హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము

    రిప్లయితొలగించండి
  17. అప్సరసలిచట జలక మాడవచ్చు
    గార్ధభాలు తిరగవచ్చు గగనమందు
    హైదరాబాదులోన నౌకాశ్రయంబు
    సాధ్యమవనిదేది కలదు స్వప్నమందు

    రిప్లయితొలగించండి
  18. ఆంధ్ర దేశపు పటమున నైదు పేర్లు
    గుర్తు బెట్టగ జెప్పె మా గురువు గారు
    నదులు గోదావరీ కృష్ణ, నల్లమలయు
    హైదరాబాదు, లోన నౌకాశ్రయంబు.

    రిప్లయితొలగించండి
  19. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. డా. బల్లూరి ఉమాదేవి గారి పూరణ......

    రమ్యమైన దిదియె మన రాజధాని
    భూతలస్వర్గ మన్న యభూతకల్ప
    నమ్ము గాదు లేనిదొకటె నమ్ము లేదు
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము.

    రిప్లయితొలగించండి
  21. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. హైధరా బాధలున్నవిఅందుకొరకె?
    హైదరాబాదులోన-నౌకాశ్రయమ్ము
    పెట్టలేదని దెలిపెడి పెద్దమనిషె
    త్రాగి వాగగ?తప్పను ధైర్యమేది?
    2,మాట ,మూటలుబంచెడిమానవతను
    బంచగలిగిన నాయకుల్ పలుకులందె
    హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
    పెట్టగలమని వాగ్ధాటిబెంచి యనిరి
    తీరమందున పలుకులే చేరగానె
    మత్తుదిగకున్నమంత్రియు మాటఘాటు|

    రిప్లయితొలగించండి
  23. శ్రీ కే.యస్ గురుమూర్తి గారి పూరణం
    ----------------------------
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    లేదు?కారణ మేమొ దెలియ బరచుము?
    హైదరాబాదులో నౌక లసలు లేవు
    గనుకనౌకాశ్రయమచటగట్టలేదు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులతో...

    నా మొదటి పూరణము:

    ఏండ్లు గడచిన మునుమంది దేమియగునొ?
    యెవ్వ రెఱుఁగుదురో యయ్య యీ నగరము?
    కన నెడారులు సంద్రాలగునొ? వెలయునొ
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము?

    నా రెండవ పూరణము:

    కలవు తాజమహలది యాగ్రా నగరిని,
    హౌర కలకత్తలోఁ, జార్మినారు, కోఠి
    హైదరాబాదులోన, నౌకాశ్రయమ్ము
    వరలె ముంబాయిలో, విను, భరతపుత్ర!

    రిప్లయితొలగించండి
  25. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. నౌకయానాన పోటీలు నందు జరుగు
    ప్రీతి హుస్సేను సాగరు పేరు హ్రదము
    నెపుడు,కనుక కననగును నేడునింపు
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము

    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
    యెటులనుండును,సంద్రమే లేకయిచట
    సాగరంబను పేరొందు చాల చెరువు
    లందు కనుపించునావలు నందమలర

    ఓట్ల కొరకయి నేతలు గొప్పగాను
    పలుకుచుందురు వారల పలుకు వింత
    "రేపె తెత్తుము నోడలరేవు నిటకు
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము"

    నేడు నంతర జాలాన నిఖిల జగతి
    దర్శనంబిచ్చు నింటనే దానియందు
    వివిధ పోర్టుల నౌకల పెద్దవిచట
    హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ‘నౌకాశ్రయమ్ము+ఎటుల’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘నౌకాశ్రయ మ్మ|దెటుల నుండును...’ అనండి.

    రిప్లయితొలగించండి