15, జులై 2015, బుధవారం

సమస్యా పూరణము - 1731 (సారా గొనె శివుడు లోకసంరక్షణకై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సారా గొనె శివుడు లోకసంరక్షణకై. 
(ఒకానొక అవధానంలో ఎర్రాప్రగడ రామకృష్ణ గారు ఇచ్చిన సమస్య)

40 కామెంట్‌లు:

  1. ధీరుఁడు త్రిలోక పూజ్యుఁడు
    కారుణ్యాంబుధి యశేష గణముల పతియై
    కోరి హలాహలమును మన
    సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై.

    రిప్లయితొలగించండి
  2. పారా వారము చిలుకగ
    ఔరా యేతెంచె నంట హాలా హలమే
    నారాయణి పలుకున మన
    సారా గొనె శివుడు లోకసం రక్షణకై

    రిప్లయితొలగించండి
  3. క్షీరాబ్ధి నుండి పుట్టిన
    యారమయే యాదివిష్ణు యంకము జేరన్
    హాలాహలమున్ దనమన
    సారాగొనె శివుడు లోక సంరక్షణకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షీరాబ్ధి నుండి పుట్టిన
      యారమయే యాదివిష్ణు యంకము జేరన్
      ఘోరహలాహలమున్ మన
      సారాగొనె శివుడు లోక సంరక్షణకై

      తొలగించండి
  4. ఈరోజు అందరూ ‘మనసారా’ పూరణలు చేసేట్టు ఉన్నారు!
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో ప్రాస తప్పింది. ‘ఘోర హలాహలమున్ మన|సారా...’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. (ఈమధ్యకాలంలో మీనుండి వచ్చిన అత్యుత్తమమైన పూరణ ఇది!) అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారికీ నమస్కారములు ర ల లకు భేదం లేదనే ఉద్దేశ్యంలొ ప్రాస ల ను ఉపయో గించానండి

      తొలగించండి
  5. కవిమిత్రులకు గమనిక...
    భాస్కర రామిరెడ్డి గారు ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ను ‘తెలుగు నిఘంటువు’ పేర మళ్ళీ లైవ్ చేశారు. గతకొంతకాలంగా సాంకేతికకారణాలవల్ల అది తెరుచుకొనడం లేదు. ఇప్పుడు మిత్రులు బ్లాగులో కుడివైపున ఉన్న ‘తెలుగు నిఘంటువు’ లింకును క్లిక్ చేసి ఆ నిఘంటువును చూడవచ్చు.

    రిప్లయితొలగించండి


  6. చేరుచు జిలుకగ సంద్రము
    మీరుచును హలాహలమట మీదకు రాగా
    ఘోరము నాపగ తన మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై.

    రిప్లయితొలగించండి


  7. మాస్టరు గారూ ! ఈ రోజు అందరూ ' మన ' సారా నే అందుకుంటున్నారు...వేరొక ' సారా ' అందటం లేదు...

    రిప్లయితొలగించండి
  8. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    పోరునఁ ద్రిపురాసుర సం
    హారముకై విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
    తేరు గుణి శిఖుల నిడ, మన
    సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!

    రిప్లయితొలగించండి
  9. సారా యనగా మొత్తము
    పారావారమ్ము జిలుక వచ్చిన విషమున్
    చేరుచు నింత మిగల్చక
    "సారా" గొనె శివుడు లోకసంరక్షణకై.

    రిప్లయితొలగించండి
  10. నా రెండవ పూరణము:

    (త్రిపురాసురసంహారమున నుపయుక్తమగు బీజాక్షరమ్ముం గొనుమని విశ్వకర్మ యనఁగా శివుఁడు "రం" బీజాక్షరమును స్వీకరించిన సందర్భము)

    కోరుమయ బీజాక్షర
    మేరీతిని యుక్తము మఱి హితకరమనఁగన్
    గోరి మనః కర్మణ వచ
    సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మనసారా’ కాకుండా వైవిద్యంగా పూరించే ప్రయత్నంలో ‘సారా(మొత్తము)’ అన్నారు. బాగుంది. కాకుంటే అది అన్యదేశ్యపదం! సమస్యాపూరణలో ఆమేదయోగ్యమే లెండి!
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు వైవిద్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘సంహారముకై’ అన్నారు. ‘సంహారమునకై’ అని ఉండాలనుకుంటాను వ్యాకరణరీత్యా. అక్కడ ‘సం|హారమునకు...’ అంటే సరిపోతుంది కదా!
    రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘కోరుమయా బీజాక్షర’ అని ఉండాలనుకుంటాను.
    ‘రా’ గొనె నన్నారు. నీళ్ళుకాని, సోడాకాని కలుపని మద్యాన్ని కూడా ‘రా’ అనే అంటారు సుమా! (సరదాకి).

    రిప్లయితొలగించండి
  12. వారాశిని చిలుకంగనె
    ఘోరంబుగ బుట్టు బ్రహ్మ ఘోషము గనుచున్
    తీరుగ నాసాంతము మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై!!!

    రిప్లయితొలగించండి
  13. ఘోరవిషమ్మును తా మన
    సారా గొనె శివుడులోక సంరక్షణకై
    ధారుణి గల ప్రజలందరు,
    శౌరిదివౌకసులు మెచ్చ చండీ నాథున్

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    ‘బ్రహ్మఘోష’మనే విశేష పదప్రయోగంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదములు శంకరయ్యగారూ! సెల్ ఫోనులో టైపుచేయుటచేఁ గలిగెడి యగచాట్లివి! డిక్షనరీ యాప్షనుండుటవలన నేను టైపుచేసిన దొకటి, ప్రకటమైనదొకటి యుండుట..నేనుం జూచుకొనకయే ప్రచురించుట...ప్రమాదపతితములు. క్షంతవ్యుఁడను.

    మొదటి పూరణమున:మొదట "సంహారమునకు" ననుకొనినను, సమస్య పాదాంతమున గల "సంరక్షణకై" పద ప్రభావమున "సంహారముకై" యని టైపు చేసితిని. దోషముం గమనింపనైతిని.

    రెండవ పూరణమున: నిశ్చయముగ టైపాటు దోషమే దొరలినది.

    తమరుం జూపిన దోషములను నేనిట్లు సవరించుచుంటిని. పరిశీలింపఁగలరు.

    (1)
    పోరునఁ ద్రిపురాసుర సం
    హారమునకు విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
    తేరు గుణి శిఖుల నిడ, మన
    సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!

    (2)
    "కోరుమయా బీజాక్షర
    మేరీతిని యుక్తము మఱి హితకర" మనఁగన్
    గోరి మనః కర్మణ వచ
    సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!

    రిప్లయితొలగించండి
  16. కం:కూర్మంబయ్యెను శ్రీహరి
    పారావారము జిలుకగ పడతియు గరళం
    బున్ రాగా విషమును మన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    రిప్లయితొలగించండి
  17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పారావారము త్రవ్వుచు
    ఘోరమ్మగు గరళ మరసి గొనెదరెవరనన్
    రా రా! యని బిలచుచు మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై.

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారూ,
    సవరించిన మీ పూరణలు బాగున్నవి. సంతోషం!
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    ‘రలయో రభేదః’ అని ర-ల ప్రాసను కొందరు లాక్షణికులు చెప్పారనుకోండి. కాని సాధ్యమైనంతవరకు దానిని ప్రయోగించకుంటేనే మంచిది.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గరళం|బున్ రాగా...’ అన్నప్పుడు ప్రాస తప్పింది. ‘గరళం| బే రాగా...’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. క్షీరాబ్ధి మథనమున తొలి
    దారుణవిష ముద్భవించె ద్వంస మొనర్చన్
    దీరు౦డై గరళము మన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    రిప్లయితొలగించండి
  21. నారదుడనె పరమేష్ఠీ!
    నేరవె హాలాహలమ్ము నిప్పై కాల్చన్
    నేరేడు పండు గతి తెలు-
    సా? రా! గొనె శివుడు లోక సమ్రక్షణకై.

    ********

    నారాయణుడనె నో సుర-
    లారా భయమేలను గరళమనిన నాతో
    రారే లీలగ నటు చూ-
    సారా! గొనె శివుడు లోక సంరక్షణకై.

    రిప్లయితొలగించండి
  22. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    రెండవపూరణలో ‘చూసారా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించినా సమస్యాపూరణలో చమత్కారంకోసం స్వీకరిద్దాం!

    రిప్లయితొలగించండి
  23. ఘోరత పోఫల ముగభ
    గీరథు వెనుకన్ సురధుని కెరలుచు నురకన్
    తోరంబుగ నామెను శిర
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    రిప్లయితొలగించండి
  24. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. కోరితపము జేయగ?ఆ
    కోరికదీర్చంగనెంచి-కోమలి మనసున్
    జేరియు|పార్వతి నేమన
    సారాగొనె|శివుడు లోక సంరక్షణకై|

    రిప్లయితొలగించండి
  26. పారావారము బుట్టియు
    భారముగా లోకములను పరిమార్చ,విసం
    బే,రయము దాని తా మన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    చేరియు శంభుని గుడికిని
    వారిని లింగము పయినను,పడగా పోయన్
    నీరము నభిషేకము మన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    మారుని గాల్చియు పార్వతి
    నా,రూపు గనిన శివుడపుడందెను సతిగా
    వారా సురలు పొగడ మన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    భూరిగ తపమును జేసిన
    వారల కెల్లర వరముల భారీనిచ్చున్
    కోరిక తీర్చుచు తామన
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై

    రిప్లయితొలగించండి
  27. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    చివరిపూరణలో ‘భారిగ నిచ్చున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  28. ధారుణికెంతటి భాగ్యమొ!
    తారా పథమంటెడు రజతాచల సీమన్,
    భారత హిమశిఖరాగ్ర వ
    సారా గొనె శివుడు లోక సంరక్షణకై!

    రిప్లయితొలగించండి
  29. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
    కాని... ‘శిఖరాగ్ర వసారా’ అని సమాసం చేయడమే దోషం. ‘భారత హిమశిఖరంపు వ|సారా...’ అందామా?

    రిప్లయితొలగించండి
  30. గురుదేవులకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం :
    ధారుణి కెంతటి భాగ్యమొ!
    తారా పథమంటెడు రజతాచల సీమన్,
    భారత హిమశిఖరంపు వ
    సారాఁ గొనె శివుడు లోక సంరక్షణకై!

    జులై 15, 2015 10:29 [PM]

    రిప్లయితొలగించండి
  31. తీరుగ హలహల మిప్పుడు
    సారాగా మారి పోవ సంబరముంగన్
    తేరా నారద! యనుచున్
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. నారా వారి ఉభయమయ!
      హేరాళమ్ముగ జిలేబు లేరాలముగన్
      వారుణి ! నారద తే! మన
      సారా గొనె శివుడు లోకసంరక్షణకై !

      జిలేబి

      తొలగించండి


  32. ధారాళమ్ముగ సంద్రము
    నా రాక్షసులు సురులు మధనమ్మట జేయన్
    పారిన గరళమ్మును మన
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. ఔరా! సాగర మందున
    సారా వెడలంగ మెండు చంకలు కొడుచున్
    నోరును పూరా విప్పుచు
    సారా గొనె శివుడు లోకసంరక్షణకై:)

    సాగరము = hussain sagar
    శివుడు = 😊

    రిప్లయితొలగించండి