19, జులై 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1735 (రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్.

32 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. గురువు గారికీ నమస్కారముల తో సవరించిన పద్యము

      మహిలో కావలె పరమత
      సహనమనుచు బోధ సేసె సాహెబు లకు దా
      న్మహనీయుడు, ముందుగ నా
      రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

      తొలగించండి
  2. రహమాన్ తొల్లి దిలీపుడు
    వహించె హిందుత్వము మరి బాల్యంబందున్
    విహితమని తొలుత ఏ. ఆర్.
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్!!

    రిప్లయితొలగించండి
  3. అహరహములు శ్రమియించగ
    సహనము తోపేద రికము సాగించె నటన్
    బహుమానము లను పొందుచు
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమున్

    రిప్లయితొలగించండి
  4. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒక’ను ‘ఓ’ అనడం దోషమే. ‘సాహెబులకుఁ దా|న్మహనీయుడు...’ అందామా?
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఎ.ఆర్. రహమాన్ గా మతాంతీకరణ చెందిన దిలీప్ విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. సహనమ్మున రాత్రంతయు
    పహరా కాసియు ప్రధాన వలయాధిపుడై
    సహ రక్షక దళములతో
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్!

    రిప్లయితొలగించండి
  6. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గురుదేవులకు ధన్యవాదములు. రెండవపాద టైపాటు సవరణతో :

    సహనమ్మున రాత్రంతయు
    పహరా కాచియు ప్రధాన వలయాధిపుడై
    సహ రక్షక దళములతో
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్!

    రిప్లయితొలగించండి
  8. సహవిద్యార్థ్యగు రాముడు
    హహహాయని " కర " ముతోడ నట " పుష్ " జేయన్
    రహదారి ప్రక్క వాగున
    రహమాన్ చేసెనట "పుష్కర " స్నానమ్మున్.

    రిప్లయితొలగించండి
  9. అహమున యుపవాస మహిమ
    సహనపు రంజానుదీక్ష సాంత్వన పరుపన్
    గహనపు పాప నివారణ
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

    అహమున యుపవాసమ్మును
    రహమాన్ చేసెనట;పుష్కరస్నానమ్మున్
    సహ హిందువు జేసె నిచట
    మహి పాపవినాశనమ్ము మరిమరి కలుగన్

    రిప్లయితొలగించండి
  10. హనుమచ్ఛాస్త్రి ప్రయత్నం హర్షణీయమే గానీ విద్యార్ధి+అగు(యగు)విద్యార్ధ్యగు అవుతుందా...అని?

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి మిత్రులకు వందనములు !

    అహరహములు హిందువులే
    రహిగొల్పెడు నెయ్యులౌట , రామ రహీముల్
    విహరించెడి సుమనముతో
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్ !

    రిప్లయితొలగించండి
  13. సహయున్ గాలియు నీరము
    మహిలో జనులకు సమమను మమకారముతో
    సహచరితో గోదారిన్
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్!!!

    రిప్లయితొలగించండి
  14. అహరహము వెంటతిరుగుచు
    మహేశ్వరిని పెండ్లి యాడి మక్కువతోడ
    న్నిహపరముల మేలనుచును
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్

    రిప్లయితొలగించండి
  15. అబ్దుల్ రహీం ఖాన ఎ ఖాన్, అక్బర్ నవరత్నాలలో ఒకడు . తులసీదాసు మెప్పుపొందినవాడు, కృష్ణ భక్తుడు. తన కవితలను కృష్ణునికే అకితమిచ్చినవాడు. దానసీలి. దాని ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నానుA Muslim by birth, Rahim was also a devotee of Lord Krishna and wrote poetry dedicated to him.[8]

    Abdul Rahim was known for his strange manner of giving alms to the poor. He never looked at the person he was giving alms to, keeping his gaze downwards in all humility. When Tulsidas heard about Rahim's behviour when giving alms, he promptly wrote a couplet and sent it to Rahim:-

    "ऐसी देनी देंन ज्यूँ, कित सीखे हो सैन
    ज्यों ज्यों कर ऊंच्यो करो, त्यों त्यों निचे नैन"

    "Why give alms like this? Where did you learn that? Your hands are as high as your eyes are low"

    Realizing that Tulsidas was well aware of the reasons behind his actions, and was merely giving him an opportunity to say a few lines in reply, he wrote to Tulsidas saying:-

    "देनहार कोई और है, भेजत जो दिन रैन
    लोग भरम हम पर करे, तासो निचे नैन"

    "The Giver is someone else, giving day and night. But the world gives me the credit, so I lower my eyes.".

    దీనికి ఇది వేదిక సందర్భం కాదు. మీ వలనక ఒక మంచి కవిని ఆయన కవితలను గుర్తుచేసుకున్నాము. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణలు

    అహరహము మిత్రులౌటను
    రహమానే రవిని కలిసి "రమ్ జాను"న తా
    నహహా గోదావరియనె
    రహమాన్ చేసెనట, పుష్కరస్నానమ్మున్.

    మహిమగల సాధు పుంగవు
    సహచరుడౌ ముస్లిమొకడు సంతోషముతో
    నహమును విడి మునిగె నదిని
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘పుష్-కర’ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విద్యార్థి+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘సహవిద్యార్థియు రాముడు’ అనండి.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘అహమున నుపవాస...’ అనండి.
    *****
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బహుకాలానికి బ్లాగుమీద మీ కరుణాకటాక్షాన్ని ప్రసరింపజేశారు. సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రమణ గారూ,
    ధన్యవాదాలు. రహీమ్ ఖాన్‍ఖానా దోహాలు మాకు హైస్కూల్‍లో పాఠ్యాంశాలుగా ఉండేవి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    పద్యాన్ని సవరించినందుకు సంతోషం!
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అహరహ నేమము మీరగ
    మహితుడు నౌచును,జలమది మాన్యమునౌటన్
    రహిగనె రంజాను తిధిని
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్

    రహమానైనను తపమున
    మహితుండౌ రాముడైన మానవులగుగా
    మహితంబౌ గోదారిని
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్

    మహితము గోదారి నదిని
    నహితంబులు పోవుననుచు,నమ్ముచునొకటన్
    బహిరంతర శౌచముగన
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్

    రహమాన్,రాముడు,మిత్రులు
    రహిగన రంజాను నందు,రాముడు నక్తాల్,
    మహితౌ గోదావరిలో
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్

    రిప్లయితొలగించండి
  19. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    మహి హిందువైనఁ గృష్ణయ
    మహితుం డల్లాకుఁ జేసె మాన్య నమాౙున్!
    సహనము మతమునఁ ౙూపుౘు
    రహమాన్ జేసెనఁట పుష్కర స్నానమ్మున్!!

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ‘నేమము’ తద్భవం కదా! ‘అహరహనియమము...’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. భహుమతులందిన డ్రైవర్
    మొహమాటము లేకగలువ?ముస్లీమయినా
    బహుదూరపు పయనమునన్
    రహమాన్ చేసెనట పుష్కర స్నానమ్మున్|
    2.సహనపు వాహనచోదక
    రహమాన్| చేసెనట పుష్కర స్నానమ్మున్
    బహుజన కోరికమేరకు
    సహవాసులమోజునింప సంతోషముతో.

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. దోషమును సూచించిన మూర్తి గారికి...సవరణ చూపిన మాస్టరు గారికి ధన్యవాదములు...
    సవరణతో....

    సహవిద్యార్థియు రాముడు
    హహహాయని " కర " ముతోడ నట " పుష్ " జేయన్
    రహదారి ప్రక్క వాగున
    రహమాన్ చేసెనట "పుష్కర " స్నానమ్మున్.

    రిప్లయితొలగించండి
  24. సహనమ్మును కోల్పోవక
    కుహనామతతత్వవాద గోలను వినగా సహియించక ముస్లిము యౌ
    రహమాన్ స్నానమ్ము పుష్కరమ్మునజేసెన్

    రిప్లయితొలగించండి
  25. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వాదగోలను’ అన్నది దుష్టసమాసం. ‘మతతత్త్వవాది గోలను’ అనండి.
    సమస్యలో పదాలను ముందు వెనుకలు చేశారు.

    రిప్లయితొలగించండి
  26. గురుదేవులుశంకరయ్యగారి సూచన మేరకు సవరించిన పద్యము

    సహనమ్మును కోల్పోవక
    కుహనామతతత్వవాది గోలను వినగా సహియించక ముస్లిము యౌ
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

    రిప్లయితొలగించండి
  27. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సవరించినందుకు సంతోషం!
    నేను గమనించని మరొక లోపం... ‘ముస్లిము+ఔ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘ముస్లి మయిన’ అనండి.

    రిప్లయితొలగించండి

  28. గురుదేవులకు ధన్యవాదములు మరల సవరించిన పద్యము
    సహనమ్మును కోల్పోవక
    కుహనామతతత్వవాది గోలను వినగా సహియించక ముస్లిమయిన
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

    రిప్లయితొలగించండి
  29. కుహుకుహు కోయిల కూయగ
    సహచరు లెల్లరును జూచి సాహో! యనగా
    వహ! చీరతో వహీదా
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

    రిప్లయితొలగించండి
  30. సహిగా రోజులు మారగ
    తహతహతో దారితప్పి తర్పణములతో
    వహవా యనుచును వహిదా
    రహమాన్ చేసెనట పుష్కరస్నానమ్మున్

    రిప్లయితొలగించండి