21, జులై 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1737 (సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము. 

23 కామెంట్‌లు:

  1. శాంతితో బ్రతుకవలెను సర్వులనుచు
    సాధువులు గోరుచుంద్రు - సంసార సుఖము
    వదలి దేశమంత తిరిగి భక్తులకును
    బోధనమ్ములతో మంచి బుద్ధినిచ్చు

    రిప్లయితొలగించండి
  2. వలువ కాషాయమేగట్టి వసుధ యందు
    ఆశ్రమాలను నెలకొల్పి యందులోన
    అమర సుఖముల బడిసేటి యల్పులైన
    సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము.

    రిప్లయితొలగించండి
  3. వేష మేయగ సన్యాసి భేష జముగ
    పూజ లందుచు ప్రజలకు మోజు పెంచి
    ధనము కూడిన పిమ్మట తరలి పోవు
    సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘..బడిసేటి’ని ‘...బడసెడు’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మేనకా రమ్ము ప్రేయసీ మెచ్చినాడ
    నిన్ను లభియింప సుందరి నిన్ను బోలు
    వదలి వైరాగ్య మెంతటి వారలైన
    సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సర్వ సంసార గతికి సంసార గతులు
    కాంక్షితము గాన తాము నిష్కాములయ్యు
    మాతృ పితౄణ బద్ధులౌ మానవులకు
    సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము

    రిప్లయితొలగించండి
  8. సకల బంధములను వీడి జనుల సేమ
    మరసి హితబోధ చేయుచు మంచి నెపుడు
    సాధువులు గోరుచుంద్రు;సంసార సుఖము
    వీడి దేశాలు తిరుగుట వెఱ్ఱి గాదె

    రిప్లయితొలగించండి
  9. విజయకుమార్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సతి సుభద్ర నందగఁ గ్రీడి సాధువాయె!
    తారకా సురవధ శూలి తపము మాన్పె
    స్వప్రయోజనమున, సృష్టి సంత సించ
    సాధువులుఁ గోరుచుంద్రు సంసార సుఖము

    రిప్లయితొలగించండి
  11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వీడి సంసార బంధముల్ జూడవిధిని
    సాధువులు గోరుచుంద్రు; సంసారసుఖము.
    త్యాగమొనరించి సతతము సాగు వారు
    పరమ భక్తిని చేతు రుపాసనలను

    నిన్నటి సమస్యకు పూరణ

    కౌరవులు పాండవులు సల్పు కయ్యమందు
    కోర సాయము పార్ధుడు, తేరు నడుప
    మాధవుఁడు సారథి యయె; సుయోధనునకు
    తనదు సైన్యము వంతుగా దక్కజేసే

    రిప్లయితొలగించండి
  13. సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము
    కన్న మిన్న యైనట్టిమోక్షమ్ము నొంది
    జననమరణాల చక్రభ్రమణము లేక
    శివుని సామీప్య మందుచు సేవజేయ

    రిప్లయితొలగించండి




  14. ధర్మ పథమున పయనించి ధరణి జనులు
    ముక్తి గోరంగ వలెనంచు ముదము తోడ
    సాధువులు గోరు చుంద్రు, సంసార సుఖము
    వీడి, లోక కళ్యాణ మే వీరి కాంక్ష.

    రిప్లయితొలగించండి




  15. ధర్మ పథమున పయనించి ధరణి జనులు
    ముక్తి గోరంగ వలెనంచు ముదము తోడ
    సాధువులు గోరు చుంద్రు, సంసార సుఖము
    వీడి, లోక కళ్యాణ మే వీరి కాంక్ష.

    రిప్లయితొలగించండి
  16. భక్తి పేరున జనులను భంగపరచి
    మూఢ భోధలు జేయుచు ముంచునట్టి
    కొంగ జపమును జేయుచు దొంగలైన
    సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము!!!

    రిప్లయితొలగించండి
  17. మోసమెరిగిన తంత్రాలమెరుపునందు
    మూడ నమ్మకమందున ముంచ గలిగి
    వస్త్ర ధారణయున్నట్టి వన్నెగిలులు
    సాధువులు గోరు చుంద్రుసంసారసుఖము
    2.స్వార్థ పరు లైన కొందరు సలుపు పనులు
    మోస పాశానభక్తిచే ముంచువారె
    వ్యసన పరులయ్యు తాంత్రిక పసరు చేత
    సాధువులు గోరు చుంద్రు సంసార సుఖము|

    రిప్లయితొలగించండి
  18. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. దార పెట్టెడు బాధల తాళలేక
    మారు మార్గము కనలేక మాఱినట్టి
    సాధువులు కోరుచుంద్రు సంసార సుఖము
    తనకునచ్చిన పడతుక తారసపడ

    రిప్లయితొలగించండి
  20. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి