24, జులై 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1740 (వరుని జూచినంత భయము గలిగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వరుని జూచినంత భయము గలిగె.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. కారునలుపు రంగు ఖల్వాటుడే వాడు
    పిల్లగజము రీతి పెద్ద దేహి
    పక్షిగూడు వంటి బవిరిగడ్డమ్ముతో
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హఠాత్తుగా చూచిన వధువునకు :

    01)
    _____________________________

    చట్టి ముక్కు వాని - చలువసులోచను
    నెత్తు పల్ల వాని, - జుత్తు లేని
    వాని ,చిన్ని కనుల - వాని, నెదుట నున్న
    వరుని జూచినంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు =పెండ్లికొడుకు;మగఁడు;ఱేఁడు;శ్రేష్ఠుఁడు
    పల్లు = దంతము.

    రిప్లయితొలగించండి
  3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. త్రాగి తన్నే మగణ్ణి చూస్తే :

    02)
    _____________________________

    త్రాగి వచ్చి రోజు - తన్నుచుండెడివాని
    చిట్టి వారి గూడ - గొట్టువాని
    సొమ్ము లాగు కొనుచు - సురభి ద్రాగుచు నున్న
    వరుని జూచినంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు = మగఁడు

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మంగమ్మశపథం సినిమాలోలా
    ఎంత అందగాడైనా
    దుష్టుడైన రాజును చూస్తే :

    03)
    _____________________________

    పువ్వుబోడి జూచి - భోగింపగా నెంచి
    కోట కెత్తు కెళ్లి - క్రూరమైన
    ఘోరములను జేయు - క్రూరదృ క్కైనట్టి
    వరుని జూచినంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు =ఱేఁడు
    క్రూరదృక్కు = దుష్టుడు

    రిప్లయితొలగించండి
  7. మంచి వాడ తడని మనువాడితినినేను
    మోస మాయె నాకు మొదటి రోజె
    తప్ప త్రాగి వచ్చె తబడు చింటికి, నాకు
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  8. మంచి వాడ తడని మనువాడితినినేను
    మోస మాయె నాకు మొదటి రోజె
    తప్ప త్రాగి వచ్చెతడబడుచును నాకు
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  9. మంచిమగణ్ణి చూచి ఎవరైనా భయపడతారా ???
    ఏదో తప్పు చేస్తేనే గదూ భయం

    04)
    _____________________________

    జాలి దయయు గలిగి - యాలిని ప్రేమించి
    పిన్న పెద్ద లందు - బేరు గలిగి
    బిడ్డ లన్న దొడ్డ - ప్రీతి నుండగ; నేల
    వరుని జూచినంత - భయము గలిగె ?
    _____________________________
    వరుఁడు =శ్రేష్ఠుఁడు

    రిప్లయితొలగించండి
  10. పెద్దపెద్ద వలలు,పిల్ల గడ్డంబుతో
    చేతకర్రతోడ నూత గొనుచు
    నీటి జాడ జూచి నిలువెల్ల వెదకు"ధీ
    వరు"ని జూచి నంత భయము కలిగె

    ధీవరుడు=జాలరి వాడు

    రిప్లయితొలగించండి
  11. తగినన్ని కట్న కానుక లివ్వలేమేమో నని భయం :

    05)
    _____________________________

    ఆస్తి, నందము గని - యానంద మొందిరి
    వరుని జూచి ! నంత - భయము గలిగె
    కట్న కానుకలను - పట్నవాసులు హెచ్చు
    కోరు కొందురనుచు - ఖేదమునను !
    _____________________________
    వరుఁడు =పెండ్లికొడుకు

    రిప్లయితొలగించండి
  12. కాల్చగానె తోక కాలుని వలె మారి
    వాలమంత బెంచి వాయుసుతుడు
    లంక నెల్ల గాల్చ రక్కసులకు కపి
    వరుని జూచినంత భయము గలిగె !!!

    రిప్లయితొలగించండి
  13. దుర్మార్గుడు ఆ పై గర్విష్ఠి-ఎదురు పడితే భయమే గదూ

    06)
    _____________________________

    పెద్ద లన్న లేదు - ప్రేమ యించుక నైన
    కొట్టు చుండు నెపుడు - చిట్టి వారి
    నాడు వారి నెపుడు - నగడుచు నుండు,కా
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    అగడు = తిట్టు
    కావరుఁడు = కావరము గలవాఁడు, గర్వి.

    రిప్లయితొలగించండి
  14. అశోకవనిలో ఆంజనేయుని గనిన రాక్షసులకు
    సహజము గదా - ముందాశ్చర్యము - ఆ పై భయం :

    07)
    _____________________________

    ఎర్రనైన కనులు - నెత్తైన కాయంబు
    దీర్ఘబాహుడైన - దివ్యరూపు
    వనము నందున గని - బమ్మరపడి, కపి
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    బమ్మరపడు = ఆశ్చర్యపడు

    రిప్లయితొలగించండి
  15. అగ్ని ప్రత్యక్షం కాగానే - భయపడిన ,వరూధిని స్వగతము :

    08)
    _____________________________

    అగ్ని సాయ మొంది - యంతర్హితుడగు, ప్ర
    వరుని జూచి నంత - భయము గలిగె !
    ఇంత సేపు యితని - నేన ? వేధించితి
    పాపి నైతి వీని - బాధ పెట్టి !
    _____________________________
    ప్రవరుఁడు = అరుణాస్పదమందు ఉండిన ఒక విప్రుఁడు.

    రిప్లయితొలగించండి
  16. బ్రహ్మాస్త్రబంధనములను
    చేదించిన కపిశ్రేష్ఠుని గాంచిన రావణునకు :

    09)
    _____________________________

    పరుల తరమె యిటుల - బ్రహ్మాస్త్ర బద్దుడై
    మధుర రామ నామ - స్మరణ జేసి
    నాగ పాశ బంధ- నములను చేధించ
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు = కపివరుడు

    రిప్లయితొలగించండి
  17. వసంత కిశోర్ గారూ,
    మొదటినుంచీ మీకున్న అలవాటే కదా! అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి! ఈరోజు మీ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మీ తొమ్మిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవపూరణలో ‘క్రూరదృక్కగు నర|వరుని...’, తొమ్మిదవ పూరణలో ‘బంధనచ్ఛేదకుడు కపి|వరుని...’ అంటే బాగుంటుందేమో!
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తబడుచు’..? ‘తడబడుచు+ఇంటికి’ అన్నప్పుడు సంధి లేదు. ‘తడబడుచు నింటికి’ అవుతుంది. అక్కడ ‘తడబడు నడకల| వరుని...’ అందామా?
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అశోకవనిలో - అక్షకుమారుడు :

    10)
    _____________________________

    దీర్ఘ దేహుడగుచు - దీపించి భీముడై
    వాయు వేగమునను - పైకి దూక
    నక్షకుమారు నకును - యరపును, వనచర
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    వనచరవరుఁడు = కపివరుడు

    రిప్లయితొలగించండి
  19. శంకరార్య ! చక్కనైన సవరణలకు ధన్యవాదములు !

    మంగమ్మశపథం సినిమాలోలా
    ఎంత అందగాడైనా
    దుష్టుడైన రాజును చూస్తే :

    *****

    03అ)
    _____________________________

    పువ్వుబోడి జూచి - భోగింపగా నెంచి
    కోట కెత్తు కెళ్లి - క్రూరమైన
    ఘోరములను జేయు - క్రూరదృక్కగు నర
    వరుని జూచినంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు =ఱేఁడు
    క్రూరదృక్కు = దుష్టుడు

    *****
    బ్రహ్మాస్త్రబంధనములను
    చేదించిన కపిశ్రేష్ఠుని గాంచిన రావణునకు :

    9అ)
    _____________________________

    పరుల తరమె యిటుల - బ్రహ్మాస్త్ర బద్దుడై
    మధుర రామ నామ - స్మరణ జేసి
    నాగ పాశ బంధ - నచ్ఛేదకుడు కపి
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    వరుఁడు = కపివరుడు

    రిప్లయితొలగించండి
  20. వసంత కిశోర్ గారూ,
    నా సవరణలను సౌహార్దంతో స్వీకరించినందుకు ధన్యవాదాలు.
    మీ దశమపూరణ బాగున్నా ‘అక్షకుమారునకును’ అన్నచోట గణభంగ మయింది. సవరణ సూచించలేకపోతున్నాను. ‘అసురతనయునకును’ అంటే ఎలా ఉంటుంది? అక్షకుమారుడు రావణుని పుత్రుడే కదా!

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యులకు మరియొక మారు ధన్యవాదములతో
    అశోకవనిలో - అక్షకుమారుడు :

    10అ)
    _____________________________

    దీర్ఘ దేహుడగుచు - దీపించి భీముడై
    వాయు వేగమునను - పైకి దూక
    నసుర తనయు నకును - యరపును, వనచర
    వరుని జూచి నంత - భయము గలిగె !
    _____________________________
    వనచరవరుఁడు = కపివరుడు

    రిప్లయితొలగించండి
  22. చేత వింటి బట్టి చేసె ఠంకారమ్ము
    నిపుడె వార్థిఁ కోల నింక జేతు
    ననుచు సాగరునకు నయ్యెడ జానకీ
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  23. భిక్ష గొనిన యతిని వీక్షించె జానకి
    పదితలలిరువదియు బాహువు లను
    సరస జేరి తనను చెర బట్టు దైతేయ
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  24. వరుని జూచి నంత భయము గలిగె*
    ఆ.వె:కాలి నడక తోడ కానలో వేగాన
    శ్రీహరిని దలచుచు చేడి యొకతె
    యరుగు చుండ నచట యగపడిన యసుర
    వరుని జూచి నంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  25. భూత నాధుఁ నెంచి బూడిదాయెను నాడు!
    భగ్గు మనగ భవుని యగ్గి కన్ను!!
    నిజము దెలిసిన రతి నిశ్చేష్టయౌచు శ
    ర్వరుని జూచి నంత భయము గలిగె!

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. విందు ముందుజరుపుమనుచు విషయ మేమి దేల్పకే
    అందరందు కట్నమడిగి-ఆడపిల్ల లాంచనాల్
    ముందు నివ్వకున్న తాళి ముట్టనన్నపెళ్లిలో
    అందగాడె”వరుని జూచినంత భయముగలిగెగా|”
    2.పెళ్లి చూపు లైన?పెద్దల కోర్కెచే
    ఒప్పుకున్న మాట చెప్పబోక
    ఊరినుండి బదులునుత్తర మివ్వుక
    వరుని జూచినంత భయము గలిగె|

    రిప్లయితొలగించండి
  28. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. కారు నలుపు కలిగి కాకి గొం తుక తోడ
    బిగ్గ రగను నఱచు పిల్లి కండ్ల
    వరుని జూచి నంత భయము క లిగెనట
    వధువు రాధ కపుడు వనిత లార !

    రిప్లయితొలగించండి
  30. అగ్గితోడ లంక బుగ్గిసలుపు కపి
    వరునిఁ జూసినంత భయము గల్గె
    లంకలో వసించు రక్కసి మూకకు
    పరుగులిడిరి వేగ ప్రభువు కడకు

    రిప్లయితొలగించండి
  31. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    1) లోన చెడ్డి జూపు లోవైస్టు ప్యాంటుతో
    బట్టతలను టోపీ,పొట్టి షర్టు ,
    చేతిలోన సెల్లు ,చెవిలోని తీగతో
    వరుని జూచినంత భయము గలిగె.
    2 )వంగ పండు రంగు బారెడు గడ్డము ,
    గుండు ,కుండలములు ,కోతి మూతి
    మెల్లకన్ను,కుంటి ,మిలియన్ల కధిపతి !
    వరుని జూచినంత భయము గలిగె.

    రిప్లయితొలగించండి
  32. ఆ వరూధినియును నా గిరి బాపని
    తాను వలపు చేష్ట,ధర్మముడిగి
    కోర,-నతడునగ్ని కొలిచియు,వేడు,ప్ర
    వరుని జూచి నంత భయము గలిగె

    ఉత్తరుండు తానునొప్పెడు దర్పాన
    "కౌరవాళినొంతు ఘనము"ననుచు
    పలికె,నచట సేన భరమైన కౌరవ
    వరుని జూచి నంత భయము గలిగె

    పద్మమందు వీర పార్ధుని సుతుడు తా
    ఘనులు కౌరవాళి గాయపరచి
    కొట్ట,కౌరవుండు కుందుచు,నా వీర
    వరుని జూచి నంత భయము గలిగె

    రాయబారి కృష్ణు రయమున గట్టగా
    కౌరవుండు తలచె ఘనపు విశ్వ
    రూప మదియ గాంచి,రోచిష్మతుడు,యదు
    వరుని జూచి నంత భయము గలిగె

    రిప్లయితొలగించండి
  33. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. కొత్తపెత్తనంబు చిత్తంబు జేరదు
    చిత్తమందు కోర్కె చిగురు దొడగ?
    ఇంటికోడలలుసు వెంటాడుఅత్త ఫ
    వరుని జూచినంత భయముగలిగె|

    రిప్లయితొలగించండి
  35. కె. ఈశ్వరప్ప గారూ,
    ‘అత్త పవరు’తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని... ‘పవరును జూచి’ అనాలి కదా!

    రిప్లయితొలగించండి
  36. చక్కని పూరణలు చేసిన కవివరులందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి