25, జులై 2015, శనివారం

సమస్యాపూరణ - 1741 (వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్.

33 కామెంట్‌లు:

  1. జనవాసంబుల పేరుతో ప్రభుత సౌజన్యమ్ముతో మానవుల్
    కనలేకుండిరి దుష్టులై దురిత దుష్కార్యమ్ములన్ జేయుచున్
    వనమే మానవ జాతి యున్నతికి సర్వ శ్రేష్ఠ మూలం బగున్
    న్ననువాక్యంబును మర్చిరే యిట మహారణ్యమ్ములన్ ద్రుంచుచున్ .

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    గాలికీ, తిండికీ ,సేదదీరడానికీ , ఆధార భూతములైనవి వనములే గదా :

    01)
    _________________________________________

    వనముల్ గాదొకొ గాలినిచ్చునవి , యీ - ప్రాణంబు నిల్వ న్నిటన్ !
    వనముల్ గాదొకొ తిండి నిచ్చునవి , యా - స్వాదించ నిత్యం బిటన్ !
    వనముల్ గాదొకొ శైత్య మిచ్చునవి, యా - శ్వాసించ నిత్యం బిటన్ !
    వనమే మానవజాతి యున్నతికి స - ర్వశ్రేష్ఠమూలం బగున్ !
    _________________________________________
    ఆస్వాదించు = రుచి చూచు, తిను
    శైత్యము = చల్లదనము
    ఆశ్వాసించు = ఊఱడించు(తాపము తగ్గించి), సేదదీర్చు

    రిప్లయితొలగించండి
  3. గాలికీ, తిండికీ ,సేదదీరడానికీ , ఆధార భూతములైనవి వనములే గదా :

    01అ)
    _________________________________________

    వనముల్ గాదొకొ గాలినిచ్చునవి , ని - శ్వాసంబు నుచ్ఛ్వాసకున్ !
    వనముల్ గాదొకొ తిండి నిచ్చునవి , యా - స్వాదించ నిత్యం బిటన్ !
    వనముల్ గాదొకొ శైత్య మిచ్చునవి, యా - శ్వాసించ నిత్యం బిటన్ !
    వనమే మానవజాతి యున్నతికి స - ర్వశ్రేష్ఠమూలం బగున్ !
    _________________________________________
    నిశ్వాసము = ఊపిరి విడచుట
    ఉచ్ఛ్వాస = ఊపిరి పీల్చుట
    ఆస్వాదించు = రుచి చూచు, తిను
    శైత్యము = చల్లదనము
    ఆశ్వాసించు = ఊఱడించు(తాపము తగ్గించి), సేదదీర్చు

    రిప్లయితొలగించండి
  4. కనగా బాల్యము నాటపాటల బలేగా పూర్తియైపోవు,నె
    మ్మనమున్భావములంకురింపగను కౌమారంబు నాపైనహో!
    ధనసంపాదన దారసంగ్రహణ సద్వ్యాపారముల్ సేయ, యౌ
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలంబగున్.

    రిప్లయితొలగించండి
  5. ఘనమౌ మ్రానులు వృక్షముల్ గలుగు కీకారణ్యముల్ గూర్చు జీ
    వనముల్; ప్రాణులకెల్ల రక్షనిడు, నావాసమ్ముగా నిల్చు, వా
    న' నిలన్' బ్రోవుమటంచు కొమ్మ కర విన్యాసమ్ములన్ పిల్చుచున్,
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్.

    రిప్లయితొలగించండి
  6. వనిలో నేన్ గులు లేళ్ళు వానరములున్ బఱ్ఱెల్ మరే జంతులన్
    గన జీవించును గుంపుగా సతతమున్ కాపాడుకొం చన్యులన్
    జను లారీతిని వీడి స్పర్థలను మించన్ ధాత్రి మేల్ సంఘజీ-
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్.

    రిప్లయితొలగించండి
  7. వినరాసోదర తుల్యుడా! విపులమౌ విజ్ఞానసంపూజ్యుడా!
    ధనమై యింధనమై నవోన్నతికి సంధానమ్ముయైనొప్పెడిన్
    వనముల్ ద్రుంచకు నెప్పుడు సకల సంప్రాప్తమ్ములందించు నా
    వనమే మానవ జాతియున్నతికి సర్వ శ్రేష్ఠ మూలంబగున్

    రిప్లయితొలగించండి
  8. అనుమానంబికలేదు జీవనము నాహ్లాదాన సాగించగా
    వనమే మానవజాతి నున్నతికి ,సర్వ-శ్రేష్ట మూలంబుకున్
    ధనమున్నింపగ,తిండితీర్థముల సంధానమ్ము,సౌఖ్యంబుకున్
    ఘనమౌ చేట్లిల బెంచబూనుటకు సంకల్పంబు జేకూర్చుమా.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. వనమే క్షోణితనంబుఫైన సకల ప్రాణుల్ వసింపంగ?జీ
    వనభూతంబగు గాదె?యావనదముల్వర్షింప ముఖ్యంబుగన్
    వనముల్గావలె గాన కాననములన్ ఖండింపకో మిత్రమా
    వానమేమానవజాతియున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్.
    శ్రీకే.యస్ గురుమూర్తి గారి పూరణం

    రిప్లయితొలగించండి
  12. మునిజాలమ్ములు చెప్పినట్లుగ సతమ్మున్ సాత్వికంబైన జీ
    వనమే మానవ జాతియున్నతికి సర్వ శ్రేష్ట మూలంబగున్
    ఘనమౌ పూర్వపు పద్ధతుల్ విడిచి స్వాస్థ్యమ్మున్ గొనన్ ప్రీతితో
    ధనమున్ గ్రోలుచు నుండ్రిమానవులు సత్సంఘమ్ము పోద్రోలుచున్

    రిప్లయితొలగించండి
  13. రణముల్ చేయగ నాశమే మిగిలె గర్వాంధుల్ స్వలాభమ్మునన్
    గనమే త్రేతయు, ద్వాపరన్ గలిని సంగ్రామమ్ములేమాయెనో
    తనవారంచును లోకమంతటిని సందర్శంచెడేకంపు భా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్.

    రిప్లయితొలగించండి
  14. వనముల్ బెంచిన భూమికంతటికి తా వర్షంబిడున్ మేఘముల్
    వనమే జీవన సారమెంచగను తా వాగుల్ వెలుంగొందుగా
    జనమే తిండిని,నీటి,గాలి గనగా సాద్యంబు తా చెట్లచే
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్

    వనముల్ చోటగు తాపసోత్తములు తా పర్వంగ విజ్ఞానులై
    వనముల్ చోటగు పక్షి,జంతుతతికావాసంబు నౌనింపుగా
    వనమే మూలము నీటినిచ్చుటకు,వే పంటల్ తగన్ గూర్పగా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్

    వినుతింజెందిన వర్షధారలవి,తా వెల్గొందగా వాహినై
    వనమాధారము,దప్పితీర్పగను వే పంటందగా జీవులున్
    వనముల్ బెంచిన వానలే కురిసి వే భాగ్యంబునే గూర్పవే
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్

    మనగాజీవులు భూమియందునను,తామందించుగా వృక్షముల్
    వనులన్ గూల్చుచు మూర్ఖులై జనము తా వర్షంబులే పొందకన్
    వినుతింపందగు నీడలేకయటు తావేడెక్కు భూగోళమే
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్టమూలంబగున్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    1) వినమే గాధల పాండవాన్వయులహో ! వీడున్ న్విడన్ జూడమే
    గనమే చిత్రము లందు కైకకయి తా కానం బడన్ రాముడే
    ఘనమౌ భుక్తిని గూర్చెనా వనములే కాంతారవాసమ్మునన్
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్.
    2) జన బాహుళ్యము పత్ర పుష్ప ఫలముల్ సంప్రాప్త మై శోభిలన్
    తను గుప్పించును ప్రాణ వాయువుల నీ ధాత్రిన్ తరుల్ బెంచుచున్
    వన మాధారము వర్ష సంపద కు సర్వం బంచునున్ జాటగా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్.

    రిప్లయితొలగించండి
  16. అనఘా !సృష్టికి పంచభూతములనన్ అంభోరుహాక్షుండు తా
    వనజాతాసనున కిచ్చె.సత్పథ మిడెన్ వర్షమ్ములన్ శుద్ధమౌ
    వనమందున్ బడబాగ్ని,వాయువులు,సర్వప్రాణులన్ బ్రోవగా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠ మూలంబగున్
    2.వనముల్లేకను యల్లలాడుదురుగదా ప్రాణమ్ములున్ నిల్వగా
    వనమే మూలము శక్తి నిచ్చుటకు దీపమ్ముల్ వెలు౦గొ౦దగా
    వినమే మూలము ముక్తి క౦చు జలముల్ వేదమ్ము సూక్తించగా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠ మూలంబగున్

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కృతులు.
    జ్వరతీవ్రత పెరిగింది. మందులు వాడుతున్నా నయం కావడం లేదు. ఈరోజంతా మీ పూరణలను చూడలేకపోయాను. అసలే చాలారోజుల తర్వాత ఈరోజు వృత్తసమస్య నిచ్చాను. జాత్యుపజాతుల్లో సవరణ సూచించడం సులభమే కాని వృత్తాలలో దోషాలకు సవరణలు సూచించాలంటే ఇబ్బందే! కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇప్పుడే బ్లాగు తెరిచాను.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘అగున్+అను...’ అన్నప్పుడు కొందరు పూర్వకవుల ప్రయోగాల ప్రకారం ‘అగు న్నను..’ అనవచ్చు. కాని సాధ్యమైనంతవరకు అటువంటి స్థితి రాకుండా చూసుకుంటే మంచిది.
    రెండవ పూరణలో ‘సంధానమ్మునై యొప్పెడిన్’ ‘ద్రుంచకు మెప్పుడున్’ అనండి.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    దువ్వూరి రామమూర్త్రి గారూ,
    ‘యౌవనమే శ్రేష్ఠ’మన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ‘సంఘజీవనపు’ పూరణ బాగున్నది. అభినందనలు.
    అన్నట్టు... మీకు వనిలో అన్నీ సాధుజంతువులే కనిపించాయి. క్రూరజంతువులన్నీ రాజకీయనాయకుల, గూండాల రూపాలతో జనారణ్యంలో చేరినట్టున్నాయి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కొన్ని చిన్న చిన్న లోపాలున్నాయనుకోండి! పరవాలేదు...
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. వృత్తరచనలోనూ మీ చేయి తిరుగుతున్నది. సంతోషం! అభినందనలు.
    మూడవ పాదంలో యతిదోషం. ‘ఘనమౌ పూర్వపు పద్ధతుల్ విడిచి పొందన్ స్వాస్థ్యమున్ ప్రీతితో’ అనండి. పూర్వపాదం చివర ‘మూలం బగున్’ అని ఉంది కనుక ‘మూలం బగు| *న్ఘనమౌ పూర్వపు...పొం*దన్....’ (న-ంద) యతి సరిపోతుంది.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ సాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో సంధి, గణ దోషాలు..ప్రస్తుతం సవరణలు సూచించలేను (జ్వరం కదా!). బడబాగ్ని సముద్రంలో ఉంటుంది. అడవిలో ఉండేది దావాగ్ని. (వన మంటే నీరు అని కూడా అర్థం. ఆ లెక్కన దోషం కాదనుకోండి!)

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారూ,
    పద్యాన్ని ఎందుకు తొలగించారు?

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు నమస్సులు! పద్యం సరిగా వ్రాయలేదనిపించి తొలగించాను. మీ సమీక్ష చూసి మరల పోస్టు చేస్తున్నాను.

    మన పూర్వీకులు సృష్టిచేసి కడుసన్మానంబుతో నైక్యతన్
    మనుటెట్లో తెలియంగజేయు విలువల్ మర్యాద పాటించుచున్
    ఘన సంస్కార సుసంప్రదాయముల యుక్తంబౌ సమూహంపు జీ
    వనమే మానవ జాతియున్నతికి సర్వ శ్రేష్ఠ మూలంబగున్ !

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ధన్యవాదములు మరియు ప్రణామములు. తమరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను.

    రిప్లయితొలగించండి
  22. ఒక పేస్టు కంపనీ అడ్వర్ టైజ్మెంటు...


    వనమున్ దెచ్చిన గొప్ప మూలికలనే వాడేము మా పేస్టులో
    ఘనమౌ పేరును గల్గినాము ధరలో కంటే ధరల్ తగ్గెగా
    దినమున్ మొత్తము హాయినిచ్చు కడుగన్ తెల్లారగా దంత ధా
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలంబగున్.

    రిప్లయితొలగించండి
  23. గురువు గారికి ప్రణామములు మీకు జ్వరమని తెలిసి బాధకలిగింది.
    సాధ్యమైనంత త్వరగా మీ ఆరోగ్యం మెరుగవాలని కోరుకుంటున్నానండి
    మందులు సరిగా వాడుకొండి. మీకు చెప్పాల్సినంత వాన్ని కాకపొయినా చెబుతున్నందుకు మన్నించండి..... ఆరొగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

    రిప్లయితొలగించండి
  24. గురువు గారికి ప్రణామములు మీకు జ్వరమని తెలిసి బాధకలిగింది.
    సాధ్యమైనంత త్వరగా మీ ఆరోగ్యం మెరుగవాలని కోరుకుంటున్నానండి
    మందులు సరిగా వాడుకొండి. మీకు చెప్పాల్సినంత వాన్ని కాకపొయినా చెబుతున్నందుకు మన్నించండి..... ఆరొగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

    రిప్లయితొలగించండి
  25. వనమే మానవ జాతి యున్నతికి సర్వ శ్రేష్ఠ మూ లంబగు
    న్ననగా సత్యము ,సందియంబునకు నీయంగా సమాధానము
    న్వినగా నోపను నార్యులార ! యిక మీ విజ్ఞాప నాలా పము
    న్వినిపించంగను యత్నముం, మాపేట న్గనం గా వలెన్

    రిప్లయితొలగించండి
  26. IIT Kharagpur 1965:

    కనరా లేరుగ చిత్రముల్ వడిగ చీకాకుల్ తొలంగించగా
    తినరా లేరుగ దోసెలున్ వడలు ప్రీతిన్ జిహ్వ లాలింపగా
    వినరా లేరుగ వీణలున్ హృదిని దీపించంగ...నాహా...తపో
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్

    రిప్లయితొలగించండి
  27. కనుమా! రాక్షస బృందమున్ విరివిగా కాంగ్రేసు రాజ్యమ్మునన్
    కనగా చందన వృక్షముల్ సొబగుగా గంధమ్మునున్ చల్లుచున్
    చనుచున్ గొడ్డలి వేటు పెట్టగనహో జంజాటమే లేకయే
    వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్

    రిప్లయితొలగించండి