3, జులై 2015, శుక్రవారం

పద్య రచన - 949

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. గాడిద బరువును మోయగ
    నేడాది పొడుగున, చేసెనే ఖర్మమునో
    డాడీ మమ్మీలయినను
    గోడును పట్టించుకొనక స్కూలుకు తరుమున్

    రిప్లయితొలగించండి
  2. బండెడు బరువులు మోయుచు
    నిండుగ తమచదు వులందు నీరస పడగన్
    దండిగ తినియాట లకని
    మెండగు సంతసము నొందు మెరుపుల దొరలౌ

    రిప్లయితొలగించండి
  3. మూటలను మోయు నట్టుల పుస్తకముల
    మోపు వేసిరి పిల్లలు వీపుమీద
    వెన్ను పూసకు కీడను వెఱపు లేక
    పెద్దలు బుడతలకు శిక్ష వేయుచుండ్రి

    రిప్లయితొలగించండి
  4. కం:దండిగ బరువులు మోయుచు
    తిండియు తినకన్ చదువుచు తిరిగెడి తీరున్
    ఖండించు సమయ మొదవెన్
    రండు జనని జనకులార రయమున మీరున్.

    రిప్లయితొలగించండి
  5. కం:దండిగ బరువులు మోయుచు
    తిండియు తినకన్ చదువుచు తిరిగెడి తీరున్
    ఖండించు సమయ మొదవెన్
    రండు జనని జనకులార రయమున మీరున్.

    రిప్లయితొలగించండి
  6. చిత్ర మయ్యది చూడుము సీను ! నీవు
    పుస్త కమ్ముల సంచిని పొదుపు గాను
    మూపు మీదను బెట్టుకు మోయు చుండ్రి
    యేమి చదువులు చదువుదు రేమొ వారు ?

    రిప్లయితొలగించండి
  7. భుజములఁ గన నా మోతలు
    యజుడైనను మాని బడిని హాయిగ గడుపున్!
    నిజమెంచి మోడి గారలు
    డిజిటలు చదువులను చుండ ఠీవియె పెరుగున్!

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండురోజులు ప్రయాణాల్లో వ్యస్తుణ్ణై ఇప్పుడే నెలవు చేరుకున్నాను. నిన్నటి పూరణలను, పద్యాలను కాస్త తీరుబడిగా సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పుస్తకములు కడు నిండిన
    బస్తా బరువులను మోయు బాలికలెల్లన్
    కుస్తీ పడుచనుదినమున
    రాస్తాపై నడవ గనిన క్రందునమొచ్చున్.

    రిప్లయితొలగించండి
  10. పుస్తకములు కడు నిండిన
    బస్తా బరువులను మోయు బాలికలెల్లన్
    కుస్తీ పడుచనుదినమున
    రాస్తాపై నడవ గనిన క్రందనమొచ్చున్.

    రిప్లయితొలగించండి
  11. కన్నవారి కలలు-కళలుగా నింపగ?
    -----బడిబాట దుస్తులే బాల్యమాయె|
    పుస్తక పాఠాలు మస్తిష్కమునజేర్చు
    -----నిధులగదులసంచి నేర్పులాయె|
    వీపున బరువైన మోసెడి బాల్యము
    -----తల్లిదండ్రి తపనచెల్లదాయె|
    కాన్వెంటు బడులన్ని ఖర్చులు నింపినా?
    --మర్యాద ముసుగులో మగ్గుటాయె|
    బలము లేకయున్న బాలురు సంచులు
    ఫలము గనగ రానిభాష లందు
    మోజుబెంచ గానె మోహంబు ప్రేమగా
    నుంచు బాల్యమంత?దంచుచదువు|

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పుస్తకాల బరువు మోసి భుజము నొప్పి బెట్టగా
    మస్తకముల కేమి యెక్కు మంచి గచదివించినన్
    మస్తు గాను బడికి బోవు మంచి కాల ముందిలే
    పుస్తకాలబదులువచ్చు ముందు ముందు' టేబు'లే!!!

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మస్తు’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి