9, జులై 2015, గురువారం

పద్య రచన - 955

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. రోస మందున మెలివేసె మీస ములను
    పలుర కమ్ముల యవధాన ప్రతిభ లందు
    అనువ దించిరి తెనుగున కాంగ్ల ములను
    జంట కవులన్న గీర్తిని మింట నంటె

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  3. శుక రంభ సంవాదమును
    జంట గ వెలయించి రచనల్,
    నాట డబల్ మీనింగు కింగ్
    వేటూరి నిచ్చిన కవివరుల్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. వ్యవసాయం చేసేటప్పుడు కల్పవృక్షాలతో పాటు కొన్ని కలప వృక్షాలు, కొన్ని కలుపు మొక్కలూ సహజం. అంత మాత్రాన మొత్తము ఫలాన్ని నిష్ఫలమనడం మన విలోమ దృక్కోణ ఫలితమౌతుంది

    రిప్లయితొలగించండి
  5. సరసముగా పద్యములను
    విరచించినమేటియైన విద్వాంసురిలన్
    అరయగ వీరలు గాదే
    తిరుపతి వెంకట కవులన తెలియుము మనుజా!

    2తిరుపతి వెంకట కవులిల
    విరచించిరి పద్యములను విడిగా,జతగా
    సరసముగాకూర్చిన కవి
    వరులకు మ్రొక్కుదము రండు వాసిగ మీరున్

    రిప్లయితొలగించండి
  6. కవనములపయి జనాళికి
    చవులూరగ రచనఁ జేయు సామర్థ్యమునన్
    భువిలో సాటియె లేరన
    వివిధములగు కృతుల నొసగు పెద్దలు వీరల్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీతిరుపతి వేంకట కవీశ్వరులకు ప్రణామములతో............

    ధారణ జేసెజూపెడి విధానము నాశుకవిత్వమందు వా
    గ్ధారయు వర్ణనాంశముల కమ్ర కవిత్వ వచోవిలాసముల్
    ప్రేరణ నిచ్చు భాషణము ప్రేమను బంచెడి నైజమున్ మహా
    ధీర సుధీ ప్రకాశముల తెల్గున వెల్గిన సత్కవీశ్వరుల్

    అవధానంబులె జీవనంబులయి విద్యాప్రౌఢియే సొత్తులై
    కవనప్రాభవమాస్తిపాస్తులయి ధిక్కారంబులొక్కింతగా
    నవ లావణ్యపదారవిందములనానందింపగా జేసిరీ
    కవులున్ తిర్పతి వెంకటేశ్వరులకున్ కైమోడ్పులర్పించెదన్

    రిప్లయితొలగించండి
  8. వరుసగ పద్యములల్లుచు
    సరసమ్ముగ మాటలాడ చతురతతోడన్!
    తిరుపతి వేంకట కవులకు
    కరమోడ్చినమస్కరింతు కవనమ్మునకై!

    దోసమ్ములేని భాషను
    మీసమ్ముగ బడసినట్టి మేధావులుగన్
    రోసమ్ముజూపి తిన్నెల
    భాసిలు వేంకట కవులకు వందన మందున్

    రిప్లయితొలగించండి
  9. తిరుపతి వేంకటకవుల
    న్నెరుగని వారిలను గలరె? నెయ్యము తోడన్
    సురుచిర కవితా ధారలు
    కురిపించిరి తెలుగువారి గుండెలలోనన్!!!

    రిప్లయితొలగించండి
  10. అవధానమనినను నాశుకవితలన్న
    ......నల్లేరు పైబండి నడక యనిరి
    సత్కావ్య నిర్మాణ చాకచక్యంబన్న
    ..... షడ్రసాన్నమనుచు చాటినారు
    చాటువులను జెప్పి చవులూరగాజేసి
    .....తెలుగు పద్యమునకు తేజమిడిరి
    జంట కవులుగాను సన్మానములు బొంది
    .... సాహితీ సేద్యమున్ జరిపినారు


    పండితాళి నుండి పామరులవరకు
    పద్యవిద్య రుచిని పంచినట్టి
    తెలుగు తీపి తెలుపు తిరుపతి కవులకు
    కొలుపు లిడును గాదె తెలుగు జాతి!!!



    రిప్లయితొలగించండి
  11. తిరుపతి వేంకట కవులట
    మరుగౌ నవధాన విద్య మహిమాన్వితమున్
    విరివిగ దేశంబంతట
    తరతర ముల కందజేయ?ధన్యులు కవులే|
    2.మీ-సముపార్జితంబయినమేధయె|”అష్టవధానమందునన్
    మీసముదువ్విజేసితిరి|మిక్కిలి మక్కువ గూర్చు నట్లు-ఆ
    మీసము దీయువారెవరు?మీ సమమైనకవిత్వ ధార-యే
    మీసర గండకౌను? యని మెల్లగ నైననుజెప్ప సాద్యమా?

    రిప్లయితొలగించండి
  12. జంట కవీంద్రు లయ్యు మనజాలగ పద్య-ప్రయోగమందు మి
    మ్మంటగ చిక్కబోక సరిమాకికలేరని రోష మీసముల్
    వంటివినుంచి నామనుచు బల్కిరి|చుల్కన జేయువారితో
    కంటికికానరారెవరు గర్వమె ఆంధ్రులకీర్తి నిల్పగా|

    రిప్లయితొలగించండి
  13. కం:సరసముగా పద్యములను
    విరచించిన సాిటిలేని విద్వాంసు రిలన్
    అరయగ వీరలె ! యీకవి
    వరులకు మ్రొక్కెదము రండు వాసిగ మీరున్/మీరల్

    2:ఆ.వె: జంట కవులు యన్న జగతి యందెల్లడ
    ఖ్యాతి నంది నట్టి ఘనులు వీరు
    ఆంధ్ర దేశ మందు యవధాన విద్యకున్
    ఆద్యులైరి గనుడు యార్యులార.

    రిప్లయితొలగించండి
  14. పద్యరచన తిరుపతి వేంకట కవులు
    1.నానా రాజుల కొల్వు నందు ఘన సన్మానమ్ములన్ పొందుచున్
    వేనన్ వేలుగ చాటువుల్ కవితలన్ వేనోళ్ళు స్ప౦ది౦ఛి నా
    రానాటన్ కురువీర భారతము నే డ౦ది౦ఛి రూపమ్ముగా
    స్థాన౦బ౦దిరి జంట కావ్యులుగ నా౦ధ్రమ్మ౦దునన్ పేర్మి మై
    2.మా సము లేరు లేరనగ మాన్యత నొప్పగ పెంచినారమీ
    మీసము.సంస్కృతా౦ధ్రముల మేటి యటంచును చాటి చెప్పగా
    రోసము యున్న డీ కొనుడు రూఢిగ ప౦దెము వేసినారమీ
    మీసము తీసి వేసెదము మించిన మమ్ముల కైతల౦దునన్
    3.అవధానమ్ములు సేసినారు కవితల్ అన్యోన్యమున్ పల్కుచున్
    అవనిన్ పొందిరి కి౦కవీంద్రఘట పంచాస్యమ్ము నా పట్టమున్
    కవులన్ గెల్చిరి వాదసంగరమునన్ గైకొంచు కైమోడ్పులన్
    స్తవనీయుల్ కద జంట తిర్పతి కవుల్ సాహిత్య రంగమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. తిరుపతి జంట కవీంద్రుల
    పరమోన్నతమైన తెలుగు భాషా పటిమన్
    ధర తరగని యవధానపు
    సిరులను గురిపించినట్టి స్థిరచరి తార్తుల్.

    రిప్లయితొలగించండి
  16. తిరుపతి వేంకట కవుల గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
    రాజేశ్వరి నేదునూరి అక్కయ్య గారికి,
    డా.బల్లూరి ఉమాదేవి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహ దేవుడు గారికి,
    శైలజ గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    (ప్రయాణంలో ఉన్నందున వివరంగా విశ్లేషించలేకపోతున్నాను. మన్నించండి.

    అశ్వత్థ నారాయణ మూర్తి గారికి,

    రిప్లయితొలగించండి
  17. రోసము గల కవి వీరులు
    వేసము గనుడిటు తిరుపతి వేంకట కవులన్
    మీసము తెలుగాంధ్రమ్ముల
    మాసములన్ జూప తీతు మనిజెప్పె గదా !

    రిప్లయితొలగించండి
  18. జంట కవులుగ బేరొం ది మింటి వరకు
    పేరు ప్రఖ్యాతు లార్జించి ,బిరుదు లెన్నొ
    పొంది తెలుగుసా హిత్యపు పోకడలను
    నాల్గు వైపుల వెదజల్లి వెల్గి నట్టి
    వెంక టకవుల కునిడుదు వేయి నతులు

    రిప్లయితొలగించండి