10, జులై 2015, శుక్రవారం

పద్య రచన - 956

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:



  1. మాతను జేరుట కొఱకని
    సీతయె భూదేవి గొలిచె చెలువమ టంచు
    న్నాతనయుల ఋషి హనుమకు
    చేతులు జోడించె పతికి సెలవీయ దగున్


    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    లవకుశ సినిమాలో సీతావతార సమాప్తి ఘట్టమందు
    కంకంటి వారిదో లేక సదాశివ బ్రహ్మం గారిదో గాని
    దాని తదుపరి నా పూరణ :

    కన్నులారగ తుదిసారి - కరువు దీర
    వీర శృంగార రామావ - తార మేను
    దర్శన మొనర్చి పరవశ - త్వంబు జెంది
    నిన్ను జేరెద నన్ను మ - న్నింపు - మమ్మా !

    *****
    అని పూర్వం తల్లితో జెప్పిన మాట గుర్తుకు దెచ్చుకొని

    *****
    రామస్వామి పదాంబుజంబు లెద నా - రాధింతు నేనిన్ సదా
    రామాఙ్ఞన్ జరియింతు నేని , తగ జా - గ్ర స్వప్న సుప్త్యాదులన్
    రాముందప్పని దాన నౌటయు, యథా - ర్థంబేని , నా తల్లి , యో
    భూమీ యీ యెడ ద్రోవ జూపి నను గొం - పోవమ్మ నీలోనికి

    *****

    01)
    _______________________________________

    న్ననుచు వేడగ సీతమ్మ, - యవని చీల ;
    కనులు మిరుమిట్లు గొలుప; నా - కాశ మంత
    ఘోర మైన రవముల గ - గ్గోలు వడగ ;
    జగతి కంపించి ప్రాణు ల - శాంతి నొంద

    కనుల నీరిడి శ్రీరాము - డినకులుండు
    సీత సీతని కుములు చ - చేతను డవ
    కవల సుతులకు కన్నీరు - కాల్వ గట్ట
    నమ్మ,వలదని లవకుశు - లలమటించ

    బ్రహ్మ రుద్రాది దేవతల్ - ప్రస్తుతింప
    కనుల నిండుగ శ్రీరాము - గాంచి కలికి
    క్షాంతి యొడి జేర, దూకి భూ - గర్భమందు
    ధన్య జీవితయై; తల్లి - ధరణి గలిసె !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  4. అవనిచీలిపోయె నాకసమ్ము మెరసె
    దండ మిడుచు సీత ధరణి జొచ్చె
    కౌసలేయుడు,కపి ,కవలలు, వాల్మకి
    వెరగు పడుచు పరితపించి రకట!

    రిప్లయితొలగించండి
  5. చిత్ర మయ్యది జూడుము చిత్రముగను
    రామ లక్ష్మణు ల్ వాల్మీకి రాయి యగుచు
    చూచు చుండగ దృశ్యము సూటి గాను
    బోవు చుండెను సీతమ్మ భూమి జీల్చి
    తనదు మాతను గలువగ తమము కలిగి

    రిప్లయితొలగించండి
  6. అవతారముఁజాలించగ
    నవనిజ తనతల్లిఁగోర నవనియె విచ్చెన్
    భవబంధముల దిగవిడచి
    కువలయ గర్భమునఁజేరె గోమిని ధృతితో
    గోమినిః లక్ష్మి

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు సార్ద్రంగా ప్రశస్తంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  8. పుట్టి పెరిగినఅవనిలో గిట్టుటేల?
    పరుల మాటలు జానికీ బట్టుకొనగ
    నష్ట మెవరికి?రాముని కష్ట బెట్టి
    అమ్మ నొడియందు జేరుటసమ్మతంబ?

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:సుతుల నిద్దరినట పతిచెంత జేర్చుచూ
    సీత వెడల నెంచె మాత కడకు
    భూమి చీలి పోగ భూసుత తానేగె
    సాధ్వి సీత కిలను సాటి యెవరు.
    2ఆ.వె:హనుమదాదు లెల్ల యచ్చెరువున జూడ
    రామభద్రునకట రమణి మ్రొక్కి
    తల్లి చెంత చేర తహతహ లాడంగ
    నవని చీలి పోయె నతివ కొరకు.

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:సుతుల నిద్దరినట పతిచెంత జేర్చుచూ
    సీత వెడల నెంచె మాత కడకు
    భూమి చీలి పోగ భూసుత తానేగె
    సాధ్వి సీత కిలను సాటి యెవరు.
    2ఆ.వె:హనుమదాదు లెల్ల యచ్చెరువున జూడ
    రామభద్రునకట రమణి మ్రొక్కి
    తల్లి చెంత చేర తహతహ లాడంగ
    నవని చీలి పోయె నతివ కొరకు.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    ప్రసిద్ధ పద్యాల ప్రస్తావనతో మీ పద్యాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘జానకీ’ అని దీర్ఘాంతం టైపాటు అనుకుంటాను. ‘అమ్మయొడి’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘...జేర్చుచూ’ అని దీర్ఘాంతం దోషం. ‘..జేర్చుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీటి.కోదండరామయ్య గారి పూరణం
    కమలాక్షు డైన రాముడు
    అమలిన కుముదారివోలె|హ్లాదములేమిన్
    సుమమును గోల్పోయిన యా
    బ్రమరముచింతించి నట్లు భావము చెడెగా|

    రిప్లయితొలగించండి
  13. టి. కోదండరామయ్య గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. అభినందనలు.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘రాముడు+అమలిన’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘రాముం| డమలని...’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. అగ్నిపునీతగా నిలబడిన సీతను పొందిన రాముడు, మూర్ఖుని మాటకు మరలా అడవులకే పంపాడు. పిల్లలతో కలిసిన సీతను వెంటబెట్టుకు పోదామన్ననూ మనసురాని సీత తనతల్లియొడికి జేరింది.

    మెట్టిన రఘు కులమందున
    చిట్టచివరి వరకు గూడ చింతల మునగన్
    పట్టెదనన్నను రాముడు
    పుట్టిన తన తల్లి యొడిని పొందెను కుజయే!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. విజయకుమార్ గారూ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి