23, జులై 2015, గురువారం

పద్య రచన - 969

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. శ్రీ కృష్ణుడు దుర్యోధనునితో...


    నిద్దురనిపుడే లేచితి
    నిద్దర నే జూచినాడ నిట నరు ముందున్
    ముద్దుల బావ ! సుయోధన
    కద్దగు సాయమ్ము ముందు కవ్వడి కోరున్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కవ్వడి కోరన్’ అంటే బాగుంటుందేమో!?

    రిప్లయితొలగించండి
  3. 1 ఆ.వె:సంధి మాట లెల్ల సమిసి పోవంగనె
    సాయమడుగ కురు సార్వ భౌము,
    పార్థు లొచ్చి రచట బావ కృష్ణుకడకు
    సాయమును యొన రించెను శౌరి యపుడె.
    2.తే.గీ:సంధి మాటలెల్లయు నట సమిసి పోగ
    సమర మికతప్ప దనుచును శౌరి కడకు
    ముందుగా వచ్చె కురుపతి ముందు జూచె
    పార్థు;నందించె సాయము పద్మపాణీ.

    రిప్లయితొలగించండి
  4. సాయమునుగోరగానెంచి శౌరికడకు
    నరుగుదెంచిరి దాయాదు లర్థితోడ
    కపటనిద్రలో నున్నట్టి కంబమయ్య
    లేచుటకొరకై వారలు వేచియుండ్రి

    రిప్లయితొలగించండి
  5. ముందుగ వచ్చిన కురుపతి
    ముందుగ నేజూసితినిట ముదముగ నిన్నే
    సందేహించకు పార్ధా!
    ముందుగ నువుకోరుకొనుము ముచ్చట దీర్తున్!!!

    రిప్లయితొలగించండి
  6. ముందుగ జూచి తర్జునుని మోజునగోరగ పార్థ సారదై
    యుందును.యుద్దమందు తన యూహల రీతిగశౌర్య వంతమున్
    బొందినసైనికుల్ నిడుదు పూర్తిగ నీకడ రాజరాజ|యే
    మందువు?సంతసంబెగద?మంగళ మౌనిక కృష్ణ వాక్యముల్|

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యానికి నా సవరణలు.....
    సంధి మాట లెల్ల సమిసిపోవుట చేత
    సాయమడుగగ కురు సార్వభౌమ
    పార్థు లేగినారు బావ కృష్ణుకడకు (వచ్చిని ఒచ్చి అన్నారు)
    సాయ మందజేసె శౌరి యపుడె.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    కంబమయ్యను కంసవైరి అంటే బాగుంటుందేమో?
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కొన్ని లోపాలు... ‘సారథి+ఐ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘శౌర్యవీర్యముల్|బొందిన...’ అనండి. ‘సైనికుల్+ఇడుదు’ ఇక్కడ నిడుదు అన్నరూపం రాదు. ‘సైనికాళి యిక పూర్తిగ నీదగు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. కపట నిద్ర తోడ కాలయాపన సేసె
    విజయు డాగమించు వేళవరకు
    కుటిలు డైన వాడు కురురాజు ను కనడు
    నటన సూత్రధారి నల్లనయ్య.

    రిప్లయితొలగించండి
  9. కపట నిద్ర తోడ కాలయాపన సేసె
    విజయు డాగమించు వేళవరకు
    కుటిలు డైన వాడు కురురాజు ను కనడు
    నటన సూత్రధారి నల్లనయ్య.

    రిప్లయితొలగించండి
  10. భారత యుద్ధము నందున
    శౌరి సహాయమును కోరి చనుదెంచిరిటన్
    వీరుడు పార్థుడు మరియును
    రారాజా కౌరవపతి రమ్మని పిలువన్.

    ఇద్దరు నొకపరి చేరిరి
    నిద్దురలో నుండె నపుడు నీలతనుండున్
    తద్దయు నొద్దిక నిలబడె
    పెద్దయని పదాల చెంత విజయుడు ప్రీతిన్.

    రారాజు చూచె నటునిటు
    చేరెను గోవిందుని తల చెంతను వడిగా
    మీరిన ఠీవిని కూర్చొనె
    నా రమ్యాసనము లోన నతిదర్పమునన్.

    కనులు తెరచెను హరి కనుపించె పార్థుడు
    నెప్పు డేగుదెంచి తీవు బావ
    యనుచు పలుకరించె నాతని బ్రీతితో
    చెప్పె తనదు రాక గొప్పరాజు.

    రిప్లయితొలగించండి
  11. వచ్చితి వీవెయైనఁ దొలి పాండవ మధ్యముఁ జూచినాడనే
    నచ్చిన బంధువైతిఁ గద మాదు సహాయము నందు నిర్వురన్
    మచ్చల నంటనీక తము మన్నన దల్చెడు సైన్య భాగ మీ
    కిచ్చకుఁ దోచు రీతిఁ గొనుడెన్నిక ముందుగఁ గ్రీడి వంతగున్!

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులు త్వరగా కోలుకోవాలని దేవదేవునికి ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  13. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్న్దది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ముందుగ వచ్చి తీవు మునుముందుగ నర్జును నేను జూచితిన్’ పద్యాన్ని గుర్తుకు తెచ్చారు.

    రిప్లయితొలగించండి