26, జులై 2015, ఆదివారం

పద్య రచన - 972

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. రచన సేయ గలదు రాజ్యమేలగలదు
    కదనమాడగలదు కలికి నేడు
    పడతి చేయలేని పనులేవి లేవురా
    ఆడదన్న నేమి ఆదిశక్తి

    రిప్లయితొలగించండి
  2. ఒకచో నారులు రక్కసుల్ మరొకచో నుద్ధండులౌ పండితుల్
    ఒకచో రాణిగ రాజ్యమేలు కడు యుద్ధోన్మత్తులై వారిజల్
    వికచాబ్జానన సుందరాంగు లొకచో విఖ్యాతు లింకొక్కచో
    సకలార్థంబులనిచ్చు నెచ్చెలియయై సత్కీర్తియౌ తల్లియౌ

    రిప్లయితొలగించండి
  3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవపద్యంలో ‘వారిజల్’ అన్నదాన్ని ‘పద్మినుల్’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. బండి చక్రమాగి మొండి చేసినయంత
    సాయ మిడెడు మహిళ శక్తిఁ గనుడు
    యింటి బండి నడుపు నిల లోన నిల్లాలు!
    రమణు లేల గలరు రాజ్యములను!

    రిప్లయితొలగించండి
  5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నేర్వ గనురాని విద్యలు నెలత లకిల
    గలవె ? నెంచిచూ డం గను గాంత !కనుము
    లారి చక్రము నెటులుగా లాగుచుండె ?
    వింత జూచెను నాయవి వీక్షణ ములు

    రిప్లయితొలగించండి
  7. మొరటుపనులఁగూడ ముదముతోఁజేయుచు
    వినుతి కెక్కుచుండ్రి వనిత లిపుడు
    లింగ బేధమింక లేదు పనులనంచు
    తెలియజేసె మగువ తెల్లముగను

    రిప్లయితొలగించండి
  8. అబల బలముజూడ?నాశ్చర్యబరచును
    లారి చక్రములుసలాము జేయ
    తీసి,వేయగలుగు ధీమంతురాలిగా
    సవ్యసాచి నారి|నవ్యప్రగతి.

    రిప్లయితొలగించండి
  9. వాహనంబునడుపు-వాల్జడచిన్నది
    ---సాహసంబెరిగిన-సాధ్విలాగ|
    సంసార పయనంబు-సంశయములవోలె?
    -----వాహన చక్రంబు –వాలిపోగ?
    అదరక బెదరక-అబలనుగాదని
    -----చక్రంబు చేదించి-విక్ర-మించు|
    పట్టుదల పడతి*కట్టుబాట్లేంచదు
    ----సాధనాసంపత్తు సాకునపుడు.
    వనిత సాధించ లేనిది వసుధ గలదె?
    అన్నిరంగము లందున అతివలేక
    బ్రతుకు సాగదు|ఒంటెద్దు బండిలాగ
    అబలయనుమాట చెల్లదు-సబబుగాదు.

    రిప్లయితొలగించండి
  10. చక్రము విప్పుటనందును
    చక్రమునే తిప్పుటందు చకచక పనులన్
    వక్రముగ మారకుండగ
    సక్రమముగ జేయుటందు శక్తులు వనితల్.

    రిప్లయితొలగించండి
  11. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి