28, జులై 2015, మంగళవారం

పద్య రచన - 974

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. భరత జాతి కీర్తి భవ్యజగతి చాటె
    భరత రత్న మతడు భవ్య జ్యోతి
    పాలవంటి మనసు పావనచరితుండు
    నింగి కెగసె భువియనిమిషు డతడు

    అనఘుడై మెరిసెను అబ్దుల్ కలాముయే
    దేశ ప్రజల యెదన వాసిగాను
    నిన్ను మరచి పోని నీదేశ వాసులు
    అశ్రువులను గార్చెనఖిల జనులు.

    రిప్లయితొలగించండి

  2. ఏ పి జె అబ్దుల్ కలాం
    వారికి నివాళి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ముగ్గు రమ్మల యందున ముదము గలిగి
    శాంతి కాముకు డాతడు క్రాంతి జగతి
    శాస్త్ర వేత్తగ నిలచిన శక్తి యుతుడు
    భరత దేశపు రత్నమై తరలె దివికి

    రిప్లయితొలగించండి
  4. కనుడుమీరలెపుడు కనకంపు కలలనే
    నిజముజేయ జేసి నిత్య కృషిని
    అందుకొనుచు పొందుడానంద మని తాను
    చెప్పినాడు నాడు శ్రీ కలాము.

    మనము పంపినట్టి మరియెన్నొ శటిలైట్లు
    దివిని జేరి జూపి దేవతలకు
    భరమాత కీర్తి బాగుగా చాటగా
    తాను మిస్సయిలుగ తరలి పోయె.

    రిప్లయితొలగించండి
  5. స్ఫూర్తిప్రదాత...శ్రీ అబ్దుల్ కలామ్ గారికి అశ్రునయనాలతో......

    సౌరికమును జేరె భారత రత్నము
    పరితపించి బోయె భరతమాత
    శోక సంద్రమయ్యె లోకమంతయు నేడు
    మరువ లేదు నిన్ను మాన్య! జగతి!!!

    సాగి పోవు గాలి యాగి యలమటించె
    యులికి పడెను గాదె నుర్వి జనులు
    మరలిపోయె భువిని మానవతామూర్తి
    యేరు లాయె కనులు భారతమున!!!

    సత్యలోక మేగె నిత్యకృషీకుడు
    సంస్కరించ నచట సైన్సుతోడ
    నమృతహృదయుడైన నబ్దుల్ కలాముకు
    నశ్రుజలముతోడ నంజలింతు!!!

    రిప్లయితొలగించండి
  6. కనుడుమీరలెపుడు కనకంపు కలలనే
    నిజముజేయ జేసి నిత్య కృషిని
    అందుకొనుచు పొందుడానంద మని తాను
    చెప్పినాడు నాడు శ్రీ కలాము.

    మనము పంపినట్టి మరియెన్నొ శటిలైట్లు
    దివిని జేరి జూపి దేవతలకు
    భరమాత కీర్తి బాగుగా చాటగా
    తానె రాకెటుగను తరలి పోయె.

    రిప్లయితొలగించండి
  7. లేవు లేవాయె యికమాకు లేవు నీవు
    కాన రానట్టి దూరమ్ము గడచి నావు
    మాయ మర్మము లెఱు గని మనిషి వీవ
    సాటి యెవరయ్య నీకిల సాటి యెవరు ?
    అమర లోకమ్ము జేరితి రార్య !మీరు
    సకల శుభములు గలిగించు శంకరుండు
    నీదు నాత్మకు శాంతిని నించు గాక !

    రిప్లయితొలగించండి

  8. అశ్రునివాళి:
    మనదేశ ప్రథమ పౌరుడుగా నుండి వేలాది మందికి స్ఫూర్తి ప్రదాతగా నిల్చిన మహామనీషి భారతరత్న డా.APJకలాం గారు కీర్తిశేషులవడం బాధాకరమైన విషయం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమెరికాలోమేమున్న ఈ డల్లాస్ నగరంలో వున్న గాంధీ పార్క్ లోఈరోజు 27/7/15 రాత్ర 8 30 ప్రాంతంలో TV 5 మరియు తెలుగు అసోసియేషన్ వారు శ్రీ కలాం గారికి సంతాపసభ యేర్పాటు చేశారు.ఆ సభలో వారిని గూర్చి మాట్లాడే అవకాశం కల్గింది.వారిని గూర్చి నేను వ్రాసిన పద్యాలు వన్పించిన సంగతులు మిత్రలతో పంచుకోవాలనీ-----




    1 ఆ.వె: భరతమాత గన్నభాగ్యవంతుడితడు
    సాటి లేని మేటి శాస్త్ర వేత్త
    విద్య పంచి నట్టి విఙ్ఞాన మూర్తిగా
    యితని పొగడ తరమె యేరి కైన.

    ఆ.వె: నింగి కెగసి నాడు నేడొక్క ధీశాలి
    కదలి సాగినాడు ఘనత తోడ
    స్వర్గ మందు పంచ శాస్త్ర విఙ్ఞానమ్ము
    యరగినాడు వేగ నమర పురికి.
    3.ఆ.వె:.అంతరిక్షమందు నపురూపముగ వెల్గ
    సాగినాడు గాదె సాధు శీలి
    ఒదిగి వున్న కొద్ది ఎదుగు ననెడి రీతి
    స్ఫూర్తి దాత యైన సూరి యితడు.
    4.ఆ.వె: భరత జాతి నోము ఫలమె యీధీశాలి
    అలుపెరుగని యట్టి యమృత మూర్తి
    విద్య నేర్వ మంచు విద్యార్థులకు దెల్పి
    వారి మధ్య లోనె బాసె నసువు.

    రిప్లయితొలగించండి
  9. నీతిమరి నిజాయితితోడ ఖ్యాతిగొన్న
    యబ్దులు కలాము జీవిత మద్భుతమ్ము
    క్షిపణి నిర్మాణ మొనరించి కీర్తిఁబొందె
    భరత జాతినఁబుట్టిన వజ్రమతడు
    పరమపదమును చేరెను ప్రభువునాజ్ఞ
    నమసమొనరింతు నాగొప్ప నాయకునకు

    రిప్లయితొలగించండి
  10. క్షిపణిపితామహా! క్షితిని చివ్వున వీడి నభమ్ము నేగితే
    క్షిపణిని మించు వేగమున చివ్వున నశ్రులు చింద? నేదయా
    క్షిపణి భయంకరా! రిపుల చీల్చెడి ప్రేల్చెడి ప్రేరకమ్ము మా
    క్షిపణులకింక? నౌను గద శ్రేయము గూర్చెడు నీ తలంపులే.

    శాస్త్రజ్ఞు డందుమా చక్కని పాఠాల
    .........గరపెడు పూజ్యుడౌ గురువితండు!
    గురువందుమా సదా యెరుకకై తపియించు
    .........నాదర్శవంత విద్యార్థి యితడు!
    విద్యార్థి యందుమా విశ్వగుర్వన దగు
    ........భరతావని ప్రథమ పౌరు డితడు!
    పౌరుడే యందుమా ప్రగతికి బలమిచ్చు
    ........నావిష్కరణలకు నాద్య మితడు !

    కవి, విరామమెరుమంగని కార్మికుండు,
    దేశభక్తికి నిలువెత్తు దివ్య రూపు,
    బోధనాతృష్ణ బాయని బుద్ధిజీవి,
    పరువు పదవిఁ, కలామన నురు యశస్వి.


    రిప్లయితొలగించండి
  11. శ్రీగురుభ్యోనమ:

    జ్ఞానహిమాలయంబునకు చక్కని శృంగము మా కలాము మా
    మానస మందు నిల్చె నసమాన ధురీణుడు శాస్త్రవేత్తయై
    మౌనియు మానవోత్తముడు మంచితనమ్ముకు మారు రూపమై
    స్వానుభవమ్ము పంచె మన భారతమాతకు ముద్దు బిడ్డడై

    జ్ఞానచంద్రుడు విజ్ఞానగగన మందు
    శాస్త్రవేత్తగ ఘనకీర్తిచంద్రికలను
    పంచినాడట భారత ప్రజల కొరకు
    లలితహృదయుడు అబ్దుల్ కలాముగారు

    నీవే దిక్కని నమ్మినాము ఘనుడా నీ సాటి రారెవ్వరున్
    నీ వాత్సల్యము మర్వలేము నిజమౌ నీ (మౌనీ) మాటలే వేదమై
    దైవత్వమ్మును గూర్చ భారత మహాతత్వమ్ము శోభిల్లగాన్
    కైవల్యంబును పొందినావు కృషితో జ్ఞానాంబుధిన్నీదుచున్

    రిప్లయితొలగించండి
  12. విశ్వకుటుంబ సభ్యుడిగ విద్యను బంచిన శాస్త్ర వేత్తగా
    విశ్వ జనీనమైన పద పీఠమునెక్కినరాజుపేదగా|
    విశ్వవినోదముల్ పృథివి విజ్ఞతబంచ?కలాముకే సలాం
    విశ్వమునుండి వెళ్ళె పదవీచ్యుతుడాయెను |బ్రహ్మ నాజ్ఞచే|
    2ఆకాశమంత కీర్తిని
    లోకపు నబ్దుల్ కలాము లోకోత్తముడై
    లోకంబు వీడి మనకీ
    శోకంబను నిల్వలుంచి?శోధన కేగెన్|
    3నవ్వెడిమోమున నాణ్యత చిగురించు
    ------అబ్దుల్ కలాము ప్రయాస మాన్ప|
    తేట తెల్లబరచు తెల్ల వెంట్రుక లెల్ల
    ------కల్మష మేలేని కవియటంచు|
    పలుకులు బంచగ?పలువరసందున
    -----నాలుక విలువలు నాట్యమాడు|
    నుదుటి గీతలు జూడ?నుత్సాహములజాడ
    ------కన్నుల కాంతిగా కానుపించు|
    రాష్ట్ర పతియైన?బాలవిరాగియగుచు
    పాఠశాలకు వెళ్ళంగ?పరవశించు|
    సహన సిద్దుడి సహనంబు సమసిపోయె|
    అహములేనట్టి పెద్దకు నంజలింతు.

    రిప్లయితొలగించండి
  13. జాతి ఖ్యాతిని పెంచిన శాస్త్రవేత్త
    కీర్తితో నింగికెగసిన క్షిపణి యతడు
    యువతను నిదుర లేపిన యోధుడతడు
    పదవికే వన్నె దెచ్చిన పాజ్ఞు డతడు

    రిప్లయితొలగించండి
  14. పుట్టుక సామాన్యునిగన్!
    దిట్టయనెడు శాస్త్రవేత్త దేశము పొగడన్!
    చిట్టచివరి వరకు యువత
    పట్టుదలను బెంచ జూచె భరత రతనమై!

    రిప్లయితొలగించండి
  15. నుదుటి విభూతి రేఖలును నేర్పడ?ఈశ్వరయల్లరూపుడా?
    కుదురుగ నింగినేల సమకూర్పుకు రాకెటు-బ్రహ్మ తేజమా?
    కదనమువంటి జీవన వికాసము నందున విష్ణు మూర్తివా?
    కదలిక మానినా?ప్రతిభ కౌగిలిజేర్చగ?ముఖ్య మూర్తివా?

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. జ్వరం తగ్గలేదు. అందువల్ల మీ పద్యాలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
    మాజీ రాష్ట్రపతి, మహామనీషి, నిష్కళంక దేశభక్తుడు అబ్దుల్ కలాంకు స్మృత్యంజలి ఘటిస్తూ పద్యసుమాల నందిందిన కవిమిత్రులు...
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    మిస్సన్న గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    (ఆరోగ్యం కుదుటపడగానే ఈ పద్యాలను తప్పక సమీక్షిస్తాను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఫువు గారికి నమస్కారములు....పద్యాల సమీక్షకంటే మీ ఆరోగ్యం ముఖ్యమండి.... ఆరోగ్యంపై అశ్రద్ధ చూపకుండ మందులు వాడండీ. మీరు త్వరగా కోలుకోవాలనీ కోరుకుంటున్నానండి.

      తొలగించండి
    2. గుఫువు గారికి నమస్కారములు....పద్యాల సమీక్షకంటే మీ ఆరోగ్యం ముఖ్యమండి.... ఆరోగ్యంపై అశ్రద్ధ చూపకుండ మందులు వాడండీ. మీరు త్వరగా కోలుకోవాలనీ కోరుకుంటున్నానండి.

      తొలగించండి
    3. ఆ.వె:భరత జాతి కనుల పంటయ్యె పరికింప
      మానవాళి కెల్ల మార్గ దర్శి
      మతము కన్న గొప్ప మానవీయత యని
      మహిని జాటినట్టి మాన్యుడితడు.
      2ఆ.వె: పేదరికము కాదు విద్యార్జనకు యడ్డు
      అనెడి సూక్తి కితడె అసలు ఋజువు
      అంచెలంచె లెదిగి అధ్యక్షు డైనట్టి
      మాననీయున కిదె మంగళమ్ము.

      తొలగించండి
  17. భారత రత్నమా ! భరత భాగ్య విధాత! మహోన్నతోత్తమా!
    భారత జాతి గర్వపడు వాసిని బెంచిన శాస్త్ర సింధువా!
    భారత దేశ క్రాంతి ఖని భావి తరానికి వెల్గు దీపమా !
    చేరితి వేల రోదసికి? చీకటి క్రమ్మెను లోకమంతటన్.

    రిప్లయితొలగించండి