30, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1803 (తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

42 కామెంట్‌లు:

 1. చిన్న సందేహమండీ.'తా ' కు 'సా' కు యతి చెల్లుతుందా.లేక స్వర స్వామ్యమా తెలుప గలరు.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. గురువు గారికి సుకవి మిత్రులకు ప్రణామములతో.....
   1.
   చేరిరి కళామ తల్లికి
   నీరాజనమనుచును మరి నిలిచిన నటులే
   లేరే! గననేడు సినీ
   తారల గణనమ్ము సులభ తరమౌ చూడన్

   2.
   తారా బలమున్ గనుగొన
   తారల లెక్కించు చుంద్రు ధరణీసురులే
   భారము కాదని తెలియదె
   తారల గణనమ్ము సులభ తరమౌ చూడన్

   తొలగించండి
 3. తారా బలమును జూడగ
  కోరిన వరుడంట దొరకు కూరిమి తోడన్
  వారల వీరల నమ్మకు
  తారల గణనమ్ము సులభ సాధ్యము చూడన్

  రిప్లయితొలగించండి
 4. తారలు యిరువది యేడని
  ధారుణి లోనెంచెదరట ధరణీ సురలున్
  జోరుగ వివాహ వేళన్
  తారల గణనమ్ము సులభ సాధ్యము చూడన్

  రిప్లయితొలగించండి
 5. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  ధన్యవాదాలు. రాత్రి పడుకోబోయే ముందు ఆదరా బాదరా సమస్యను షెడ్యూల్ చేశాను. యతిని గమనించలేదు. సరిచేశాను.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తారలు+ఇరువది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తార లవి సప్తవింశతి’ అందామా? (సమస్యలోని యతిదోషాన్ని సవరించినా పూరణకు ఆటకం లేదు).
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. (సమస్యలోని యతిదోషాన్ని సవరించినా మీ పూరణకు ఆటంకం లేదు).
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు. (సమస్యలోని యతిదోషాన్ని సవరించినా మీ పూరణకు ఆటంకం లేదు).
  *****

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమః

  సూరియె పడమటి కొండకు
  జారిన సాయంపు వేళ చంద్రోదయమై
  యారేడు చుక్కలుండిన
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 7. తారా పథమున మబ్బులు
  తా రాడుచు నుండ మిగుల తమమున్గలుగ
  న్బాఱి న మబ్బుల దాగిన
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

  రిప్లయితొలగించండి

 8. తారలవిభజన "పుట్టిన
  తార మొదలు పరమ మిత్ర తారల జేయన్
  వారి శుభా శుభ ములతో
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్"

  రిప్లయితొలగించండి
 9. తీరగు రాశిన మేలగు
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్
  హారము జేయగ కోమయె
  నేఱుచు తానుండె నచట నీరజములనే!!!

  తార = ముత్యము


  తారల గణుతింప వశమె
  నేరుగ నెవ్వారికైన నిలలో , గానీ
  తీరుగ దుకాణమందు సి
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్!!!

  రిప్లయితొలగించండి
 10. తార బృ హస్పతి భార్యయె
  తారక పివరుం డువాలి దార ముదముగన్
  తార దివి నక్షిని గలదు
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 11. తారాపదమ్మునందున
  భారీ దుర్భిణి నిపూని బాగుగ వెతుకన్
  దూరమున నున్న ముఖ్యపు
  తారలగణనమ్ము సులభ తరమౌ చూడన్

  రిప్లయితొలగించండి
 12. సమస్య
  గురుమూర్తి ఆచారి :;

  [శిశుపాలుడు కృష్ణుని ని౦దిస్తూ ]

  ఓరీ మాయావీ యా

  తారల గణియి౦ప
  సులభతరమౌ జూడన్

  శౌరీ సాధ్య౦బే నీ

  నేరములను దుర్గుణముల
  ని౦దల. నె౦చన్ ? ? ?

  రిప్లయితొలగించండి
 13. ధీరులు ప్రతిభా శీలురు
  సారపు ధర్మంబెఱుంగు సచ్చీలురు నీ
  భారతమున వెలసిన దృవ
  తారలగణనమ్ము సులభతరమౌజూడన్ !!!

  రిప్లయితొలగించండి
 14. మీరిన విచ్చలవిడి శృం
  గారములొలికించు నట్టి కాలమునందున్
  తీరైన నటన చేసెడి
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్

  రిప్లయితొలగించండి
 15. కోరిన చెలి చిరునవ్వుల
  గారాల పలికి జగడముఁ గట్టగ నపుడా
  జోరున చెలుడును మొదలిడు-
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 16. పూరి గుడిసెను జీవించెడు
  వారలహో సందె వేళ ప్రమిదల వెలుగుల్
  తారలుగ ననుభవించన్
  తారల గణనమ్ము సులభ తరమౌఁ జూడన్

  రిప్లయితొలగించండి
 17. గురువుగారికి నమస్కారం. నా పూరణము పరిశీలించి తప్పులు తెలియచేయగలరు.
  తీరౌ చదువులు గరపియు
  కోరిన కొలువుల బడసిన కొడుకుల జూడన్
  గారము నమ్మక నులజిగి
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చెలుడు’...?
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘పూరిగుడిసెలో బ్రతికెడు’ అందామా?
  *****
  వేదుల సుభద్ర గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మీరగ నెన్నిక వేళలు
  హోరుగ హామీలు కురియు నొకటా రెండా
  భారము లెక్కింపగ నవి
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  (ఆవాల మూటతో సభకు వచ్చి, చుక్కల లెక్క నెఱుంగఁ గోరిన యక్బరుతో బీర్బల్ పలికిన సందర్భము)

  "కోరిక తోడుతఁ జుక్కల
  నీ రీతిగ గణన సేయ నెప్పటికైనన్
  దీరదు! సర్షపములతోఁ
  దారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్!!"
  (సర్షపములు = ఆవాలు)

  రిప్లయితొలగించండి
 22. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

  పూరిగుడిసెలో బ్రతికెడు
  వారలహో సందె వేళ ప్రమిదల వెలుగుల్
  తారలుగ ననుభవించన్
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్!

  రిప్లయితొలగించండి
 23. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. నిన్నటి సమన్యా పూరణము:
  ఎటు జూచిన నా వారలె
  కఠినమ్ముగ జంప లేను కదిలెద నయ్యా!
  తటపటలుగ పొగరెక్కియు
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 25. నిన్నటి సమన్యా పూరణము:
  ఎటు జూచిన నా వారలె
  కఠినమ్ముగ జంప లేను కదిలెద నయ్యా!
  తటపటలుగ పొగరెక్కియు
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 26. ఇనుము సూదంటురాయి కై యెగయునట్లు
  లేగదూడల గుడప పాలిండ్ల చేపు
  నటుల గోపిక విరహ మనమున కృష్ణ
  పొందు కోరగన్ మురహరి పొదవి పట్టె

  రిప్లయితొలగించండి
 27. సవరణలతో,

  కోరిన చెలి చిరునవ్వుల
  మారాములలో, జగడపు మాటలలోనన్,
  జోరున చెలికాడు సలుపు
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 28. .మారెడి సమాజ మందున
  కోరిన వాయిద్య గోష్టి కూర్పున నిలుపన్
  తీరికచే నేర్చెడివి సి
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

  రిప్లయితొలగించండి
 29. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో ‘కటువుగ నేఁ జంపలేను...’ అనండి.
  *****
  సి. రామ మోహన్ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. తారక మంత్రము రామము
  తీరుగ మననము జరుపుచు తేల్చియు చెప్పెన్
  తారల దూరము పోతన
  తారల గణనమ్ము సులభతరమౌ జూపన్

  రిప్లయితొలగించండి
 31. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  చారిత్రక,సాంఘిక,పలు
  పౌరాణిక నగ్నచిత్ర పాత్రలకైనన్
  కోరగ నన్యులనె,తెలుగు
  తారల గణనమ్ము సులభతరమౌ జూడన్

  దూరుచు బాహుకుడు శశిని
  నేరుగ తారలను జూచె నిరువది యేడున్
  తారల గని పద్యములనె;
  తారల గణనమ్ము సులభ తరమౌ జూడన్

  "చిత్రనళీయం" నాటకంలో,నలుడు శాపగ్రస్తుడై బాహుకుడవ,దమయంతికి పునః స్వయంవర సందర్భంలో నిశిని వంటశాలనుండి "నక్షత్రమాల"గా యిరువది యేడు పద్యములను నిర్విరామముగా చదువగా ,గుర్తించ బడతాడు.ఆ సందర్భాన్ని ఊహించి పంపినదీ పద్యం.

  రిప్లయితొలగించండి
 32. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన నిన్నటి పూరణ:
  ఎటు జూచిన నా వారలె
  కటువుగ నే జంపలేను కదిలెద నయ్యా!
  తటపటలుగ పొగరెక్కియు
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 33. సి. రామ మోహన్ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 34. తీరుగ ప్రసవపు సమయము
  జేరుచు నొక చోట వ్రాసి చెప్పిన నడుగన్
  తారాబలమన బిడ్డల
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

  రిప్లయితొలగించండి
 35. తెలుగు యువత...1960 లలో...

  వారము వారము వెడలితి
  భూరిగ తెలుగున వెలువడు మూవీలకు...హా!
  మూరెడు చీరల సినిమా
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్

  రిప్లయితొలగించండి
 36. ఔరా! కాలము మారెను
  తీరుగ వ్రేళ్ళను తెరచుచు త్రేతాయుగమౌ
  మా రోజులలన్ సినిమా
  తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్

  రిప్లయితొలగించండి