3, అక్టోబర్ 2015, శనివారం

పద్య రచన - 1022

కవిమిత్రులారా,
(నిన్నటి ‘సెలవు’ను good bye అనే అర్థంలో కాకుండా casual leave గా పరిగణించమని మనవి)
“కటకట యెన్ని కష్టములు గల్గెను...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యరచన చేయండి.

40 కామెంట్‌లు:

  1. కటకట యెన్ని కష్టములు గల్గెను నేడిల బ్లాగు నందున
    న్నిటునటు మారునేమొ మరినింగిని తారలు సూర్య చంద్రులు
    న్నిటలుడు కాంతి హీనమయి నీమము దప్పుచు నల్క బూనడే
    పటుతర మైన కారణము భారము నొందుచు నుండె నేమొకో

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా ! వందనములు !
    మిత్రులందరి కోరికపై
    మీరు మీ నిర్ణయమును సమీక్షించుకొని
    బ్లాగును కొనసాగించుట ఎంతయో ముదావహము !
    మిత్రులందరి తరఫున మీకు ధన్యవాద శతములు !

    రిప్లయితొలగించండి
  3. అందరి కోరికను మన్నించి బ్లాగును కొనసాగిస్తున్నందులకు గురుదేవులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక బ్లాగును 7 సంవత్సరములకు పూర్వం మొదలుపెట్టి
    గత 5 సంవత్సరములుగా నిర్విరామంగా, నిరాఘాటంగా
    నిర్వహించడం- నీకే చెల్లింది మహానుభావా-శంకరార్యా
    వందనం- అభివందనం :
    (ఇదేమైనా రికార్డేమో కూడానూ- మిత్రులెవరైనా కనిపెడితే బావుణ్ణు)

    01)
    ________________________________________

    పటుతర శక్తితో దెలుగు - పద్యము రాజిల, పూని పూనికన్
    కటుతరమైన కార్యమును - కాదని యెంచక, నిత్యకృత్యుడై
    నిటలము నక్షి గల్గు, గళ - నీలుని నామపు శంకరార్యుడే
    కటకట యెన్ని కష్టములు - గల్గిన మానని కార్యశీలుడే !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా పాదభంగ మైనట్టుందిగా
    ఇప్పుడు చూడండి

    ఒక బ్లాగును 7 సంవత్సరములకు పూర్వం మొదలుపెట్టి
    గత 5 సంవత్సరములుగా నిర్విరామంగా, నిరాఘాటంగా
    నిర్వహించడం- నీకే చెల్లింది మహానుభావా-శంకరార్యా
    వందనం- అభివందనం :
    (ఇదేమైనా రికార్డేమో కూడానూ- మిత్రులెవరైనా కనిపెడితే బావుణ్ణు)

    1అ)
    ________________________________________

    కటకట యెన్ని కష్టములు - గల్గిన మానని కార్యశీలుడే
    నిటలము నక్షి గల్గు, గళ - నీలుని నామపు శంకరార్యుడే
    పటుతర శక్తితో దెలుగు - పద్యము రాజిల, పూని పూనికన్
    కటుతరమైన కార్యమును - కాదని యెంచని నిత్యకృత్యుడే !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  7. కటకట యెన్ని కష్టములు గల్గెను మాకిపు డా ర్య !యే మనన్
    నటనలయందు నేర్పరి యనంద గు మాచె లికాడు మొన్న రే
    యట మఱి ద్రాగి దూలుచు రయంబున నూతిని డాసి దూ కెనా
    డటనిక నా తడ య్యెడ భయంబున కేకలు వేసె నత్తరిన్

    రిప్లయితొలగించండి
  8. పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సెలవుకు సెలవిచ్చి కవికుల మెల్లా నెలవని భావించు బ్లాగును యధావిధిగా కొనసాగించ నిర్ణయం గైకొన్న గురువుగారికి కృతజ్ఞతలు

    కటకట యెన్ని కష్టములు గల్గెను మిత్రుడు శత్రువై మహా
    కటువుగ మాటలాడుచు వికారపు కృత్యము లెన్ని జేసెనో
    కుటిలపు బుద్ధితోడ నిది ఘోరము దానవక్రీడయే గదా!
    పటలము నెల్ల కోతులని పాపపు మాటల నాడె నక్కటా!

    రిప్లయితొలగించండి
  10. కటకట యెన్ని కష్టములు గల్గెను నిత్యము జీవితమ్ములో
    నటమట జెందుచున్ పలుకులమ్మకు సేవలొనర్ప కైతలన్
    పటిమ గలట్టి ధీయుతుల భాతిని మిత్రుల మల్చు సత్కృతిన్
    పటుతరమైన ప్రజ్ఞ నొక బ్లాగును తీరిచి దిద్దు సద్గురుం
    డిటువలె కాలకర్మమున నెగ్గులు బొందుట చూడ దోచు సం
    కటములు చెప్పి రావనెడు కారిక యియ్యెడ మిత్రులందరున్
    కటకట దీర వారికగు గట్టి ప్రయత్నము జేయ మోదమౌ.

    రిప్లయితొలగించండి
  11. బాల కృష్ణుని శైశవ కష్టాల సందర్భము లో:

    కటకట యెన్నికష్టములు గల్గెను పూతన నంజు స్తన్యమున్
    జటిలపు బండి ఘాతమును జక్రసమీర విఘాత దైత్యుడున్
    పిటుకగు రక్కసుం డొకడు వేష విశేషి సువత్స రూపుడున్
    తటకపు నొక్క కొంగయు విదారకు బాధ సహింప నేర్వవే

    (నంజు = విషము; పిటుకగు= గట్టి; తటకపు = ఆశ్చర్యమైన)

    రిప్లయితొలగించండి
  12. పద్యరచన
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ----------------------
    కటకట యెన్ని కష్టములు కల్గెను ! శ్వానము కూయు రీతిగా

    అటమటమైన మాటలిటు లాడగ నాలుక దెట్టు లాడెనో

    పటపట మ౦చు నొక్క కవి ప౦డితు దూర హిత౦బె వానికిన్ ?

    గుటగుట లాడ డెప్పుడును గొ౦టరి ; సజ్జను నాదరి౦చునే ?

    శ్వానము-కుక్క.అటమటమైన-వ్యర్ధమైన
    గుటగుటలాడు -పెద్దరికపుమాటలు పలుకు
    గొ౦టరి - గొ౦టుబుధ్దిగలవాడు

    రిప్లయితొలగించండి
  13. కటకట యెన్ని కష్టములు గల్గెను సాధు స్వభావి యొజ్జకున్
    కుటిల మనస్కుడైన యొక కూళుని మూర్ఖపు చింతతోడుతన్
    చటులపు మానసుండగుచు సంతతమున్ కడునిక్కుచుండు ఆ
    కటిక మెకమ్ము వేగముగ కానలకంపగ మేలు జాతికిన్

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    సంతోషం.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    మిస్సన్న గారూ,
    మి సప్తపాది బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మి పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు మనవి....
    జరిగినదంతా మరిచిపోదాం. ఇక వ్యక్తి దూషణలకు స్వస్తి పలికి మన బ్లాగును సంస్కారవంతమైన మార్గంలో ముందుకు కొనసాగిద్దాం. అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. కటకట యెన్ని కష్టములు గల్గెను చెప్పెద నాలకింపుడీ
    వటువుకు తేలుగుట్టెనట, పందిరి కూలి పురోహి తార్యుకున్
    కటిపయి దాకె, విర్గెనట కన్నెల చేతులు గోల గోలగా
    న్నటగల వంటపాత్రపయి వాయసమూకలు దాడి సేసెనే.

    రిప్లయితొలగించండి
  17. వి. యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది
    అభినందనలు. "గోలగా| నట గల......" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  18. కటకట యెన్ని కష్టములు గల్గెను రేనికి ,కాటి కాపరై,
    ఘటమున కల్లు దెచ్చి,తన కాపున కిచ్చి,శవాలు గాల్చగన్
    కటువుగ సు౦కమున్ గొనుచు,గాదిలి దాసిని జేసి,పుత్రునిన్
    స్ఫటి కొరకంగ చావగను, పన్ను నొసంగమి గాల్చ రాదనెన్

    రిప్లయితొలగించండి

  19. కటకట ఎన్ని కష్టములు గల్గెను రేనికి ,కాటి కాపరై
    ఘటమున కల్లు దెచ్చి,తన కాపున కిచ్చి,శవాలు గాల్చగన్
    కటువుగ సు౦కమున్ గొనుచు,గాదిలి దాసిని జేసి,పుత్రునిన్
    స్ఫటి కొరకంగ చావగను, పన్ను నొసంగమి గాల్చ రాదనెన్

    రిప్లయితొలగించండి
  20. కటకట ఎన్ని కష్టములు గల్గెను రేనికి ,కాటి కాపరై
    ఘటమున కల్లు దెచ్చి,తన కాపున కిచ్చి,శవాలు గాల్చగన్
    కటువుగ సు౦కమున్ గొనుచు,గాదిలి దాసిని జేసి,పుత్రునిన్
    స్ఫటి కొరకంగ చావగను, పన్ను నోసంగమి గాల్చ రాదనెన్

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా
    నేను పద్యరచన -1022 కు ఒకటే పద్యం ఉదయం 11-12 గంటల
    మధ్యలో 3 సార్లు పంపించాను
    అది ఇంతవరకూ బ్లాగులో ప్రకటింపబడలేదు- ఎందుచేత ?
    మీకందలేదా మళ్ళీ పంపించనా

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఒక బ్లాగును 7 సంవత్సరములకు పూర్వం మొదలుపెట్టి
    గత 5 సంవత్సరములుగా నిర్విరామంగా, నిరాఘాటంగా
    నిర్వహించడం- నీకే చెల్లింది మహానుభావా-శంకరార్యా
    వందనం- అభివందనం :
    (ఇదేమైనా రికార్డేమో కూడానూ- మిత్రులెవరైనా కనిపెడితే బావుణ్ణు)

    01)
    ________________________________________

    పటుతర శక్తితో దెలుగు - పద్యము రాజిల, పూని పూనికన్
    కటుతరమైన కార్యమును - కాదని యెంచక, నిత్యకృత్యుడై
    నిటలము నక్షి గల్గు, గళ - నీలుని నామపు శంకరార్యుడే
    కటకట యెన్ని కష్టములు - గల్గిన మానని కార్యశీలుడే !
    ________________________________________

    *****
    అయ్యా పాదభంగ మైనట్టుందిగా
    ఇప్పుడు చూడండి

    ఒక బ్లాగును 7 సంవత్సరములకు పూర్వం మొదలుపెట్టి
    గత 5 సంవత్సరములుగా నిర్విరామంగా, నిరాఘాటంగా
    నిర్వహించడం- నీకే చెల్లింది మహానుభావా-శంకరార్యా
    వందనం- అభివందనం :
    (ఇదేమైనా రికార్డేమో కూడానూ- మిత్రులెవరైనా కనిపెడితే బావుణ్ణు)

    1అ)
    ________________________________________

    కటకట యెన్ని కష్టములు - గల్గిన మానని కార్యశీలుడే
    నిటలము నక్షి గల్గు, గళ - నీలుని నామపు శంకరార్యుడే
    పటుతర శక్తితో దెలుగు - పద్యము రాజిల, పూని పూనికన్
    కటుతరమైన కార్యమును - కాదని యెంచని నిత్యకృత్యుడే !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  23. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  24. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  25. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  26. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  27. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  28. కటకట యెన్నికష్టములుగల్గెను చెట్లనుగొట్టు బుద్దిచే
    చిటపట వానలే బడక చిక్కులెజీవన యానమందునన్
    కుటిలపు నీతి వాక్యములు కూడును బెట్టవు|రైతు సోదరుల్
    పటుతర భాగ్య సంపదలె భావితరాల వరాలమూలమౌ

    రిప్లయితొలగించండి
  29. కటకట యెన్ని కష్టములు గల్గెను! బాలుడు విష్ణు భక్తుడై
    పటుతర దీక్షతోడ తన బాపును గాదని గొల్చినంతనే
    జటిలపు రీతి శిక్షలను జాలిని వీడియు నంతుజూచెడున్!
    గటువుగ కాలకూటమును గ్రక్కున ద్రాపెడు దారుణమ్ములున్!

    రిప్లయితొలగించండి
  30. శ్రీగురుభ్యోనమః

    కటకట యెన్ని కష్టములు గల్గెను నేడిట దెల్గువారికిన్
    కుటిలపు రాజకీయములు కుట్రలు బన్నుచు జీల్చివేయగా
    నట నిట స్థానికత్వమున కర్హత లేదని నొక్కి జెప్పగ
    న్నెటులకొ? జీవనమ్ములను నీడ్చగ దుర్భరమయ్యె జూడగన్

    రిప్లయితొలగించండి
  31. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ******
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. శ్రీగురుభ్యోనమః

    కటకట యెన్ని కష్టములు గల్గెను నేడిట దెల్గువారికిన్
    కుటిలపు రాజకీయములు కుట్రలు బన్నుచు జీల్చివేయగా
    నట నిట స్థానికత్వమున కర్హత లేదని నొక్కి జెప్పగ
    న్నెటులకొ? జీవనమ్ములను నీడ్చగ దుర్భరమయ్యె జూడగన్

    రిప్లయితొలగించండి
  33. శంకరయ్య గారు ! మా అందరి కోరిక మేరకు మీరు బ్లాగు ను కొనసాగించినందుకు ధన్యవాదములు
    _/\_

    రిప్లయితొలగించండి
  34. శంకరయ్య గారు ! మా అందరి కోరిక మేరకు మీరు బ్లాగు ను కొనసాగించినందుకు ధన్యవాదములు
    _/\_

    రిప్లయితొలగించండి
  35. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. వసంత కిశోర్ గారూ,
    ఈరోజు ఉదయమే హైదరాబాదుకు వెళ్ళి సీతాఫల్ మండీలో అష్టావధానంలో పాల్గొని ఇప్పుడే ఇల్లు చేరుకున్నాను. రోజంతా ఎప్పటికప్పుడు నా టాబ్‍లెట్ ద్వారా మిత్రుల పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను ప్రచురిస్తూ వచ్చాను. ఈక్రమంలో ఎప్పుడో పొరపాటున నా వేలు ‘డిలీట్’ మీద పడిందో, ఏం జరిగిందో కాని టాబ్‍లో మీ పద్యం కనపడలేదు. అంతకు ముందు ‘నేను బ్లాగును కొనసాగించడం ముదావహం’ అన్న మీ వ్యాఖ్యను ప్రకటించాను కూడా. ఇది మాత్రం కనిపించలేదు. ఇంట్లోకి వస్తుండగా మీ మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో సిస్టమ్‍లో చూస్తే మీ పద్యం ఉంది. వెంటనే ప్రకటించాను. నా పొరపాటువల్ల ఆలస్యమైనందుకు క్షమించండి.

    నాపై నభిమానముతో
    నీ పద్యము వ్రాసి నాకు హితమోదములే
    యేపారఁగ నొసఁగితె శ్రీ
    క్ష్మాపతి శుభ మొసఁగుతన్ వసంతకిశోరా!

    రిప్లయితొలగించండి
  37. శంకరార్యా !
    ధన్యవాదములు !
    మీరు ఆన్ లైన్ లోనే ఉన్నారు
    ఒకటి తరువాత ఒకటిగా అందరివీ ప్రకటితమౌతూనే ఉన్నవి నా పద్యం తప్ప
    ఏం జరుగుతోందో అర్థం కాక చాలా ఒత్తిడికి గురయ్యాను నిన్నంతా

    నేను హైదరాబాదు వచ్చి 6 రోజులౌతున్నది
    రోజూ మీకు చెబుదామనుకుంటూనే - ఈ హాస్పిటల్ పనుల్లో పడి మర్చిపోతున్నాను
    ప్రస్తుతం కేర్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకుంటున్నాను

    ఔను- మన కవిడాక్టరు(విష్ణునందన్)గారు ఏ ఊర్లో ఉంటారు - హైదరాబాదేనా ?
    అయితే వారి నొకసారి దర్శించి నా బాధలు వెళ్ళబోసుకోవాలని ఉంది(నడుము నొప్పి కాళ్ళు లాగడం నడవలెకపోవడం,ఒళ్ళు నొప్పులు మొదలైనవి)

    రిప్లయితొలగించండి
  38. వసంత కిశోర్ గారూ,
    మీరు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఈ విషయం తెలిసి ఉంటే నిన్న మిమ్మల్ని కలిసేవాణ్ణి. టెస్టులు చేసి డాక్టర్లు ఏమన్నా రు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
    డా. విష్ణునందన్ గారు ఎక్కడుంటారో నాకు తెలియదు. కానీ రాజమండ్రి లేదా గుంటూరులో ఉంటారేమో.
    మీ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  39. కటకట యెన్ని కష్టములు గల్గెను పాపము వృద్ధజీవికిన్
    పటువగు పండ్లు రాలగనె పప్పులు కొర్కుట కష్టమాయెనే
    కిటకిట బస్సు లెక్కుటకు క్రిందను మీదను పట్టు చిక్కదే
    చిటపట చిందు లాడుటకు "జీవనసాథి"యు పారిపోయెనే :(

    రిప్లయితొలగించండి
  40. కటకట యెన్ని కష్టములు గల్గెను నాకిట హైద్రబాదునన్
    చటుకున చూడ గోరుచును జాప్యము చేయక చార్మినారునున్
    కిటకిట లాడు బస్సునను క్రిందను మీదను త్రోసి దూరగా
    పటువగు భామ బుర్కనిడి పర్సును దోచుచు పారిపోయెనే
    😢

    రిప్లయితొలగించండి