10, అక్టోబర్ 2015, శనివారం

పద్యరచన - 1029

కవిమిత్రులారా, 
“భర్త భరించెడివాఁ డఁట...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

57 కామెంట్‌లు:

  1. భర్త భరించెడివాఁ డఁట
    పూర్తిగ గృహభారమతని భుజముల పైనన్
    కర్తవ్యంబుగ మోయుచు
    స్పూర్తిగ నిలబడవలెనట చోద్యముగాదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. భర్త భరించెడు వాడట
    కర్తయు, కర్మయు యతండు కలికికి తోడై
    వర్తించెడువా డటస
    ద్వర్తన గలపెనిమిటంటు వసుధన నిలుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘విరించి’ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కర్మయు నతండు... వసుధను...’ అనండి.

      తొలగించండి
    2. భర్త భరించెడు వాడట
      కర్తయు, కర్మయు నతండు కలికికి తోడై
      వర్తించెడువా డటస
      ద్వర్తన గలపెనిమిటంటు వసుధను నిలుచున్

      తొలగించండి
  3. భర్త భరించెడి వాఁడఁట
    కర్తవ్యము మరువ కుండ గాంచును గీమున్
    మర్త్యుని గృహస్తు ధర్మమె
    స్పూర్తిగ దారా సుతులకు శుభముల నిచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాస తప్పింది.

      తొలగించండి
    2. నమస్కారములు సవరించిన పద్యము
      ----------------------------
      భర్త భరించెడి వాఁడఁట
      కర్తవ్యము మరువ కుండ గాంచును గీమున్
      కర్తగ గృహస్తు ధర్మమె
      స్పూర్తిగ దారా సుతులకు శుభముల నిచ్చున్

      తొలగించండి
  4. భర్త భరించెడి వాడట
    కర్తవ్యంబును విడువక గబగబ చేయున్
    పూర్తి యటంచును నాతని
    స్ఫూర్తిగ గొందురు మహిళలు పుడమిన గనుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పుడమిని’ అనండి.

      తొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    (ఆతఁడు సాధారణ "భర్త"యా? ఆ సకల జగత్సర్వభర్త విష్ణుం డందఱకు సుఖదుఃఖములనుం దరిఁజేర్చుచు నుండ, నతని నే నిటులఁ గొలుతును)

    భర్త "భరించెడివాఁ" డట!
    హర్తాఘో ర్వీబిభర్తి తానర్తకపా త్రో
    న్నర్తిత పాద ఫణాగ్రో
    ద్వర్తక మర్త్యాళి దుఃఖ తారకుఁ గొల్తున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పద్యం శబ్దాడంబరంతో విలసిల్లుతూ అలరింప జేసింది. అభినందనలు.
      దయచేసి ప్రతి పదార్థాలను పోస్ట్ చేయగలరు.

      తొలగించండి
    2. ధన్యవాదములు శంకరయ్యగారూ!

      మీ కోరిక ప్రకారమే నేనీ దిగువన నా పద్యమునకుం బ్రతిపదార్థము నిచ్చుచుంటిని...

      >>ఆ "భర్త"యన సాధారణ భర్తయా...పృథ్వీపతి...విష్ణువు...(నేను విష్ణుపరముగనే వ్రాసితిని)...
      భర్త = (భూదేవీ) పతి (=విష్ణువు)
      భరించువాఁడు+అఁట = భూ సంబంధమైన సకల భారములను మోయునంట (అంతియ కాదు)
      అఘ హర్త = పాపములను హరించువాఁడఁట
      ఉర్వీ బిభర్తిత+ఆనర్తక పాత్ర = జగన్నాటక సూత్రధారక పాత్రధారియఁట
      ఉత్+నర్తిత పాద ఫణ+అగ్ర+ఉత్+వర్తక = కాళియ ఫణాగ్రముపై నర్తించునట్టి యున్నత పాద ప్రవర్తకుఁడఁట
      కావున...
      మర్త్య+ఆళి దుఃఖ తారకున్ =మానవ ప్రకరమును దుఃఖములనుండి తరింపఁజేయునట్టి (యున్నతుఁడయిన) నా విష్ణువును
      కొల్తున్ = నేను సేవింతును!

      స్వస్తి

      తొలగించండి
    3. మధురకవి మిత్రమా మధుసూదనా నమోనమః

      తొలగించండి
  6. భర్త భరించెడి వాఁడట!
    వర్తనమున నిందలొదువఁ బాడియె సతికిన్?
    కర్తయె గాని యవనిజన్
    రిక్తము పాల్జేసెఁ గాదె! శ్రీరాముండున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు.
      ప్రాసలో దొరలిన పొరపాటుకు చింతిస్తూ , నాల్గవ పాద సవరణతో:
      భర్త భరించెడి వాడట!
      వర్తనమున నిందలొదువఁ బాడియె సతికిన్?
      కర్తయె గానట్టి కుజ నొ
      కర్తెన్ వనవాసమంపె కరుణామయుడే!

      తొలగించండి
    3. ప్రాస దోషమును సవరించిన పిదప మీ పద్యము మఱింత శోభిల్లుచున్నది. ధన్యవాదములు...శుభాభినందనలు!

      తొలగించండి
  7. భర్త భరించెడివాఁ డఁట
    భర్తను మఱి బాగు జూడు భార్యయు గలదే ?
    కర్తవ్యము బాధ్యత లవి
    భర్తయు భార్యయు దెలుసుకు బ్రదుకగ వలయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కొన్ని శబ్దదోషాలున్నవి. ‘బాగు జూఛు, దెలుసుకు..’

      తొలగించండి
  8. శ్రీ గుండు మధుసూదన్ గారికి నమస్సులు.
    అద్భుతమైన పద్యము రచించారండీ.

    భర్త భరించెడి వాఁడఁట
    కర్తవ్యము దాల్చి తనదు కాంతామణికై
    వర్తించు రక్షకుండై
    ధూర్తుఁడు కాబోడు గాదె తోయ్యలి కొఱకై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      గుండు పద్యాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. ఆ విషయాన్ని వారి పద్యం క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరం’ను క్లిక్ చేసి వచ్చిన బాక్సులో టైప్ చేయవలసింది.

      తొలగించండి
    2. ధన్యవాదములు సంపత్ కుమార్ శాస్త్రి గారూ!

      తొలగించండి
  9. భర్త భరించెడి వాడట
    వర్తించును తగిన కరణి వంశము కొరకై
    కర్త కుటుంబమున కెపుడు
    స్ఫూర్తినిడుసతీసుతులకు సొంపగు భంగిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. భర్త భరించెడివాఁ డఁట
    కర్త కుటుంబపరిపాలకాగ్రేశ్వరుడున్
    వర్తనభీకరరణసం
    వర్తకుడు కులాబ్ధిసోము వానిఁ దలుపరే

    రిప్లయితొలగించండి

  11. శ్రీగురుభ్యోనమః

    భర్త భరించెడివాఁ డఁట
    కర్తగ సృష్టించువాడు కమలాసనుడే
    హర్త మరి గరళకంఠుడు
    కర్తవ్యము లాచరింత్రు కార్యోన్ముఖులై

    భర్త = జగత్పతి (శ్రీమహావిష్ణువు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      సరిగ్గా ఈ భావంతోనే పద్యం వ్రాయాలనుకున్నాను. ఆ ఛాన్స్ మీరు కొట్టేసారు. భర్త, కొడుకు, అన్న (చంద్రుని షడ్రకుడు కదా!) అని వ్రాయబోయాను. మీ పద్యంలో ‘హర్త శివుడు తన అన్నయె’ అంటే అది పూర్తిగా నా మనసులో మెదులుతున్న పద్యమే అయ్యేది.
      సంతోషం. చక్కని పద్యం. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారూ ధన్యవాదములు.
      మీ భావనను పద్యరూపంగా ఆవిష్కరించ ప్రార్థన.

      తొలగించండి
    3. భర్త భరించెడువాఁ డఁట
      కర్త సుతుఁడు సర్వ సృష్టి కార్యంబునకున్
      హర్త శివుఁడు సోదరుఁడుగ
      వర్తిలు నీ పెంపుఁ దెలుప వశమే లక్ష్మీ!

      తొలగించండి
    4. తల్లీ లక్ష్మీ దేవీ!
      భర్త సకల భూభార భర్త;
      సుతుఁడు సకల సృష్టికర్త;
      సోదరుఁడు సకల (జనన మరణ దుఃఖ) హర్త [లయముం జేయుట ద్వారమున సకల దుఃఖములను హరించువాఁడు);
      ఈ ముగ్గురునుం గల నీ భాగ్యము మాకు వర్ణింపఁ దరమా?
      ఎంత చక్కని భావము నిమిడ్చిన పద్యమునందించితిరి శంకరయ్యగారూ!
      శుభాభినందనలు!
      స్వస్తి.

      తొలగించండి
  12. గురువుగారూ చక్కని పద్యమును చెప్పినారు. అభినందనలు.
    వర్తిలు = దీపమువలె ప్రకాశించు ఆను అర్థములో వ్రాసినారనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.
      'వర్తిలు' శబ్దానికి ఉండు, ప్రవర్తించు అని అర్థాలు..

      తొలగించండి
  13. భర్త భరించెడి వాడట
    కర్తవ్యము నీది కొనుము కాసులపేరున్
    భర్తా యన సతి, పతి కిం
    కర్తవ్యమ్మనుచు మూల్గు కనరే వానిన్.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    (లేచింది మహిళా లోకం)
    భర్త భరించెడు వాడట !
    భర్తకు లోబడ వలెనరు ! ప్రస్తుత మింకన్
    వర్తించవట్టి మాటలు ;
    భర్తాధిక్యత గడింప పలికిరి పురుషుల్
    ------------------------------------------------
    కర్తించుచు నుద్యోగము
    భర్తకు దోహద పడు గృహ బాధ్యతలందున్ ;
    కర్తృత్వంబున తా నను
    వర్తించును ; తీసిపోదు పడతి మగనికిన్

    (కర్తించు = పని చేయు
    కర్తృత్వము = క్రియాశీలత
    అనువర్తించు = అనుసరించి నడుచుకొను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘లోబడవలె నరు...’?

      తొలగించండి
  15. భర్త భరించెడి వాడట
    నర్తన తలమీదనాడ సతి, శంకలతో
    వర్తిలి బాధలు వెట్టిన
    నార్తిని వెలిబుచ్చలేని యతడే భర్తౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘భర్త+ఔ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మగడౌ’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదమండీ మాస్టరు గారూ...మీరుచూపిన సవరణ తో...


      భర్త భరించెడి వాడట
      నర్తన తలమీదనాడ సతి, శంకలతో
      వర్తిలి బాధలు వెట్టిన
      నార్తిని వెలిబుచ్చలేని యతడే పతియౌ

      తొలగించండి
    3. గోలి వారూ,
      రెండవపాదంలోని యతిదోషాన్ని నేను గమనించలేదు. సవరించండి.

      తొలగించండి
  16. గురువుగారి పద్యం స్ఫూర్తితో....


    భర్త భరించెడి వాడట
    కర్తయె తానగును గాదె గాంచగ జగతిన్
    హర్తగ నడుపుచు గృహమున్
    వర్తిల్లుచు వెలుగు నింపు వల్లభుడెపుడున్!!!

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులారా!
    మన మిత్రులు భూసారపు నర్సయ్య గారు ఇప్పుడే ఫోన్ చేశారు. తాము తమ స్వగ్రామానికి వెళ్ళారని, అక్కడ ఇంటర్‍నెట్ అందుబాటులో లేక బ్లాగుకు దూరమయ్యామని, దసరా తర్వాత మళ్ళీ హైదరాబాదుకు వచ్చిన తర్వాతే బ్లాగును చూచే అవకాశం లభిస్తుందని తెలిపారు. బ్లాగు మిత్రులందరికీ తమ నమస్కారాలు అందజేయమన్నారు.

    రిప్లయితొలగించండి
  18. భర్త భరించెడి వాడట
    ఆర్తిని తీర్చంగ గ్రోలె నట గరళమ్మున్
    స్పూర్తిగ నిరువురి సతులను
    గుర్తుగ తన దేహమందు కోరి ధరించెన్

    రిప్లయితొలగించండి
  19. భర్త భరించెడి వాడట
    ఆర్తిని తీర్చంగ గ్రోలె నట గరళమ్మున్
    స్పూర్తిగ నిరువురి సతులను
    గుర్తుగ తన దేహమందు కోరి ధరించెన్

    రిప్లయితొలగించండి
  20. భర్త భరించెడివాఁ డఁట
    నర్తన తలపైన జేసి నవ్వెడి గంగన్
    కర్తృత్వము నాదనుచును
    వర్తించెడి గృహము నందు పార్వతి మదమున్ :)

    రిప్లయితొలగించండి


  21. భర్త భరించెడివాఁ డఁట
    నర్తన మాడవలె నీకు నచ్చిన సొబగై,
    ధూర్తుడగు విడిచి పెట్టగ
    సర్తు వదులునట్లు నతని చంపు జిలేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. భర్త భరించెడివాఁ డఁట
    కార్తిక మాసమ్మునందు గాఢపు చలినిన్
    పూర్తిగ మునుగుచు గంగను
    స్ఫూర్తిని గైకొనుచు గాంచి సుందరి యత్తన్

    రిప్లయితొలగించండి