14, అక్టోబర్ 2015, బుధవారం

పద్యరచన - 1033

కవిమిత్రులారా, 
“కవికలమున కున్న మహిమ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

42 కామెంట్‌లు:


  1. శ్రీగురుభ్యోనమః

    కవి కలమున కున్న మహిమ
    పవి కైనను లేకపోయె పరికింపంగా
    యవినీతుల ఖండిచును
    కవనామృత ధార బంచి కాచును జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పరికింపంగా| నవినీతుల...’ అనండి.

      తొలగించండి

  2. కవికల మునకున్న మహిమ
    రవికైనను లేదటంచు రాగము విరియన్
    కవనము లల్లగ సుందర
    దివిజులు వరమిడగ జనుల దీవించంగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నవి. అభినందనలు.
      ‘దీవించంగన్’ అనండి.

      తొలగించండి
  3. కవి కలమున కున్న మహిమ
    రవికిరణము కన్న మిన్న లక్షించంగా
    దివిభువి మెప్పించు నదియె
    కవనమ్ములు వ్రాయు కవుల కరదీపముగన్ !!!

    రిప్లయితొలగించండి
  4. కవికలమున కున్న మహిమ
    వివరింతునిట,దివి నారవి గనని దానిన్
    సవివరముగ వింత లెల్ల
    పవమానుని కన్న ముందె ప్రజలందరికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో బేసిగణంగా జగణం వచ్చింది. ‘సవివరముగ వింతలనే’ అందామా?

      తొలగించండి
  5. కవికలమునకున్న మహిమ కాంచతరమె
    కవుల మంచి కవనముల కారణమున
    కుటిల మౌప్రభుత్వములు వే కూలిపోవు
    ప్రజలుమెచ్చిన నేతకు పదవిదక్కు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      కందపాదాన్ని తేటగీతిలో అనువర్తించిన మీ పద్యం బాగున్నది అభినందనలు.

      తొలగించండి
  6. కవి కలమున కున్న మహిమ
    వివరింతును మీకు నిపుడు వివరము తోడ
    న్ర వికా ననిచో టులయు
    న్గ వికాంచును సత్య మిదియ కందివ రేణ్యా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘చోటులలో’ అనండి.

      తొలగించండి
  7. కవికల మునకున్న మహిమ
    వివరింపగవశముగాదు విజ్ఞుల కైనన్
    రవిగాంచని విష యమ్మును
    కవికలమే గాంచునంట ఘనమది గాదే

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      ("కావ్యం యశసే ఽర్థకృతే వ్యవహార విదే శివేతర క్షతయే సద్యఃపర నిర్వృతయే కాంతా సమ్మితత యోపదేశ యుజే" యను విషయ మెల్ల ఱెఱిఁగినదే కదా!)

      కవి కలమునకున్న మహిమ ఖరకరుఁ డీయంగ వెఱచు
      చెవికిడు నందమ్ము "కవిత" చెవిపోఁగు చెవికీయ డించు
      నవ నవోన్మేష శాలియగు నదియ నవ్యార్థ మందించు
      సవన భాతిగఁ దత్కృతి నిల శాశ్వతమ్ముగ నిల్వ నుంచు
      శివ సత్య సుందరము లిడు శ్రీ శివేతర హృతిఁ బెంచు
      వ్యవహార విదితంపు టెఱుక భవ్య కావ్యమ్మె యందించు
      కవికిఁ బరార్థ మందించి ఘనకీర్తి భువిలోనఁ బెంచు
      భవమందకుండంగ భువినిఁ బరము నందించి రహించు
      సువిదిత హిత సతి వలెను సూక్తులఁ బ్రేమ బోధించు
      కవికినిఁ బ్రియసుత యయ్యుఁ "గవిత" యీ జగము జయించు!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      ఆహా! కవిత్వ ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రయోజనాన్ని చక్కగా వివరిస్తూ మంచి పద్యాన్ని వ్రాశారు. కవితామాధుర్యాన్ని పంచారు. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములండీ శ్రీపతిశాస్త్రిగారూ!

      ***

      ధన్యవాదములు శంకరయ్యగారూ!

      తొలగించండి
  9. కవి కలమున కున్నమహిమ ఖడ్గమునకు
    కలదె చూడగ దేశపు గతియు మారు
    పాలకుల తీరు మార్చును పదును కలము
    రవి గననిచోటు కవి గాంచు రయముగ నిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  10. పద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో
    మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.
    కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు
    కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ
    కలము సాధించ గలదను కతను వినరె
    హింస శమియించు గాదె నహింస వలన
    పద్యరచన:కవి కలమున కున్న మహిమ పద్య ప్రారంభముతో
    మీకునచ్చిన చందములో పద్యము వ్రాయండి.
    కవి కలమున కున్న మహిమ కత్తి యెరుగు
    కత్తి సాధించ లేనట్టి క్షమయు,కరుణ
    కలము సాధించ గలదను కతను వినరె
    హింస శమియించు గాదె నహింస వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. కవి కలమునకున్న మహిమ
    వివరించగ నేరి తరము విశ్వము నందున్
    కవనమున పొగడు దేవుని
    యవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!
    (శివ పినాకిని: పోతన భాగవతం...
    sivapinakini.blogspot.com › 2011/04 › b...)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘దేవుని |నవనికి...’ అనండి. ‘దించగ నాగు’...?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      కవి కలమునకున్న మహిమ
      వివరించగ నేరి తరము విశ్వము నందున్
      కవనమున పొగడు దేవుని
      నవనికి దించంగ నాగు నతడే వ్రాయన్!

      సాక్షాత్తు దేవుని భూమి మీదకు దించగన్ ఆగున్ అతడే తనను చేత పట్టి వ్రాయుటకు. శ్రీరామచంద్రుడు పోతన భాగవతంలో 'అలవైకుంఠ పురిలో అనే పద్యం వ్రాశారు గదండీ.

      తొలగించండి
  12. కవికలమున కున్న మహిమ
    రవికిరణమునకును లేదు రవికరమెన్నన్
    పవలే శోభలనీనును
    కవికలసందీప్తి రేబగళ్ళును మించున్.

    రిప్లయితొలగించండి
  13. కవికలమున కున్నమహిమ
    అవిరళ సాహిత్య సేవ|నాలోచించన్
    వివరణ లొసగే విస్మయ
    దివిటీగా జీవితాన దీప్తిని బంచున్|
    కవికలమున కున్న మహిమ కల్మషములదులుపుటే|
    భవిత కుంచ గలుగునట్టి భావ బంధ మందునన్
    దివిగ మార్చనెంచబూను దివ్యమైన శక్తిచే
    సవినయాన కవిత లల్లి సాగుజేయు ధర్మమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘ఒసగే’ అన్నచోట ‘ఒసగెడు’ అనండి.

      తొలగించండి
  14. కవికలమున కున్న మహిమ
    కవిత్వమునకున్నశక్తి గట్టిగ చాటన్
    కవులందరుద్యమించుడు
    పవికన్న పదును కలిగిన పద్యములల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. కవి కలముకున్న మహిమలు
    రవి కాంచడు, కవికి దెలుసు రమ్యపుస్థలముల్
    రవి కవులిద్దరి లోనన్
    కవి గణపతి గొప్పకాడె కావ్యము రాసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మణ మూర్తి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కలముకు’ అనరాదు.‘కలమునకు’ అనాలి.

      తొలగించండి
  16. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కవికలమున కున్న మహిమ
      పవమాన సుతునకు లేదు పరికింపంగా
      రివురివ్వని పరుగులిడుచు
      తవిలి గిరీశముని చుట్ట దహియించునుగా!

      తొలగించండి
  17. కవికలమున కున్న మహిమ
    రవికిన్ లేదండ్రు కవులు రాసభ రీతిన్
    కవులది జంబమ్మిదిరా!
    రవికిన్ గల ఘోటకములు కవులకు గలవే?

    రిప్లయితొలగించండి