15, అక్టోబర్ 2015, గురువారం

పద్యరచన - 1034

కవిమిత్రులారా, 
“మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      ధన్యవాదాలు. ముందు ‘మగడా’ అన్నాను. ఎందుకో తనయా అని మార్చాను. సవరిస్తున్నాను.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మగడా! పోటు మగండ వీవెయని సంభావింప లేకుంటినే
      ప్రగతిన్ గోరవు మూఢువై ధనము సంపాదింప యత్నింపవే
      తగునా నీకిది? నీతి చెప్పగను సంతాపమ్ముతో నిత్యమున్
      జగడమ్మాడెడు వాడ వైతివి యనాచారమ్ము కోకొల్లలున్

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మూఢువై’ అన్నచోట ‘మూఢతన్’ అనండి. ‘సంభావింప’ను ‘సమ్మానింప’ అని మార్చారు.

      తొలగించండి
    3. నేను ‘సంభావింప’ గురించి వ్యాఖ్య పెట్టేలోగా మీ సవరణ వచ్చేసింది.

      తొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    (సత్యాపతి పారిజాతాపహరణ మొనరింపఁగా, మగఁటిమితో యుద్ధమొనర్చి, గెల్చి, యా వృక్షము మఱలంగఁగొని, నందనోద్యానమందుఁ బునః ప్రతిష్ఠింపుమని పౌలోమి, శచీపతినిం గోరిన సందర్భము)

    “మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప, నిప్పట్టునం
    దగ సత్యాపతిఁ బారిజాతనగహర్తన్, జంభవైరీ! సుసం
    యుగమందున్ బడఁగొట్టి, వేల్పుఁదరువున్ యోగ్యుండవై గెల్చి, యీ
    నగరోద్యానమునందునిల్పు మిపుడే, నాకౌకసుల్ మెచ్చఁగన్!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,

      సరసమ్మై తలయూచి యెల్లరు భళీ సాహో యటంచున్ ముదం
      బిరవొందన్ గణుతింపఁగా మధురసాహిత్యమ్ము సృష్టింతురే
      వరభావాంచిత సాధుశబ్దవిలసద్వాగ్ధారతో శంకరా
      భరణోద్యానపుఁ బారిజాత మన మీ పద్యమ్ము హృద్యమ్మగున్.

      తొలగించండి
    2. ధన్యవాదములు శంకరయ్యగారూ! నేనుం జేసిన యలఁతి కృతమున కనల్పమైన పద్య సత్కారము లభించుట మహద్భాగ్యము. శంకరాభరణోద్యానమందలి పారిజాతమని మీచేత నా పద్యము మెప్పు లందినందుల కెంతయు సంతసించుచు, మీకుఁ గృతజ్ఞతలను దెలుపుకొను....
      భవదీయుఁడు
      గుండు మధుసూదన్

      తొలగించండి
  4. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింపగా నీవిటుల్
    పగలున్ రాత్రులు మద్యపానరతిచే వ్యగ్రుండవై సంపదల్
    దెగ జూదమ్ముల నాడి మమ్మిటుల బాధింపన్ హితం బెట్లగున్
    తగ దీరీతి, కుటుంబసౌఖ్యమును జిత్తంబందు చింతింపుమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారూ,

      "ఇంటింటా మంటి పొయ్యే" యన్నట్లుగఁ బ్రతి యింట, భర్త కారణమున నిల్లా లేవేవో కొన్ని యిడుములం బడుట సహజము. అట్లే మద్యపానరతుఁడైన మగని వలని బాధలచే వేఁగలేని యిల్లాలి యావేదనమును గన్నులకుఁ గట్టినట్టుల వర్ణించిన మీ పద్య మమోఘము. అభినందనలు!

      తొలగించండి
  5. మగడా !పోటుమగండ వీ వెయని సంభావింప లేకుంటి నే
    ప్రగతిం జెందెద వంచు నే నిచట సంభ్రంబొం చుం మంటిగా
    నగవా నీకిది యేమిటిం దలతు లేనా నీ కు?నేనుంటి గా
    పగవాడైనను నీవలె న్నిటుల జంపంగా దొడంగూ ర్చునే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సంభ్రంబొంచుం, దొడంగూర్చు’ ప్రయోగాల పట్ల సందేహం...

      తొలగించండి
  6. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప నుద్రిక్తుడై
    మగువా వీరవ రేణ్యు ధర్మసతియున్ మాంచాల ప్రేరేపగన్
    పగవారిం దునుమాడ నెంచి చనె కోపావేశ సంరంభియై
    విగతాసుండయె బాలచంద్రు డకటా వీరుండు పల్నాడునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. మగడా!పోటు మగ౦డ వీవె యని సంభావింపగా,నెందరో
    మగువల్ జేసితి నా సపత్నులుగ, నిన్ మారుండు వేధింపగన్
    మగనాలిన్ జనకాత్మజన్ సుచరితన్ మాయన్ చెరన్ బెట్ట నీ
    కగచాటుల్ పతనమ్ము తప్పవు గదా నారామ బాణమ్ము చే

    రిప్లయితొలగించండి
  8. మగడా!పోటు మగ౦డ వీవె యని సంభావింపగా,నెందరో
    మగువల్ జేసితి నా సపత్నులుగ, నిన్ మారుండు వేధింపగన్
    మగనాలిన్ జనకాత్మజన్ సుచరితన్ మాయన్ చెరన్ బెట్ట నీ
    కగచాటుల్ పతనమ్ము తప్పవు గదా నారామ బాణమ్ము చే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప మా మండలిన్
    నగుబాటున్ పొనరించినావుకద! నన్నా బిడ్డడేడ్వంగనే
    తగునా పిల్వగ చెప్పు? నే వలయునా? తక్కుంగలారెల్లరున్
    మొగముల్ మాడ్చుక చూడరే? సతికి నీ ప్రోత్సాహ మందీయవే?

    రిప్లయితొలగించండి
  10. పద్యరచన

    గు రు మూ ర్తి అ చా రి
    .......................


    మగడా పోటు మగ౦డ వీవెయని స౦భావి౦ ప గా , నిన్ వరి౦.


    పగ , నర్తి౦చెడు నట్టి మద్ఘన నిత౦బ ద్వ౦ద్వమున్ జూడవు+ఏ

    పగు నా కుచ కు౦భముల్ గన వ దే రా ! రా ! పరిష్వ౦గ. మీ


    వొగి నీ రా ; కరగి౦చు శూర్పనఖ కామోన్మత్త. గోప్యా౦గముల్ ,


    మగుడన్, మన్మధకేళి లో దనిపి ; ఏలా జాగు ? మేలా యికన్ ?

    మగుడన్ : మాటి మాటి కి



    ి

    రిప్లయితొలగించండి
  11. మగడా పోటు మగండ వీవె యని సంభావింప నీగర్వమా?
    సగమై నుండగ నేనునీకు నిడు విశ్వాసంబు లేకున్నచో
    ఆగచాట్లందున భార్య,వంటకము నిత్యానంద భాగ్యంబులో
    దిగులున్ బెంచగ?దీను డై మనసునాదీ నాన జీవింతువా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘అగచాట్లం బడి...’ అనండి. ‘మనసునాదీ నాన’...?

      తొలగించండి
  12. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప సంఘమ్ములో
    నగబాటుల్గలిగించినావు కదరా! నాకర్మ! నీవింతగా
    దిగజారన్ పదిమందివచ్చి యిటులన్ తిట్టంగ బాగుండునా
    తగదీ రీతిగ స్త్రీలతో వెకిలి- నిర్ద్వంద్వంబుగా- వీడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు..

      తొలగించండి
  13. మగడా! పోటు మగండ వీవెయని సంభావింపగా గోరితే!
    రగిలెన్ గుండెలు రాష్ట్రమున్ దొఱగ నేలాభమ్ము లేకుండగన్!
    పొగిలే యోటరు నాడి తీరెరుగకన్ పోటీకి ముందుడగన్!
    తగిలెన్ పాపము యోటమై జనులు నిర్దాక్షిణ్యమున్ జూపగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సమస్య
    *గు రు మూ ర్తి ఆ చా రి *
    ----------------- --------

    క్షమి౦చ౦డి గురువుగారూ నా భావాన్ని క౦దము లో యిముడ్చలేక శార్దూల౦ వ్రాస్తున్నాను ఐనను మీ సమస్యాపాద నిర్మాణ౦
    చెడ కు౦డా మరియు నమస్యా పాద భావము
    తూ .చ .తప్పకు౦డా
    పూరి౦చాను


    ఊసుల్ కూసెను " మైకు " న౦దున ప్రచారోన్మాది యా శ్రీ న గ


    ప్రాసాద౦బు కడన్ - కడున్ విసుగు కల్గన్ జేయు చీ రీతిగా


    " యేసే య౦దరి దైవ మాయనకు మీ యీశు౦డు దాసు౦ డు మా


    యేసున్ నమ్మిన నా త్రినేత్రు డిక మీ కిచ్చున్ సిరుల్ స౦పదల్ "
    -----------------------
    శ్రీ నగ ప్రాసాదము : శ్రీ శై ల. దేవాలయ ము
    -----------------------


    .

    రిప్లయితొలగించండి
  15. సమస్య
    *గు రు మూ ర్తి ఆ చా రి *
    ----------------- --------

    క్షమి౦చ౦డి గురువుగారూ నా భావాన్ని క౦దము లో యిముడ్చలేక శార్దూల౦ వ్రాస్తున్నాను ఐనను మీ సమస్యాపాద నిర్మాణ౦
    చెడ కు౦డా మరియు నమస్యా పాద భావము
    తూ .చ .తప్పకు౦డా
    పూరి౦చాను


    ఊసుల్ కూసెను " మైకు " న౦దున ప్రచారోన్మాది యా శ్రీ న గ


    ప్రాసాద౦బు కడన్ - కడున్ విసుగు కల్గన్ జేయు చీ రీతిగా


    " యేసే య౦దరి దైవ మాయనకు మీ యీశు౦డు దాసు౦ డు మా


    యేసున్ నమ్మిన నా త్రినేత్రు డిక మీ కిచ్చున్ సిరుల్ స౦పదల్ "
    -----------------------
    శ్రీ నగ ప్రాసాదము : శ్రీ శై ల. దేవాలయ ము
    -----------------------


    .

    రిప్లయితొలగించండి
  16. మః మగడా! పోటుమగండవీవెయని సంభావింప దుర్బుద్ధితో
    మగనాలిన్ కడు కష్టపెట్టుచును సన్మార్గమ్ముఁబొకన్ సదా
    నగుబాటౌపనులెన్నియో సలుపుచున్నన్యాయంబుగాసాగ నీ
    జగమందిట్టిదురాత్ముఁగాంచమని సత్సంగమ్ముదూషించెగా

    రిప్లయితొలగించండి
  17. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప దోషమ్మయా!
    పగలున్ రాత్రియు నమ్మగారి యిరవున్ బంటయ్యి సేవించితే!
    తగునా నీకిది పప్పునున్ గనుచు తైతక్కంచు నర్తింపగన్
    దిగులున్ జెందుచు నాదు మానసము కుందించెన్ గ మన్మోహనా!

    రిప్లయితొలగించండి
  18. మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప బోకయ్యరో!
    తగునా! నీకిట బూది పూసుకొనుచున్ తైతక్కలాడంగనో?
    పగలున్ రాతిరి కృష్ణసర్పమును వే బాధించుచున్ దాల్చుటే?
    వగలాడిన్ శిరమందు నెత్తుకొనుచున్ వంగంగ భీతిల్లుటే?

    రిప్లయితొలగించండి