16, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1035

కవిమిత్రులారా, 
“కమలములవంటి కన్నులు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

44 కామెంట్‌లు:

  1. కమలములవంటి కన్నులు
    కమనీయపు చెలియ మోము గలగల నగవుల్
    సుమబాణములే విసరగ
    భ్రమియించిన మనమునందు రమణియె నిండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కమలములవంటి కన్నులు
      కమనీయపు నీదు మోము గలగల నగవుల్
      సుమబాణములే విసరుచు
      రమణీ నీపైన కోర్కె రాజేసినవే

      తొలగించండి
    2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. కమలముల వంటి కన్నులు
    కమనీయపు రూపు రేఖ గాంచిన చాలున్
    విమలము నిండిన మనసున
    మమతల సిరులెన్నొ పొంగి మన కిలవేల్పౌ

    రిప్లయితొలగించండి
  3. కమలములవంటి కన్నులు
    కమలాప్తసహస్రకోటికాంతియు, కమలా
    రమణీవిలసద్వక్షము,
    కమలాసనజనకనాభి గల హరి జేజే!

    రిప్లయితొలగించండి
  4. కమలములవంటి కన్నులు!
    రమణీ నీమోమునకు వరమ్మను పలుకుల్
    రమణా! మందు బిగించిన
    సమయమ్మున విన రివాజు సాలకు రమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. మాస్టరు గారూ చక్కని పూరణ చేశారు...నేనూ మీ బాట లోనే....

    కమలములవంటి కన్నులు
    కమనీయపు నీలి ఛాయ గలిగిన మేనున్
    కమలాలయ సరిజోడును
    కమలాసన సుతుని తోడు గలిగిన హరి ! జే !


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కమలములవంటి కన్నులు
    నెమిలి పురి సిగను వెలయగ, నెమ్మిగ బాణి
    న్నమరగ పిల్లన గ్రోవియె
    కొమరగు నీరూపు దలచి గొలిచెద కృష్ణా!!!

    రిప్లయితొలగించండి
  7. కమలములవంటికన్నులు
    విమలమైనట్టి మనసు ప్రియమగునవ్వున్
    సుమమునుబోలుతనువుతో
    సుమధురగాత్రమ్ముతోడ సుందరి యొప్పెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "విమలమ్మైనట్టి" అనండి.

      తొలగించండి
  8. కమలముల వంటి కన్నులు
    కమలములను బోలునట్టి కరముల తోడన్
    కమలాసన యగు నాసిరి
    కమలాక్షుని తోడ వచ్చి కరుణను జూపున్.

    రిప్లయితొలగించండి
  9. కమలముల వంటి కన్నులు
    నమలంబగు బాలనిచ్చు నతివకు చంబు
    ల్గనులకు గనబడినైనను
    మనమును దిగజారనీకు మనుజుడ ! యెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      "కనబడినన్ నీ... " అనండి.

      తొలగించండి
  10. కమలములవంటి కన్నులు
    నమలకుసుమకోమలారుణాంచిత పదముల్
    నెమలిశిఖమండితశిరము
    సుమదళ దామ వసుదేవ సుతునింగనరే
    [కన్నులును+అమల]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'నెమలి సిగ మెరయు శిరమును ' అనండి.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. “శిఖమండిత” సరియైన ప్రయోగము కాదా?
      గణదోషము లేద కద. నిన్నటి పద్యము లోను గణ దోషము లేదు. ఎందుకు ఉందని అంటున్నారు?
      “సుమదళ దామవ సుదేవ సుతునిం గనరే”

      తొలగించండి
    3. కమలములవంటి కన్నులు
      నమలకుసుమకోమలారుణాంచిత పదముల్
      విమలశిఖ మండిత శిరము
      సుమదళ దామ వసుదేవ సుతునింగనరే
      [శిఖ=నెమలిసిగ; విమలశిఖ మండిత శిరము: అన్నిసంస్కృత సమములే కద]

      తొలగించండి
    4. కామేశ్వరరావు గారూ,
      మన్నించాలి. నేనే పొరబడ్డాను. గణదోషం లేదు.
      సవరించిన పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. కమలముల వంటి కన్నులు
    భ్రమరాలను బోలు కురులు వదనమె శశి యై
    సుమధుర హాసము లొలికెడు
    రమణులె మది దోచు చుంద్రు ప్రక్రుతి విధంబున్

    (Kru is type mistake)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మగారూ,

      మీ పద్యము బాగున్నది. అభినందనలు!

      "కృ" ను వ్రాయుటకు kRu టైపు చేయవలెను. స్వస్తి.

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మగారూ,

      మీ పద్యము బాగున్నది. అభినందనలు!

      "కృ" ను వ్రాయుటకు kRu టైపు చేయవలెను. స్వస్తి.

      తొలగించండి
    3. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. ముఖ్యంగా రెండవ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ‘యశమును బెంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘యశము నొసంగన్’ అందామా?

      తొలగించండి
  13. లోకమంతయు జూపించు నీకునాకు
    కళ్ళు|”కనలేనివారికికాంతినింపు
    కళ్ళ దానముజేసియు కాటికేగ?
    కమలములవంటి కన్నులు గాంచగలవు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      పద్యం బాగుంది. కాని అది పద్యంయొక్క మొదటిపాదంగా ఉండాలి కదా!

      తొలగించండి
  14. కమలములవంటి కన్నులు
    యమపురి కేగుటకు ముందె యశము నొసంగన్
    తమ కళ్ళు దానమిచ్చిన?
    అమరికచే అంధ బ్రతుకులానందించున్|
    2.కమలముల వంటి కన్నులు గలిగి ఫలమ?
    రెప్పకావలి విడనాడ తప్పుజరుగు
    కల్మషాలచే నిండిన కలియుగాన
    తోడు,నీడయు లేకున్న? గోడుబెరుగు.

    రిప్లయితొలగించండి
  15. కమలముల వంటి కన్నులు గాంచగలవు
    లోకమంతయు జూపించు నీకునాకు
    కళ్ళు|”కనలేనివారికికాంతినింపు
    కళ్ళ దానముజేసియు కాటికేగ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన రెండు పద్యాలు, మూడవ పద్యం బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    కమలముల వంటి కన్నులు,
    తిమిరమ్మయె ఱెప్పలుగనుఁ, ద్రిణత బొమల్, ఘ్రా
    ణమె నువుఁబువు, బింబమె మో
    వి, మోము చందురునిఁ బోలు వెన్నునిఁ గనరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      విష్ణురూపాన్ని వర్ణించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. కమలములవంటి కన్నులు
    తమలమ్ములవంటి చెవులు తగరపు ముక్కున్
    సుమముల వోలెడి పండ్లును
    సమముగ నీ ముఖమునుండ సఖుడే పాఱున్ :)

    తగరము = నందివర్ధనము

    రిప్లయితొలగించండి


  18. కమలములవంటి కన్నులు
    జమలించు విశుద్ధ కుంద ఛాయపు మెరుపుల్
    ఘుమఘుమల పద్య సౌరభ
    ము మదిరనయన సొబగుల సముచిత జిలేబీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. కమలములవంటి కన్నులు
    విమలపు చెప్పులును మెండు వీధులు జవురన్
    చెమటలు గ్రక్కెడి మోమున
    సమరమ్మును జేసి గెల్చు శాంభవి దీదీ!

    రిప్లయితొలగించండి