24, అక్టోబర్ 2015, శనివారం

పద్యరచన - 1043

కవిమిత్రులారా!
“కటకట యిట్టి మాట లనఁగాఁ దగునే...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. * సమాజములో పెద్దమనిషి గా పేరుపొందిన ఒకతను ఓ పిల్లవాడు చేసిన చిన్న పొరపాటుకే ఉగ్రుడై విపరీతమాటలతో తిడుతూ కర్రెత్తి కొట్టబోయినట్టుగా నూహించి వ్రాసిన పద్యము

    కటకట యిట్టి మాటలనగా దగునే పొరపాటు నెంచుచున్
    కటువుగ మాటలాడుటయు కర్రను చేతధరించి కొట్టబో
    వుటయది ధర్మమే? సహన భూషణ ధారిగ కీర్తినొంది నీ
    విటులనొ నర్చుటేల,పసి పిల్లలు తప్పులు చేయ కుందురే

    రిప్లయితొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    (అల్లసానివారి మనుచరిత్రలో.... వంచనతో నాయుర్వేదవిద్యను నేర్చుకొనుటయే కాక, గురువునుం బరిహసించిన యిందీవరాక్షుని, గురువగు బ్రహ్మమిత్రుం డుగ్రుండై శపించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)

    "కటకట యిట్టి మాట లనఁగాఁ దగునే? కుటిలాత్మ! యిప్పుడీ
    వటమట మి ట్లొనర్చి, యిట వైద్యము నేర్చుటె కాక, గాటమౌ
    గుటగుట గుర్వులన్ గురువు గోసుదె? నీ విఁక రక్కసుండవై
    యటనట చియ్య నల్ల వస లన్నముగాఁ గొని కుందు మీ యెడన్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      పెద్దన వచనానికి చక్కని పద్యరూప మిచ్చారు. పద్యం అద్బుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. మధుసూదన్ గారి పద్యానికి ప్రేరణ అయిన పెద్దన వచనం నాకెంతో ఇష్టమైనది. నాకు కంఠస్థం. అది ఇది....

      వ. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి. (మను. 5-19)

      తొలగించండి
    3. ధన్యవాదములు శంకరయ్యగారూ! ఈ వచనము నాకుం గంఠస్థమే! నేనే యిచట నిద్ద మనుకొంటిని. ఇంతలోననే మీర లిచ్చినారు. కృతజ్ఞుఁడను.

      నా పద్యాంతమున...."కుందు మీ యెడన్!" అను దానిని "కుందు మిద్ధరన్!" అనవలెననుకొని టైపుచేయు తొందరలో మఱచిపోయితిని. దానిని మఱల నిట్లు ప్రకటించుచుంటిని. పరిశీలింపుఁడు.

      "కటకట యిట్టి మాట లనఁగాఁ దగునే? కుటిలాత్మ! యిప్పుడీ
      వటమట మి ట్లొనర్చి, యిట వైద్యము నేర్చుటె కాక, గాటమౌ
      గుటగుట గుర్వులన్ గురువు గోసుదె? నీ విఁక రక్కసుండవై
      యటనట చియ్య నల్ల వస లన్నముగాఁ గొని కుందు మిద్ధరన్!"


      స్వస్తి.

      తొలగించండి
  3. కటకట యిట్టి మాట లనగా దగునే మఱి నీకు నిప్పుడు
    న్గ టువుగ మాటలాడ నయగారమ యా రయంగ జెప్పుమా
    పటుతర వాక్పటిన్దనరు మాటలు బెక్కులు నైన పల్కుమా
    యటుల గుచో బె రున్గున ట యాయువు శ్రీలును సంతుయున్సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      పటిమను పటి అన్నారు. వాక్, మాటలు అని పునరుక్తి. ఆ పాదంలో యతి కూడ తప్పింది.

      తొలగించండి
    2. పటుతర సాధుమాటలుసభాస్థలిబెక్కువియైనబల్కుమా

      తొలగించండి
  4. శిశుపాలుడు ధర్మరాజ రాజసూయ యాగ సభలో కృష్ణుని నిందించు సందర్భము లో భీష్ముడు శిశుపాలుని తో పలికిన మాటలు:

    కటకట యిట్టి మాట లనఁగాఁదగునే చెపుమా సభాంతరన్
    పటుతర వృద్ద బాంధవ నృపాల గురూత్తమ ధర్మవేదులున్
    ఘటికులు వేద శాస్త్ర ఘన కౌశల దర్పిత విప్ర సంఘముల్
    ఘటనము సేయ యాగము వికారపు పల్కులు కృష్ణుడోర్చునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. కటకట యిట్టి మాట లనగా దగునే మఱి నీకు నిప్పుడు
    న్గ టువుగ మాటలాడ నయగారమ యా రయంగ జెప్పుమా
    పటుతరసాధు మాటలు సభా స్థలి బెక్కువి యైన బల్కుమా
    యటుల గుచో బె రుంగున ట యాయువు శ్రీలును సంతుయున్సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సభాస్థలిఁ బెక్కులుగాఁగఁ బల్కుమీ’ అనండి.

      తొలగించండి
  6. కటకట యిట్టిమాటలన గాదగునే గజగామినీననున్
    చిటపటలాడబోకుము విచిత్రపు వర్తనవీడుమో సఖీ
    నిటలమునందు సంతతము నిన్ను తలంచుచు మోదమొం దెడిన్
    పటుతరమైన కౌ గిలిన బంధనచేసి హుషారునీయవే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కౌగిలిని’ అనండి.

      తొలగించండి
  7. పద్యము:-కటకట యిట్టి మాటలనగా దగునే- పతి చాటు దాన నే
    నెటు లరుదెంచగా వలయు నిత్తరి నత్త శయించ లేదు నే
    నటు నడయాడ నూపురపు నాదము ఘల్లన మ్రోగె. నైననున్
    చిటిక నలంకరించుకొని జేరితి నీదరి నందనందనా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పద్యము:-కటకట యిట్టి మాటలనగా దగునే- పతి చాటు దాన నే
    నెటు లరుదెంచగా వలయు నిత్తరి నత్త శయించ లేదు నే
    నటు నడయాడ నూపురపు నాదము ఘల్లన మ్రోగె. నైననున్
    చిటిక నలంకరించుకొని జేరితి నీదరి నందనందనా

    రిప్లయితొలగించండి
  9. కటకట! యిట్టి మాటలనగా దగునే? వదినమ్మ! దానవుల్
    నటనల రామమూర్తి వలె నాదముఁ జేసిన నేనెరుంగనే?
    చిటపటలేల? వెళ్ళెదను! జిత్తులమారులు పెక్కురుందురీ
    యటవిన! జాగరూకతన నాగుము గీచిన గీతనందునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. *గు రు మూ ర్తి ఆ చా రి *

    కటకట యిట్టిమాట లనగా దగునే యను కర్ణు జూచుచున్
    పటపట పన్నులన్ గొరికి భార్గవు డిట్లు శపి౦చె " పొ౦గ. కీ వు + ీ
    అటమట మైన రీతి సకలాస్త్ర కళన్ గమని౦చి నాడవే
    చటచట బాణముల్ విడువ. జాలక చత్తువు మ౦దబుధ్దివై ,"ి

    ( అటమటము ; వ౦చనము )

    రిప్లయితొలగించండి
  11. కటకట యిట్టి మాట లనఁగాఁ దగునే రణరంగ మందునన్!
    చిటపట జేయు చుంటివి నిషిద్ధము చంపుట బంధులంచునో
    దిటవుగ నెంచి చూడుమిట దీటుగ రాజ్యమొ వీరనాకమో
    తటపటలాట మానుమిక ధాటిగ కూర్చుము గాండివమ్మునో

    రిప్లయితొలగించండి
  12. కటకట యిట్టి మాటలనఁగాఁ దగునే నడి వీధినందునన్!
    కుటిలపు జిహ్వ పేలగను కుండను బ్రద్దలు కొట్టుతీరునన్
    పటువగు మోడివర్యునిట భండన మందున చోరుడంచయో!
    గుటకలు మ్రింగు రాహులుడ! గుట్టుగ కోర్టుకు దండమిచ్చుచున్

    రిప్లయితొలగించండి