25, అక్టోబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1044

కవిమిత్రులారా!
“విను మిదె నా హితవాక్యము...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(భారతార్థంలో వ్రాయరాదని సూచన)

43 కామెంట్‌లు:

  1. రావణునకు మండోదరి హితబోధ...

    విను మిదె నా హితవాక్యము
    నినకులతిలకుండు రాముఁ డీలంకకుఁ జే
    టును గూర్చక మున్నె తగన్
    జనకాత్మజ నప్పగించి సౌఖ్యముఁ గనుమా!

    రిప్లయితొలగించండి
  2. విభీషణుడు రావణునితో...

    విను మిదె నా హితవాక్యము
    ఇనకులమణి శరణు వేడ హే రావణుడా !
    అనుజన్ముడ నినుగాచును
    జనకజనే తిరిగిపంప సరియగు బుద్ధిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘అనుజన్ముడ’ అనేది సంబోధన అయితే రావణుడు అగ్రజుడు కదా! నేను ‘అనుజన్ముడ’ను అనే అర్థంలో అన్వయలోపం అవుతుంది.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
      సవరణతో.....


      విను మిదె నా హితవాక్యము
      ఇనకులమణి శరణు వేడి హే రావణుడా !
      అనుజన్ముడ నేజెప్పితి
      జనకజనే పంపుమతడు చక్కగ బ్రోచున్.

      తొలగించండి
  3. వినుమిదె నాహిత వాక్యము
    ననయము మఱియా డబోకు నా త్మీ యుల తో
    న్గ నుముర యాపే కాట లు
    నినుజేయును దప్పకుండ నేర స్థుని గన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'పేకాటలు'...... 'జూదమ్ములు' అంటే అది నిగమశర్మకు అతని అక్క హితబోధగా అన్వయించుకోవచ్చు.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    (తననుం గామించి, తన కోర్కెఁ దీర్చుమను శూర్పణఖకు శ్రీరాముఁడు హితమును బోధించుట)

    వినుమిదె నా హిత వాక్య♦మును నీవు బుద్ధిఁ దలంచి!
    జనకాత్మజయ నాదు పత్ని! ♦ నినుఁ గొన! నేకపత్నీవ్ర
    తుని ననుఁ గోరక, నాదు ♦ ననుజునిం గోరియుఁ బొమ్ము!
    కనుము సౌఖ్యములు లక్ష్మణునిఁ ♦ గలసి! నీ కోర్కెయే తీరు!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ మధ్యాక్కర చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు!

      నా మధ్యాక్కఱ పద్యమందు యతిమైత్రికి బదులు ప్రాసయతి పడినది. దోషమును గమనింపకపోయితిని.

      నేనీ మధ్యాక్కఱను టైపు చేయునపు డే కళ/కల నుంటినో గాని, యతిమైత్రి స్థానమునఁ బ్రాసయతి నిడితిని. ఉపజాతి పద్యములే మెదలినవి కాఁబోలు; నిప్పటికి నేను చేసిన యీ పొరపాటు నా మనస్సునఁ గదలాడినది. పొరపాటు మీ క్రిందివిధముగ సవరించుచుంటిని.

      అయితే, దీనికి నాలుగవ గణాద్యక్షరము యతిమైత్రిగాఁ గుదురదు (దత్త పద్యపాదమున నీ యవకాశము లేదు) కావున, నన్నయగా రైదవ గణాద్యక్షరమును యతిమైత్ర్యక్షరముగ వాడియున్నందున, నేనును నైదవ గణాద్యక్షరమునే యత్రిమైత్ర్యక్షరముగ వాడుకొనుచుంటిని. గమనింపఁగలరు. ఇఁక నా సవరణమునుం బరిశీలింపుఁడు...


      "వినుమిదె నా హిత వాక్యమును నీవు ♦ విధిగఁ దలంచి!
      జనకాత్మజయ నాదు పత్ని! నినుఁ గొన!♦ సైకపత్నీ వ్ర
      తుని ననుఁ గోరక, నాదు ననుజుతోఁ ♦ దుష్టినిఁ బొంది,
      కనుము సౌఖ్యములు లక్ష్మణునిఁ గలసి! నీ ♦ కాంక్షయే తీరు!!"

      తొలగించండి
    3. గుండు మధుసూదన్ గారూ,
      మీరు దేనికైనా సమర్థులని ఇప్పటికి పెక్కు పర్యాయాలు నిరూపించారు. సవరించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  5. 1 .వినుమిదె నాహితవాక్యము
    తనయా!హరియని గిరియని దలచుచు భ్రాంతిన్
    ననయము దరుగకు మనుచా
    జనకుడు దెలిపెను సుతునకు చక్కగ తానున్.

    2.వినుమిదె నాహితవాక్యము
    చనకుము నొంటిగ నెపుడును చలువుల తోడన్
    వినకుము చాడీలను జీ
    వనమున తెలివిగ బ్రతుకుము వసుధన్ పుత్రా.

    3.వినుమిదె నా హితవాక్యము
    ధనమును యాశించు చడ్డ దారుల వెంటన్
    చనకుము ప్రాప్తంబైనదె
    మనకున్ దక్కుననునట్టి మాటను వినుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘అనుచు+ఆ=అనుచు నా’ అవుతుంది. ‘భ్రాంతి| న్ననయము దరుగకు మని యా| జనకుడు...’ అనండి.
      రెండవపద్యంలో ‘చలువుల’ అన్నచోట ‘సన్నిహితులతో’ అనండి.
      మూడవపద్యంలో ‘ధనమును+ఆశించు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ధనమున్ గోరుచును చెడ్డ...’ అనండి.

      తొలగించండి
  6. రావణుని తో హనుమంతుడు పలికిన పలుకులుగా నూహించిన పద్యము


    విను మిదె నా హిత వాక్యము
    దనుజాగ్రణి! రాముడు గుణధాముడతండే
    అనిభీముడు ఘనుడౌ యా
    యినవంశోత్తముని శరణు వేడిన చాలున్

    రిప్లయితొలగించండి
  7. నా రెండవ పద్యము:

    (రావణునితో నంగదుఁడు పలికిన హితోక్తులు)

    "విను మిదె నా హిత వాక్యము
    లనుఁ బది తలలఁ బది తలఁపులనుఁ గలిగెడి నీ
    కునుఁ గాలము మూఁడె! గనవు
    జననిని సీతఁ జెఱనుంప ౙరుగు నశుభముల్!"

    రిప్లయితొలగించండి
  8. మారీచుడు రావణునికి చేయు హిత బోధ. దానిని విని తిరిగి లంకకు చేరుకుంటాడు రావణుడు.
    విను మిదె నా హితవాక్యము
    చనుమీ లంకకు నతిప్రసన్నత దనరా
    దె నిజసతీ రాగంబున
    ఘనుడా రాముడు సభార్య కానల దనియున్

    వాల్మీకి రామాయణము: ఈ శ్లోకము నేను నిత్యము పఠించే వాటిలో యొకటి.
    ప్రసీద లఙ్కేశ్వర రాక్షసేన్ద్ర లఙ్కాం ప్రసన్నో భవ సాధు గచ్ఛ.
    త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామస్సభార్యో రమతాం వనేషు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర శర్మ గారూ,
      వాల్మీకి శ్లోకానికి మీ అనువాద రూపమైన పద్యం బాగున్నది. అభినందలు.
      ‘...దనరాదె...’?

      తొలగించండి
    2. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. తనరాదె “అతిశయించు” అనీ అర్ధములో. సరళాదేశమయితే.
      ప్రసన్నతన్ లో దృతముంది కదా

      తొలగించండి
    3. విను మిదె నా హితవాక్యము
      చనుమీ లంకకు నతిప్రసన్నత దనరా
      రు నిజసతీ రాగంబున
      ఘనుడా రాముడు సభార్య కానల దనియున్

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. విభీషణుఁడు రావణాసురునితో..........

    వినుమిదె నా హిత వాక్యము
    దనుజేంద్రా రామ విభుఁడు ధైర్యోత్సాహా
    గ్రణియై లంకాపురినా
    శనమును గావించు, ధరణిజను విడుమయ్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. బలిచక్రవర్తి తో శుక్రాచార్యుడు పలికిన పలుకులు గా

    వినుమిదె నా హిత వాక్యము
    దనుజేంద్రా! నా నుడులను దయతో వినుమా!
    కనుమీతడు కపట వటువు
    దనుజాంతక దీక్షధారి దామోదరుడే

    రిప్లయితొలగించండి
  11. వినుమిదె నా హితవాక్యము
    జనసేవను చేయనేత స్వార్థము తోడన్
    గని బుద్దుదు హింసయె మే
    లని బోధించె నిలను సవరణ గావించెన్

    రిప్లయితొలగించండి
  12. వినుమిదె నా హితవాక్యము
    జనసేవను చేయనేత స్వార్థము తోడన్
    గని బుద్దుదు హింసయె మే
    లని బోధించె నిలను సవరణ గావించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగుంది. సమస్యాపూరణకూ దీనినే వినియోగించుకున్న మీ ద్విముఖ ప్రావీణ్యం మెచ్చదగినది. అభినందనలు.

      తొలగించండి
  13. ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు:

    వినుమిదె నా హిత వాక్యము
    చినవాడవు విడువుమయ్య శ్రీహరి జపమున్!
    మన జాతికి వైరి యతఁడు
    నను దల్చిన నీకు శుభము నమ్మిక తోడన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. వినుమిదె నాహితవాక్యము
    ఘనుడగు రాముని జయించ కాంచకు కలలన్
    వినయముగా మహితాత్ము స
    తిని విడి తన శరణు వేడు స్థిరమగు భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. వినుమిదె నాహిత వాక్యము
    ఘనతను జేకూర్చు పనులు కలసియు జరుపన్
    మనుగడకే సార్థకమగు
    అని-మాగురు వర్యు డనెను |ఆరోజులలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘అనెను ఆ రోజులలో’ అని విసంధిగా వ్రాశారు. ‘...వర్యు డనియె నా రోజులలో’ లనండి.

      తొలగించండి
  16. వినుమిదె నాహిత వాక్యము
    కని పెంచిన వారి నీవు కలకాలంబున్
    కనికరమున పోషించిన
    నిను గుణ సంపన్నుడంద్రు నిజముగ మిత్రా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. విను మిదె నా హితవాక్యము
    కొనుచును చేతిని కృపాణి...గోరక్షకులన్
    పనుపుర స్వర్గమ్మునకును
    కనుగొని వోటరు మనమ్ము కమ్మగ సామీ!

    రిప్లయితొలగించండి
  18. వినుమిదె నా హితవాక్యము!
    కనుగొని యొక మన్మథుణ్ణి కాంగ్రెసునందున్
    రణమున నోడగ దిగులున
    పనిపాటలు లేని వాణ్ణి పట్టుము దీదీ!

    రిప్లయితొలగించండి