26, అక్టోబర్ 2015, సోమవారం

పద్యరచన - 1045

కవిమిత్రులారా!
“ఔరా కలయా నిజమా...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

37 కామెంట్‌లు:

  1. గురువు గారికి ప్రణామములు సుకవిమిత్రులకు అభినందనలు

    ఔరా! కలయా నిజమా!
    పోరాటము జేసి యలసి పోయిన గజమున్
    ఆరాటముతో బ్రోవగ
    మారమణుండేగు దెంచి మకరిని కూల్చన్

    మారమణుడు = లక్ష్మి భర్త విష్ణువు

    రిప్లయితొలగించండి
  2. ఔరా కలయా నిజమా
    మారాముడు గానబడెను నద్భుత ముం గా
    న్నీ రాతిరి కల యందున
    తారా ! మఱి నమ్ముమీ వు తధ్యం బిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కానీ కలలో అని స్పష్టంగా చెప్తూ కలయా నిజమా అని సందేహం వెలిబుచ్చడం వింతగా ఉంది.

      తొలగించండి
  3. ఘోషయాత్రలో
    ఔరా కలయా! నిజమా!
    పోరాటముచేయలేక భువుని సుతుండే
    పాఱెను రణభూమిని విడి
    కౌరవనాథుండు చిక్కె గంధర్వులకున్
    భువుడుః సూర్యుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఔరా! కలయా నిజమా
    ధారుణిలో నేతలెల్ల ధర్మోన్నతులై
    నేరావి నీతులను విడి
    యీ రాజ్యము నేలు చుండి రిది చిత్రంబే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఔరా కలయా నిజమా
    యీ రోజున జరిగె వింత యీ శుని గుడిలో
    కారుల హారను చప్పుడు
    ఆ రాత్రియు జెవుల సోకె నార్యా !వినుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఔరా కలయా నిజమా
    శ్రీరాముడు చనుట నారచీరలను జటా
    ధారి వనవాస మెనిమిది
    యారేండ్లు దశరధు పంపు నరయం గలమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కవి పుంగవులందరికి వందనములు. ప్రస్తుతము నేను రచియించుచున్న “పోచిరాజ తనయా వినుమా” మకుటముతో పునరుక్త సూక్తులతో శతకము లోని రెండవపద్యము ( మొదటిది శ్రీకారము.) పరిశీలింప గోర్తాను.

    సురులే జననీజనకులు
    గురువులు వారిని విడువ నిగూఢ సురులకున్
    నరులందయజూడగ రా
    దరమగునే పోచిరాజ తనయా వినుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ శతక పద్యం బాగున్నది.
      'సురుడు 'కు బహువచనం' సురలు'

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. గమనించలేదు. సవరించితిని.

      తొలగించండి
  8. రారాజు స్వగతం..మయసభలో.


    ఔరా కలయా నిజమా!
    యీ రచనా పటిమనుగన నిలనెవరయినన్
    తేరుకొనగలరె, మయసభ
    చారిమము హరించె నాదు స్వాంతము నెల్లన్!!!


    రిప్లయితొలగించండి
  9. ఔరా కలయా నిజమా?
    ప్ర్రెరణచే ప్రేమబిరిగి పెద్దలయందున్
    ధీరతగన బరచుచు
    మారెడి మమతానురాగ మాయనుగనుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం.

      తొలగించండి
  10. శ్రీరామదాసును బంధించిన నవాబు వారికి సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులు మారువేషములో వచ్చి ధనము నీయగ వారి భావన:

    ఒౌరా! కలయా! నిజమా!
    కారాగారముననుండ కంచర్లాఖ్యుల్
    శ్రీరామలక్ష్మణులిటుల్
    వారంపిరని సిరులొసఁగ పరవశమాయెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఔరా కలయా నిజమా
    రారాయని చేయిజాపి రాణీనీవే
    నోరారా పిలచితివా
    యీరోజుకు కరుణకలిగెనిదియే చాలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. ఔరా కలయా నిజమా
    చారెడు యటుకుల నొసంగ సంపద లా వి
    ప్రార్యున కొసంగెనట శ్రీ
    నారాయణుడీ జగతిన నందరు గనరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'చారెడు + అటుకు' లన్నపుడు సంధి నిత్యం. "చారె డటుకు లొసగి నంత సంపద...." అనండి.

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      ధన్యవాదాలు. నేను గమనించలేదు.
      "సంపద లెన్నో| పారున కొసంగెనట" అందాము.

      తొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    (శ్రీకృష్ణుని నోట బ్రహ్మాండమ్మునుం గనిన యశోద మనోగతము)

    "ఔరా! కలయా, నిజమా?
    శౌరి కలిత మాయొ? యేమొ? సంశోధింపన్
    దీరగు బాలుం డింతయె!
    నోరన్ బ్రహ్మాండ ముంటనో? యచ్చెరువౌ!"

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమః


    హనుమంతుడు లంకానగరమును తగులబెట్టిన తరువాత త్రిజట తన మనసున భావించినట్లుగా

    ఔరా కలయా నిజమా
    వీరాసురురెల్ల మిగుల విస్మయమందన్
    వారధి దాటుచు వచ్చెను
    శ్రీరాముని దూత యొకొడు సీతను వెదుకన్

    రిప్లయితొలగించండి
  15. "Gandhi's statue installed in London Parliament Square"

    ఔరా కలయా నిజమా!
    పోరాటమ్మాడియాడి పోరున గెలిచెన్
    భూరిగ లండను వాసుల
    కోరిక తీరంగ గాంధి గొప్పగ నిలిచెన్!

    రిప్లయితొలగించండి


  16. ఔరా కలయా నిజమా!
    ధారాళమ్ముగ పదములు ధగధగ లాడన్
    హేరాలమ్ముగ కందము
    లే రభసగ సాగె లివ్వు లివ్వు‌ జిలేబీ‌ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. ఔరా కలయా నిజమా!
    పోరగ నీ నెలవు కొరకు ప్రొద్దున రాత్రిన్
    తీరుగ హైందవ వాదుల
    కోరిక తీరెను ఘనముగ కోదండయ్యా!

    రిప్లయితొలగించండి