29, అక్టోబర్ 2015, గురువారం

పద్యరచన - 1048

కవిమిత్రులారా!
“ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

48 కామెంట్‌లు:

  1. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
    శాస్త్ర విజ్ఞానము మరచు చవటలార
    మూఢనమ్మకములు కల్గు మూర్ఖులార
    మంచి చెడులవిచక్షణ మరువకండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘నమ్ముచూ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘నమ్ముచున్’ అనండి. ‘శాస్త్రజ్ఞానమ్ము’ అన్నచోట ‘స్త్ర’ గురువై గణదోషం. ‘శాస్త్రవిజ్ఞానము మరచు చవట లంత’ అనండి. ‘గ్రహశాంతుల’ అన్నచోట గణదోషం. ‘గ్రహపు శాంతుల’ అనండి.

      తొలగించండి
    2. ఎన్ని చదువ ప్రయోజన మేమిగలదు
      ఇంచుకైనను సంస్కార మెరుగ లేని
      మూఢ విశ్వాస పీడితుల్ మూర్ఖజనులు
      కార్యకారణ బంధాల గనక వీరు
      తరతరాల యాచారబంధమున మునిగి
      మోసపోవుట గనుము దురాశ తోడ
      అడ్డదారుల నందల మందుకొనగ
      దొంగ యతులను నమ్ముచున్
      భంగ పడుచు
      శాస్త్రవిజ్ఞానము మరచు చవటలంత
      గ్రహపు శాంతుల జరిపించు ఖలురు వీరు
      విధిని దూషించు చుందురీ విదురమతులు


      గురువు గారికి నమస్కారములు
      నా దోషాలను సవరించి సూచనలనంద జేసినందులకు ధన్యవాదములు
      మీ సూచనల ప్రకారము సవరించిన పద్యము




      తొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు,
    హీనుఁ డవగుణమ్మును వీడు టెఱుఁగ కున్న?
    బొగ్గుఁ బాలను కడుగంగఁ బోవునె మలి
    నమ్ము? ప్రకృతి సిద్ధావగుణమ్ము సనునె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మంచి నీతిపద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ గుండు మధుసూదన్ గారూ, మంచి పద్యం. ప్రసిద్ధమైన ప్రాక్తన పద్య భావమును ' కవి స్వీయ పదములలో ' మరొక అధునాతన పద్యములో తెలపడమొక కళ. దాన్ని సాధించారు. అభినందనలు.

      తొలగించండి
  4. అందరికి నమస్కారములు.

    ఎన్నిజదివిప్రయోజనమేమి గలదు,
    జనన మరణాలదొలగించు చదువుజదువు.
    గురుదయగలుగు.నీజన్మఘోరదుఃఖ
    మిట్లుదీరును మేల్కొనుమిప్పుడైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భూసారపు నర్సయ్య గారూ,
      నీతిని బోధిస్తున్న మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఎన్ని చదువ బ్రయోజన మేమి గలదు
    దొంగ బుధ్ధు లు గలుగుచు దోచు కొనగ
    చావ బాదిరి యిసుమంత జాలి లేక
    సార్ధ కంబును జేయుడు చదువు నిలను

    రిప్లయితొలగించండి
  6. ఎన్ని"చదువ" అనిగమనించవలసినదిగాకోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  7. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
    మంచి చెడుల విశ్లేషణ కొంచమైన
    చేయకను నమ్ము చుండిరి చేతబడులు
    మూఢ నమ్మకముల కడు ముదముతోడ





    రిప్లయితొలగించండి
  8. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
    విబుధ జనవిధేయ విహీన వినయగుణ ర
    హితుడు సభ్యత సంస్కార హీను డైన
    విద్య నేర్చినఁ వాడొక వింత పశువు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సభ్యతా సంస్కార హీనుడైన...’ అనండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. సవరించితిని.

      తొలగించండి
  9. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
    కావ్యముల నెన్ని వ్రాసిన ఘనత యేమి?
    అర్థమునకే విలువనిచ్చి స్పర్థతోడ
    సాటి మనిషిని దిట్ట సంస్కారమగునె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ మిస్సన్న గారూ, మంచి పద్యం. అభినందనలు. ' మనిషి ' శబ్దం గ్రామ్యం కనుక - "సాటి మనుజునిఁ దిట్ట" అని అంటే చక్కగా సరిపోతుంది.

      తొలగించండి
  10. ఎన్ని చదువ ప్రయోజన మేమికలదు
    వక్రబుద్ధితో పయనించు వానికిలను
    సక్రమపు మార్గమును చేర్చ సాధ్య మగునె
    యెన్నియత్నముల్ సలిపిన నిచ్చ తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘సల్పిన’ టైప్ చెయ్యడం ఇబ్బంది పెట్టినట్లుంది.

      తొలగించండి
  11. ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు
    ఎన్నరెన్న డు నామాట విన్నదెవరు
    మిన్నకు౦దురు .నాసూక్తు లెన్నటికిని
    మన్ననల్ బొంద నేరవో యన్నలార

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘...గలదు| ఎన్న...’ అని విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  12. ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?
    సద్గుణమ్ములు లేకుండ చదువు లున్న
    నిష్పలంబగు నవియన్ని నిలను జూడ
    విద్య శోభిల్లు సతతము వినయమున్న!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘...యన్ని యిలను జూడ’ అనండి.

      తొలగించండి
  13. ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు
    ఎన్నరెన్న డు నామాట విన్నదెవరు
    మిన్నకు౦దురు .నాసూక్తు లెన్నటికిని
    మన్ననల్ బొంద నేరవో యన్నలార

    రిప్లయితొలగించండి
  14. ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు?
    ప్రగతి సాధించ నీనాడు భారతమున
    తగిన యవకాశములు లేక తరలు చుంద్రు
    పశ్చిమాంబుధి భానుని ప్రస్తుతింప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు వందనములు రాజుగారికి రె౦దవ భార్య ప్రీతికరము
      సహజమే కదా

      తొలగించండి
  15. ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదు
    ఎన్నికందున నోట్లచే నెన్ని కైన
    లంచమందున లక్ష్యాలు వంచనలకు
    కత్తి నెదురించు వెంట్రుకల్ పెత్తనంబె|
    2.ఎన్నిచదువ బ్రయోజన మేమిగలదు
    చదువు,సంస్కారమన్నవే పదవిజేర
    రెండు కళ్ళుగ నిలచిన నిండుదనము
    మానవత్వము జూపును మౌనమందె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      'ఎన్నిక +అందు ' అన్నప్పుడు సంధి లేదు.' ఎన్నికలలోన' అనండి.

      తొలగించండి
  16. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
    నేర్చుకొన్నది పాటించు నేర్పులేక!
    పుణ్య గంగా జలమ్ములు ముంచి పార
    శిలకు శిల్పమౌ పులకింత కలుగు నెట్లు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  17. * గు రు మూ ర్తి ఆ చా రి *

    ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ?
    మహిని స౦స్కృతీ హీనుడు మాన్యు డగునె
    ఎన్ని భూష లల౦కృతు లున్న. గాని
    ఖరము జూచిన నెవ్వరుగౌరవి౦త్రు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ గురుమూర్తి గారూ, సంస్కృతి, సంసృతి ఇత్యాదులు ఇకారాంతములే. కనుక పైపద్యములో ' సంస్కృతి హీనుండు ' అనే అనండి. గణములు కూడా సరిపోతాయి.

      తొలగించండి
  18. ఎన్ని చదువ ప్రయోజన మేమి గలదు ?
    గౌరవమ్ము జూపకున్న ఘనత కాదు
    పెద్దలందున జూపుము వినయ మెపుడు
    ఖ్యాతి నందగలవెపుడు ఖచిత మిదియు/ధాత్రి యందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'ధాత్రి యందు ' అంటే యతిదోషం.

      తొలగించండి
  19. నమస్సులండి.నేను " తి "కు "త్రి "కు ప్రాసయతి సరిపోతుందనుకొన్నానండి.

    రిప్లయితొలగించండి
  20. ఎన్ని చదువఁ బ్రయోజనమేమి గలదు
    గుణ రసజ్ఞత లేనిచోఁ గొంచెమైన?
    పాకమును వండి యొక యుప్పు పలుకు వేయ
    కున్నచో రుచి పుట్టునే యుదహరింప!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      మధుసూదన్ గారిని ప్రశంసిస్తూ మీరుకూడా అదే బాటలో భాస్కర శతక పద్యభావాన్ని చిన్న పద్యంలో సమర్థంగా ఇమిడ్చారు. అభినందనలు.

      తొలగించండి
  21. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
    వినయ మించుకైనను లేక విర్ర వీగ
    దర్ప మొందగ నెవరు నీ దరికి రారు
    మంచి మనుగడ లేకున్న మనిషి గాడు.

    ఎల్ల లుండవు విద్యకు నేర్వ జూడ
    భుక్తి కొరకు గాక చదువు భక్తి తోడ
    మెచ్చుదురు నిన్ను పెద్దలు మేటి యనుచు
    పిన్నలందరు గాంతురు పేర్మి తోడ.

    రిప్లయితొలగించండి
  22. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు!...
    ఎచటి నుండి రాకయొ మరి యెందు పోక?
    ఎరుగ లేముర శాస్త్రము లెన్ని నరయ...
    లోన జూడుము వెదకుము జ్ఞాన మొదవు :)

    (పాదాంతమున ఉత్వ సంధి ఉల్లంఘనము)

    రిప్లయితొలగించండి


  23. ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు?
    కూడు విద్వత్తు బుద్ధియు కూడు నమ్మ
    చేరుదురు మంచి వారలు చేద వచ్చు
    వారి యండదండలనెల్ల వరము గాన !

    జిలేబి

    రిప్లయితొలగించండి