30, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యరచన - 1049

కవిమిత్రులారా!
“సామాన్యుఁడు వీఁ డనుకొని...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

42 కామెంట్‌లు:

  1. సామాన్యుఁడు వీఁ డనుకొని
    యేమాత్రము తనకు దానమివ్వకు రాజా
    యా మాయా దైత్యారియె
    వామనునిగ వచ్చె నిన్ను వంచించుటకై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. అశోకవనమును నాశనం చేసిన హనుమంతుని యెంతో ప్రయాసతో మేఘనాథుడు పట్టి తేవడాన్ని గాంచిన రావణుడు మదిలో కాస్త భయపడి తనలో తాను అనుకుంటున్న మాటలుగా నూహించిన పద్యము


    సామాన్యుడు వీడను కొని
    యేమాత్రము లెక్కజేయ కెందరొ భటులన్
    రామాంకితుడనని పలుకు
    భీమ బలుని పాలు జేసి బీరుడ నైతిన్ .

    రిప్లయితొలగించండి
  3. సామాన్యుఁడు వీఁ డనుకొని
    ధీమంతులు ఢిల్లిలోన ధీమాజూపెన్
    సామాన్యుడె సాధించెను
    సామజపురికిన్ ఘనతర సామ్రాట్టయ్యెన్!!

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    సామాన్యుఁడు వీఁడనుకొని
    యేమాత్రము లెక్క నిడక యేమఱి యుండన్
    భీమానుజుఁ డా హరికి "న
    మామి" యనియు, మత్స్యయంత్ర మనువునఁ గొట్టెన్!

    రిప్లయితొలగించండి
  5. సుకవి మిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మీకు మీ కుటుంబమున కా భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్య సుఖ సంతోష శాంతులను, శుభములను, సత్వరకార్యసాఫల్యతల నొసఁగుఁ గాత! _/\_

    రిప్లయితొలగించండి
  6. సత్య నారాయ ణా గురు సముడ !నీకు
    జన్మ దినపుశు భదినాన శంక రుండు
    ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటి కిని రెప్ప యట్లయి కాచు గాత !

    రిప్లయితొలగించండి
  7. సామాన్యుడు వీ డనుకొని
    యేమాత్రము విడిచి బెట్ట కీ గది నుండి
    న్బాములచే గఱపించుచు
    బాములకున్లోను జేయు వాలాయము గాన్

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    జన్మదిన శుభాకాంక్షలు!

    అనఘ! కవివరేణ్య! అన్నపరెడ్డి వం
    శాబ్ధి పూర్ణచంద్ర! ఆప్తమిత్ర!
    జన్మదినమునాడు సత్యనారాయణ
    రెడ్డి! కలుగు శుభము లడ్డు లేక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. సామాన్యుడు వీడనుకొని
    యేమారకుడెప్పుడైన నింగిత బుద్ధిన్
    వామనుడెవడో కాచెడు
    రాముండెవడో నెరుంగు భ్రమలు తొలంగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. సామాన్యుఁడు వీఁ డనుకొని
    శ్రీ మురళీ ధరునిమట శిశుపాలుండున్
    ఏ మాత్రములేక్కించక
    దీమసమున తిట్ట జంపె దేవుండతనిన్.

    రిప్లయితొలగించండి
  11. సామాన్యుఁడు వీఁ డనుకొని
    శ్రీ మురళీ ధరుని మాట శిశుపాలుండున్
    ఏ మాత్రములేక్కించక
    దీమసమున తిట్ట జంపె దేవుండతనిన్.

    రిప్లయితొలగించండి
  12. సామాన్యుఁడువీఁడనుకొని
    సామీరిని పట్టఁజూచి చతికిలబడియెన్
    భీమబలులైన యసురులు
    కామాంధుడు రావణుండు కలవరపడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. సామాన్యుఁడు వీఁ డనుకొని
    యా మనుజాశన బకాసు రాధము డచటన్
    భీముంగని భీషణ సం
    గ్రామమునన్ ధృతి సెడి సనె కాలుని కడకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  14. *గు రు మూ ర్తి ఆ చా రి *
    -------------------------

    నారదముని, హిరణ్యకశిపునికి ప్రహ్లాదుని చ౦పివేయమని
    సలహా నచ్చుట. :-
    ................. .... .... .. ...

    సామాన్యుడు వీడనుకొని
    హేమ కశిప ! ప్రేమజూపు చీవే మాత్ర౦
    బేమరకు ; చ౦ప వలయు ;
    న్నా మాధవు డావహి౦చె హ్లాదకుమారున్

    ి

    రిప్లయితొలగించండి
  15. సామాన్యుడు వీడనుకొని
    ఈ మాత్రపు చనవు నిచ్చి యెద జేర్చు కొనన్
    ఆమురళీ ధరుడా గొల్లెత
    మోమున మోము౦ఛి ముదిత మోహిత జేసేన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘ఆ మురళీధరు డాయమ’ అందామా?

      తొలగించండి
  16. 1.సామాన్యుడు వీడనుకొని
    సామాన్యునిచేరదీసి సంబర పడగన్
    గోముగ చెంతకు చేరుచు
    సామముగా మాట లాడి సర్వము దోచెన్.

    2.సామాన్యుడు వీడనుకొని
    యీమతకరి మాటవిన్న యేలును జగముల్
    నా మాటలు విను యొసగకు
    భూమిని యన్న బలి వినక పుడమినొ సంగెన్.

    3.సామాన్యుడు వీడనుకొని
    జామాతను చేసుకొన్న చతురత తోడన్
    యేమార్చుచు నెల్లరనట
    మామా యని ప్రేమ జూపి మాయలొ ముంచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపద్యంలో ‘నా మాటలు విను మొసగకు| భూమి నటన్న....’ అనండి.
      మూడవపద్యంలో ‘మాయలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘మాయను ముంచెన్’ అనండి.

      తొలగించండి
  17. సామాన్యుడు వీడనుకొని
    ఏమాత్రము యూహలేక ఎవరెష్టేక్కన్
    ధీమాగల ధీరులు నిల
    సామాన్యులయందుగలరు సర్వోత్తములై.
    2
    ఈరోజు ప్రేముకుల పెళ్లిగురించిన పూరణం
    సామాన్యుడు వీడనుకొని
    ప్రేమగ మధుబాలయుండ ?పెళ్లికి శ్రీకాంత్
    కామా లేకను జరిపెను
    ధీమాయగు పెళ్లి నేడు దిగ్గున జరిగెన్.

    రిప్లయితొలగించండి
  18. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యంలో ‘ఏమాత్ర మ్మూహలేక.... ధీరు లిలను...’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. సామాన్యుఁడు వీఁ డనుకొని
    జామాతను చేర దీసి సరసము లాడన్
    ప్రేమాతిశయమున ఘనుడు
    మామను తొలగించి వాని మకుటము గుంజెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. సామాన్యుఁడు వీఁ డనుకొని
      ఆ మనమోహనుడి పయిన నాటవిడుపుగా
      "కోమల" పద్యము లల్లన్
      సామీ సభలో సమస్య సాతాళించెన్ :)

      జిలేబి

      తొలగించండి
  20. సామాన్యుఁడు వీఁ డనుకొని
    ధీమాతో మెండు నోరు తెరువుర యనగా
    కోమలి యశోద బెదరగ
    గోముగ విశ్వమ్మునంత గొంతున జూపెన్

    రిప్లయితొలగించండి