31, అక్టోబర్ 2015, శనివారం

పద్యరచన - 1050

కవిమిత్రులారా!
“ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(కాటేపల్లి సీతారామ మూర్తి గారికి ధన్యవాదాలతో...)

24 కామెంట్‌లు:

  1. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు మర్చిపోయిరో
    చీకుయు చింతలేవి దరిజేరని బాలుర మంచెరుంగకన్
    భీకర రూపమెత్తి యరివీరులు పెద్దలు మాటిమాటికిన్
    కేకలు వేసిమమ్ములను కిమ్మననీయరు పెక్కుయాంక్షలున్
    మాకొరకై విధింతురు ప్రమాదమనంచును బంధిసేతురే

    రిప్లయితొలగించండి
  2. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తు వచ్చెనే
    యీ కబడిన్గ నంగ మఱి యీ యది సంతస మొప్పె యిప్పుడు
    న్భీ కర మైన యాట యిది వేగమె రమ్మిక రామజోగి !నే
    వేకువ జామునే యిటకు వేగమె వచ్చితి దీని జూడగన్

    రిప్లయితొలగించండి
  3. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పల్లెటూరులో
    నాకును గుర్తు కున్నవిక నా తలిదండ్రులు నాదు బాగుకై
    చీకటి రోజులన్ గడిపి చింతలు నాదరి చేరకుండ నా
    వీకును గోరి వారు చదివించిరి యా ఋణ మెట్లు దీర్తునో !.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు సంతసంబుగన్
    మ్రాకుల తోటలందిరిగి మక్కువ నూయలలూగి నంతప
    ద్మాకర మందునీది విగతశ్రము లై ఘన మోదమొప్పగన్
    చీకటి క్రమ్మకుండనిలు చేరహముల్ మరు వంగ వచ్చునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు, నాదు బాల్యమున్
    న్నా కనుమూసి గంత, లిక నత్తనకాయలు, నట్లతద్ది నా
    డా కికురింత యాటల విహారము లూయల లూపు నేస్తముల్
    నాకిపు డిచ్చి, గైకొనుము నా సిరి సంపద సంప్రతిష్ఠలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు గుర్తురావె యా
    పేకలె లోకమంచు నదె వేడుక జేసెనె లాభమందినన్!
    పైకము పోయెనా వగచి వద్దని లేచెడుఁ జింతజేయవే?
    యేకడ పోయెనో నచటె యెంచెద నంచును నాశమైతివే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఆకలి దప్పులున్ మఱచియాడిన రోజులు నేడురావుగా?
    సాకుల సంతసాన మనసందున జేరిన లక్ష్య సాధనా
    లోకము లాడురీతులు-తలోనొక మార్గములెంచి పంచగా
    దూకుడు నందు నాడుటన దోషముగాదది బాల్య బంధమే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'తలోనొక'.....?

      తొలగించండి
  8. ఆకలిదప్పులన్ మఱచి యాడిన రోజులు వచ్చిగుర్తుకున్
    నాకగుపించెసౌరికము నాటియమాయక బాల్యమందునన్
    శ్రీకరమైన పల్లెలను చేరెమనస్సు ముదమ్ముతోడుతన్
    సోకగ నేడు పట్టణపుసోకులు సంస్కృతి నాశమయ్యెగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఆకలి దప్పులన్ మరచి యాడిన రోజులు జేయునల్లరుల్
    కోకిల పాటతో సరిగ గొంతును గల్పిన తీపి సందడుల్
    చేకొని నాన్నవేలి కొస చింతనెరుంగని చిద్విలాసముల్
    శ్రీకర! వేడుకొందునిను చెన్నుగ నీయవె నాదు బాల్యమున్!!!

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు తీపిగుర్తులై ,
    తోకలు లేని కోతులయి తోటల గెంతిన యాటపాటలన్,
    నేకరు బెట్టుచున్ గడుపు నీనవ జీవపు పట్నవాసమున్,
    లోకము మారిబాల్యమది లోటుగ మారెను జీవనంబునన్

    రిప్లయితొలగించండి
  12. కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మనలో మాట 🤫

    ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు పారిపోవగా
    నూకల కోసమే నమిలి నోట్సులు మింగగ యూనివర్స్టిలో
    ఆకలి తాళజాలకిక "అమ్మ"ను కొల్వగ ఖర్గపూరులో
    రూకలు చాలిచాలకయె రుక్మిణి వచ్చెను హాయిహాయిగా!!!

    రిప్లయితొలగించండి
  14. ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు;...క్లబ్బునందునన్
    మూకల జేరదీయుచును ముచ్చట లాడుచు ముద్దుముద్దుగా
    పేకలు కల్పి పంచుచును బీరును గ్రోలుచు బీడి పీల్చుచున్
    పోకరు నాడు తోషమహ;...పోయెను పోయెను భార్య రాకతో

    రిప్లయితొలగించండి