16, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1826 (యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

44 కామెంట్‌లు:

  1. ఏసనగ ప్రమద గణమట
    యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
    ఏసును నీశుడు నొకటని
    వాసిగ తెలిపెదరు బుధులు వాదన లేలన్

    రిప్లయితొలగించండి
  2. ఆసలు దీర్చగ జగతికి
    వాసిగ తాపంపె సుతుని భగవానుండే
    నీశుని దూతగ వచ్చిన
    యేసుని నమ్మిన ద్రినేత్రు డిచ్చును సిరులన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భగవానుండే| యీశుని..’ అనండి.

      తొలగించండి
  3. ఏసన యోగీశ్వరుడే!
    పూసెను దివ్యాక్షువొకటి భ్రూకుటి యందున్!
    ధ్యాసను వీడక కొలచుచు
    నేసుని, నమ్మిన ద్రినేత్రుడిచ్చును సిరులన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. కేశవ నేనిటు జెప్పితి
    ఈశుని నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.
    చూసితివ నీదు వ్రాతను
    "యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్".

    రిప్లయితొలగించండి
  5. ఏసురహీమున్ రాముడు
    యేసామైనను భజించ యిచ్చును ముక్తిన్
    దోసములు లేని మదితో
    యేసును నమ్మిన త్రినేత్రుడిచ్చును సిరులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రాముడు + ఏ అన్నప్పుడు యడాగమం రాదు. "రాముం | డే...." అనండి. 'భజింప నిచ్చును' అనండి.

      తొలగించండి
  6. సమస్య
    *గు రు మూ ర్తి ఆ చా రి *
    ----------------- --------

    క్షమి౦చ౦డి గురువుగారూ నా భావాన్ని క౦దము లో యిముడ్చలేక శార్దూల౦ వ్రాస్తున్నాను ఐనను మీ సమస్యాపాద నిర్మాణ౦
    చెడ కు౦డా మరియు నమస్యా పాద భావము
    తూ .చ .తప్పకు౦డా
    పూరి౦చాను


    ఊసుల్ కూసెను " మైకు " న౦దున ప్రచారోన్మాది యా శ్రీ న గ


    ప్రాసాద౦బు కడన్ - కడున్ విసుగు కల్గన్ జేయు చీ రీతిగా


    " యేసే య౦దరి దైవ మాయనకు మీ యీశు౦డు దాసు౦ డు మా


    యేసున్ నమ్మిన నా త్రినేత్రు డిక మీ కిచ్చున్ సిరుల్ స౦పదల్ "
    -----------------------
    శ్రీ నగ ప్రాసాదము : శ్రీ శై ల. దేవాలయ ము
    -----------------------


    .

    రిప్లయితొలగించండి
  7. ఈ శుని దూ తయె కావున
    యేశు ని నమ్మిన ద్రి నేత్రు డిచ్చును సిరుల
    న్యీ శును నేసుయు గృష్ణుడు
    నా శార్వరి ,యాదిశక్తి యంశము లేనౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సిరుల| నాన్పుడు... ' అనండి.

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. ఏసందేహములేదిట
      నాసర్వవ్యాపిశంకరావధి హిందూ
      వాసుల కెట్లు ప్రభుసుతుడు
      యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

      తొలగించండి
    2. [హిందూవాసులు= హిందూ దేశపు వాస్తవ్యులు, అయోధ్యావాసులు లాగ.]

      తొలగించండి
    3. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. ఏసుడు నీశుండొకడే
    ఏ శంకయు లేదు నిజము ఇలలో జనులే
    వాసిగ శివుడనొ మరి యా
    యేసుని నమ్మిన ద్రినేత్రుడిచ్చును సిరులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నిజము+ఇలలో' అన్నప్పుడు సంధి లేదు.

      తొలగించండి
    2. ఏసుడు నీశుండొకడే
      ఏ శంకయు లేదన నిజ మిలలో జనులే
      వాసిగ శివుడనొ మరి యా
      యేసుని నమ్మిన ద్రినేత్రుడిచ్చును సిరులన్

      తొలగించండి
  10. వాసము కనకాచలమట
    పూసికొను విభూతి మేన పూర్ణానందుం
    డేసాతనివరపుత్రుడు
    యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

    రిప్లయితొలగించండి
  11. వాసము కనకాచలమట
    పూసికొను విభూతి మేన పూర్ణానందుం
    డేసాతనివరపుత్రుడు
    యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

    రిప్లయితొలగించండి
  12. దాసునివలె దరిజేరియు
    యేసుని నమ్మిన?ద్రినేత్రుడిచ్చు సిరులున్
    మోసము లెరుగని భక్తియు
    కాసుల నాశించ కున్న?కలిమియు బెంచున్|

    రిప్లయితొలగించండి
  13. ఇదో ప్రయత్నం. గురువుగారు ఏమంటారో..

    ఈ సు నకు శ్రేష్ఠము మరియు
    నీ సు నకును మంచిదనియు నింపగు నర్థం
    బీ సన బీజాక్షర మా-
    యే, సు ను నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బాసటగా నిద్ద రొకటి అనండి.

      తొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వాసిగ దైవం బొకడని
    బాసలు జేసిరి పలువురు ప్రవచనములలో
    యీశుని యవతార మనుచు
    యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    (దేవుని పేరిట మోసముం జేయు దొంగ గురువుల బోధలను నమ్మినచోఁ జెడిపోదురనియుం దన మాటలను విని, దైవమును నమ్మినచో సిరులనుం బొందెదరని పలికెడి యొకానొక హిందీ తెలిసిన భక్తుని యువాచ...)

    "కాసుల కొఱకై, దేవుని
    దాసులమని పలుకుటఁ గన, తస్కర్, గోల్‍మాల్!
    యే సమజుకే, ౙరా సుని
    యే! సును! నమ్మినఁ, ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్!"

    రిప్లయితొలగించండి
  17. దాసునివలె దరిజేరియు
    యేసుని నమ్మిన?ద్రినేత్రుడిచ్చు సిరులున్
    మోసము లెరుగని భక్తియు
    కాసుల నాశించ కున్న?కలిమియు బెంచున్|
    దోసిలి బట్టియు వేడుచు
    యేసునునమ్మిన?ద్రి నేత్రుడిచ్చు సిరులున్
    బాసటగా నిద్ద రొకటి
    దాసులుగా భక్తియున్న? దయదలతురిలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మీరు సవరించిన పద్యాలను ముందు వ్రాసిన పద్యాల క్రింద నా వ్యాఖ్య తరువాత ఉన్న ‘ప్రత్యుత్తరం’ను క్లిక్ చేసి అక్కడే ప్రకటించాలి.

      తొలగించండి
  18. కాసుల నొడ్డుచు పేకలు
    వాసిగ త్రిప్పుచు నటునిటు వడివడి రీతిన్
    మోసము జేయుచు నిస్పే
    డేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్

    రిప్లయితొలగించండి


  19. నీ సౌహార్దము పెరుగును
    యేసును నమ్మినఁ ,ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
    కాసుల చెల్లెలు యానతి
    గా సుదతి జిలేబి నమ్మకము వలయునహో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. తీసుకొనుచు మా మతమును
    రాసుల గోమాంసమునహ లాగుచు పిదపన్
    వేసుకొనుచు బీరును మా
    యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్

    రిప్లయితొలగించండి


  21. శ్వాసగ మారును భక్తియె
    యేసును నమ్మినఁ, ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
    బాసటగా నీవాతని
    ప్రాసాదమ్మును బడసి శుభమ్ముల గానన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి