20, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్.

45 కామెంట్‌లు:

  1. అలరి ముదంబునం జదివి హాయిగ శాస్త్రములెన్నొ నేర్చి ధీ
    బలమున నే విదేశముల బాటను బట్టితి; కానరాడిటన్
    దెలుగును నేర్చువాడొఁకడు తేటగ నిచ్చట నాంధ్రభాషలో
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      మంచి పూరణతో ‘బోణీ’ చేశారు. అభినందనలు, ధన్యవాదాలు.

      అలఁతి పదప్రయోగమును హాయిఁ బఠింపఁగఁ జేయు ధార వి
      జ్ఞులు దల లూఁపు భావములు శోభిలఁగా వివిధంబులౌ సమ
      స్యలకు సమర్థపూరణలఁ జక్క నొనర్చెడి విష్ణునందనా!
      లలిత మృదూక్తులన్ గవితలన్ రచియింతువు మెచ్చ నెల్లరున్.

      తొలగించండి
    2. డా. విష్ణునందన్ గారూ,
      ఇక్కడ నున్నను నదే పరిస్థితి కానవచ్చుచున్నది. పద్యమున కాదరణము తెలుఁగు పండితులమని చెప్పుకొనెడి భాషోపాధ్యాయులు సైత మీయకున్నారు. అందఱును వచన కవితలకే యెగఁబ్రాఁకుచుండిరి! అందుకే మన యందఱ యాశయ మొక్కటే "తెలుఁగుఁ బద్యమ్ము నిత్యమై తేజరిల్లు" నట్లు చేయుటయే!

      మీ పూరణము బాగున్నది. అభినందనలు!

      *************

      మిత్రులు శంకరయ్యగారూ,

      డా. విష్ణునందన్ గారి వంటి సమర్థులైన కవు లుండఁగా మన కవిత్వవేదికయైన "శంకరాభరణము"నకు లోటేమి యుండఁగలదు? మీరు సత్యమే వచించితిరి. మీ పద్యము చాలఁ బ్రభావవంతముగ నున్నది. అభినందనలు!

      స్వస్తి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కావ్యము లెందుల కాంగ్లబానిసల్’ అనండి.

      తొలగించండి
    2. కలములు పట్టబోరిపుడు కాగితమక్కర లేదు వ్రేలితో
      తళుకుల నీను యంత్రమున ధాటిగ ఛాటులనాడు వారికిన్
      కళలును భాషయున్ మధురకావ్యము లెందుల కాంగ్ల బానిసల్
      లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

      తొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    ములుకుల వంటి మాటలను మూర్ఖులు నేర్చుచు మందబుద్ధులై
    పలువురు రాజకీయముల బాటలు బట్టిరి రెచ్చగొట్టుచున్
    కుల మత జాతి భావములు కుత్సిత బుద్ధులు హద్దు మీరగా
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

    (నేఁటి పద్యకవిత్వపు దుస్స్థితి నేమని వర్ణింతును....?)

    సలలిత భావజాల యుత ఛందము నందున వెల్గు పద్దెముల్
    నలిఁగి కృశించుచుండె నధునాతన కైతల ధాటి కీ యెడన్!
    పలుమఱు వేది పైన వినువారలు లేకయె పద్యమందునన్

    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవితా పాండిత్య ధనులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు. మీరన్నది నిజమే ... ఎవరైనా ' ఫలానా వారు ఫలానా పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులు ' అని అంటే, ' తెలుగు పండితుడా?తెలుగు "పండిట్" ఆ ? ' అని అడగవలసిన పరిస్థితి. ఆ రెంటి భేదం విజ్ఞులెరుగుదురు గాక! మీరు నిస్సందేహంగా మొదటి కోవకు చెందిన తెలుగు పండితులు కావడం ముదావహం.
      ' యుత+ఛందము , అధునాతన కైతలు ' - ప్రమాదో ధీమతామపి కావచ్చును. ఇక్కడే నేటి పద్య రచన శీర్షిక క్రింద బతుకమ్మ గురించిన మీ పద్య సముచ్చయం మేలిబంతి వలె ఉన్నదని అభినందించడానికి మనసు కుతూహలపడుతోన్నది.
      ఈ సందర్భంగా - ఇన్ని రకములైన కవితలను చందోబద్ధమైన రీతిలో ఇందరు కవుల చేత రచింపజేస్తూన్న శ్రీ కంది శంకరయ్య గారి సాహితీ వరివస్య బహుధా ప్రశంసనీయం.

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ‘భావముల్ గలుగు ఛందము...’ అందామా? ‘అధునాతన కైతల’ అన్నచోట సవరణ సూచించలేకున్నాను. మీరే సవరించండి.

      తొలగించండి
    3. కవి పండిత మూర్ధన్యులు డా. విష్ణునందన్ గారికి ధన్యవాదములు!

      "హ్రస్వస్య ఛే పరే తుగాగమస్యాత్" అనునది తెలిసియు...నేరుగ టైపుచేయు సందర్భమున గమనింపకయే తప్పుగా టైపుచేసితిని. అటులనే...యధునాతన కైత ... యనునదియు సవరింపవలెననుకొనుచునే...మఱచిపోయి యటులనే యుంచి ప్రకటించితిని. క్షంతవ్యుఁడను. వీనినిప్పుడే సవరించెదను.

      సలలిత భావముల్ గలుగు ఛందము నందున వెల్గు పద్దెముల్
      నలిఁగి కృశించుచుండె వచనమ్మగు కైతల ధాటి కీ యెడన్!
      పలుమఱు వేది పైన వినువారలు లేకయె పద్యమందునన్

      లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్!!

      *******

      మిత్రులు శంకరయ్యగారూ,

      నా పూరణమందుఁ బ్రథమ పాదమునఁ జక్కని సవరణమును సూచించినందులకుఁ గృతజ్ఞుఁడను. ధన్యవాదములతో...స్వస్తి.

      తొలగించండి
    4. ఎత్తుగడ యొకవిధముగనే యున్న నా మూఁడు పూరణములు:

      (1)
      పలుకులుఁ జప్పనై మిగుల బావురుమన్ వచనంపు కైతలన్
      బలుమఱు వ్రాయు వాడుకయ వాంఛితమై యెసలాఱుచుండ, ని
      స్తుల కలకంఠ కూజిత యశో విలస న్మధురార్థ పద్య స

      ల్లలిత మృదూక్తులన్, గవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్!

      (2)
      పలుకులుఁ జప్పనై మిగుల బావురుమన్ వచనంపు కైతలన్
      బలుమఱు వ్రాయు వాడుకయ బాగని మెచ్చెడు వేడ్క నుండ, నే
      ర్పులుఁ దొలుకాడు ఛందమునఁ, బొల్పగు భావన లింపుఁ గూర్చు స

      ల్లలిత మృదూక్తులన్, కవితలన్ రచియించిన, మెచ్చ రెవ్వరున్!

      (3)
      పలుకులుఁ జప్పనై మిగుల బావురుమన్ వచనంపు కైతలన్
      బలుమఱు మెచ్చి బాగనెడి వాండ్రె సభాస్థలి నుండఁగాను, నే
      ర్పులుఁ దొలుకాడు ఛందమునఁ బొల్పగు భావన లింపుఁ గూర్చు స

      ల్లలిత మృదూక్తులన్, కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్!

      తొలగించండి
  5. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్
    పలువిధ కష్టనష్టముల పాలయి జీవనయాన మందునన్
    నిలువగ నీడయున్ కడుపునిండుగ కూడును లేనివారలన్
    తలచుచు సాటిమానవుల తక్షణరక్షనొనర్చ మేలగున్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని 1,3,4వ పాదాల్లో గణదోషం. సవరించి మళ్ళీ ప్రకటించండి.

      తొలగించండి
  7. అలవడె నేటిమానవుల కందర కిప్పుడు దృశ్యజాలముల్
    కలవర పాటునిచ్చిన వికార మనస్కులు నైన భ్రాంతులై
    లలితపదార్ధసంహితము రమ్యము భాగవతమ్ము మెత్తురే
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్.
    [జాలము = వల (Net); దృశ్య జాలముల్ = వలయందలి దృశ్యములు]
    [దృశ్యజాలముల్ = దృశ్య సమూహములు (నెట్ లోనివని భావము)]

    రిప్లయితొలగించండి
  8. సులభ ప దమ్ములన్ కరము సుందర పద్యములన్ రచించెగా
    పలువురుమెచ్చ వే మన యపారపు జ్ఞా నముతో గతమ్మునన్
    పలుచబడంగ మానవుల బంధము
    లి ప్పుడు భూతధాత్రిపై
    లలిత మృధూక్తులన్ కవితలన్ ర చియించిన మెచ్చరెవ్వరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సమస్య
    *గు రు మూ ర్తి ఆచారి


    పలువురు సత్కవీశ్వరులు పాపయశాస్త్రిని సత్కరి౦పరే


    లలితమృదూక్తులన్
    కవితలన్ రచియి౦చిన. ?- -మెచ్చరెవ్వరున్


    " ఫలఫల " మ౦చు వ్రాయగనె వట్టి నిరర్థక శబ్దపుష్టితో ;


    తలపును మీటి , తియ్యగ నెదన్ కదలి౦చినదే కవిత్వమౌ ! !

    రిప్లయితొలగించండి
  10. మెలికలఁ ద్రిప్పు నాట్యముల మేనిని వంపులు పొంగువారగన్!
    కులటలఁ బోలు భూషణము! కొంటెతనమ్ముగ భాషణమ్ములున్!
    చిలిపిగ మూల్గులున్ వెకిలి చేష్టలు నిండిన నేటి పాటలన్
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఇలను జనంబు లందఱు సహేతు క మొప్ప మెత్తురీ
    లలిత మృదూ క్తులన్గవితల న్రచి యించిన, మెచ్చ రెవ్వరు
    న్నలతి పదంబు తోడ న నయంబునునీ తి లేనిచో
    ములుకు లవంటి మాటల నుమొండి గబల్కు నత్తరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీరు ఆ మూడు పాదాల గణదోషాలను సవరించలేదు. నా సవరణ....
      ఇలను జనంబు లందఱు సహేతుక మొప్పగ నెంచి మెత్తురీ
      లలిత మృదూక్తులన్ గవితలన్ రచియించిన, మెచ్చ రెవ్వరు
      న్నలతిపదాలతోడ ననయంబును సభ్యత నీతి లేనిచో
      ములుకుల వంటి మాటలను మొండిగ బల్కెడివారి నత్తరిన్.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  12. కలుషిత భావబంధముల కల్పన లన్నియు మెచ్చువారికిన్
    విలువలు నింపు సూత్రములు,విద్య వివేకమునెంచు టౌ నటే?
    దలపరు లాభమెంచగల తత్వమునందునలోభు లెంతురా?
    లలితా మృదూక్తులన్ ,కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

    రిప్లయితొలగించండి
  13. అలయక నేటి కైతల ననాదరమున్ యొనరించి నాగరుల్
    కొలుతురు పూర్వకావ్యముల గూర్చిన గ్రాంథిక భాషితమ్ముకే
    విలువనొసంగి మెచ్చగ, నవీనములౌ పదబంధ వాకముల్
    లలిత మృదూక్తులన్ ,కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...ననాదరము న్నొనరించి...’ అనండి.

      తొలగించండి
    2. అలయక నేటి కైతల ననాదరమున్నొనరించి నాగరుల్
      కొలుతురు పూర్వకావ్యముల గూర్చిన గ్రాంథిక భాషితమ్ముకే
      విలువనొసంగి మెచ్చగ, నవీనములౌ పదబంధ వాకముల్
      లలిత మృదూక్తులన్ ,కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

      తొలగించండి
  14. లలిత మృదూక్తుల పద్య కవితలను రచియించిన కవి మిత్రులందరనూ మెచ్చుకొనుచున్నాను.




    చిలుకల పల్కులన్ బలుకు చిన్నతనమ్మున చెప్పకే నివిన్
    పలు విధ నీతిపద్యములు భాగవతమ్మున నొక్క పద్యమున్
    గలగల నాంగ్ల మాద్యమము గట్టిగ నేర్చిన వారి ముందటన్
    లలిత మృదూక్తులన్, కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. చం.కలలతలుక్కుమన్చుతనకౌగిలిలోపడవేయుజాణకే
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్
    వెలదితదేకరీతిగవిభిన్నవినూత్నసపర్యలన్ గృహం
    బులవెలుగొందుపుణ్యవతిపూజలనొందుసమస్తపూజ్యమై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మెలికలఁ ద్రిప్పు నాట్యముల మేనిని వంపులు పొంగువారగన్!
    కులటలఁ బోలు భూషణము! కొంటెతనమ్ముగ భాషణమ్ములున్!
    చిలిపిగ మూల్గులున్ వెకిలి చేష్టలు నిండిన నేటి పాటలన్
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చరెవ్వరున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. విలవిలలాడు సంధులును వేలల వేల కుటిల్ సమాసముల్
    కిలకిల మంచు కూరిచి సుకీర్తిని వొంద వధాన సాహితిన్
    సలలిత వేమనార్యుల విశాల సుగంధ శతమ్ము వంటివౌ
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్ :(

    రిప్లయితొలగించండి


  19. విలువను జేర్చు మాట,సయి వీనుల విందును గూర్చు రాగమై
    పలుకులు తేనెలూరగను పద్యము మోదము గూర్చ మెత్తురౌ
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన, మెచ్చ రెవ్వరున్
    మలకలమాటలన్ సుదతి మత్తున దేల్చు పదమ్ములన్ సుమా

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. ములుగుచు ముక్కుచున్ దవిలి ముందుకు దెచ్చుచు "నాంధ్రభారతిన్"
    కులికెడు శబ్దమున్ గనగ గుట్టుగ చట్టున తస్కరించుచున్
    తెలుగున రోజురోజునను తియ్యని రీతిని నావి వోలెడిన్
    లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్
    😊

    రిప్లయితొలగించండి