25, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్య - 1835 (బుద్ధుఁడు హింసయె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

51 కామెంట్‌లు:

  1. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    సిద్ధులు వచించి రెపుడో ,
    బుద్ధుఁడ హింసయె హితమని బోధించె నిలన్,
    ' బౌద్ధము ' నకు శత్రువనెను
    బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.


    బుద్ధుని కధ రచనకు సం
    సిద్ధుడ నై కావ్యరచన చేబట్టంగన్
    క్రుద్ధుడు నున్మాది బలికె
    బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ఇద్ధర్మభూమిఁ కొందఱు
    సిద్ధులు సాధించుకొఱకుఁ జేతురు బలులన్
    శుద్ధమనస్కుఁడు గాని ప్ర
    బుద్ధుఁడు హింసయె హిత మని బోధించె నిలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారూ!
      శుద్ధ మనస్కుఁడు కాని ప్రబుద్ధునిం గూర్చిన మీ పూరణ మమోఘముగ నున్నది. అభినందనలు!

      తొలగించండి
  3. "బుద్ధుడు" కు కొమ్ము లేదుర
    "బుద్ధుడ" తలకట్టు చాలు బుద్ధిగ వినుమా
    దిద్దుము ముందీ వాక్యము
    "బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      చమత్కారభరితమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    సిద్ధమగుచు యుద్ధములకు
    నిద్ధాత్రిని నేలెడి ధరణీశులతోడన్,
    శుద్ధి రహిత, పాప విహిత

    బుద్ధుఁడు, "హింసయె హిత"మని బోధించె నిలన్!


    రిప్లయితొలగించండి

  5. *గు రు మూ ర్తి ఆ చా రి *
    ----------------------.


    ఇధ్దర. సి రి మఖ్యము స
    ధ్బుధ్దిని విడనాడి దాని దోచు మట౦చున్
    బుధ్దుని వలె c దోచు నొక. " ప్ర
    బుధ్దుడు " హి౦సయె హితమని బోధి౦చె నిలన్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. బుద్ధుని గనువా డె పుడును
      బుద్ధిగ మఱి యనడునటుల బుద్ధిని గూర్చి
      న్సి ధ్ధా ! నీవే చెప్పుము
      బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

      తొలగించండి
    2. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. గద్దెల నాశించిన యొక
    డొద్దికగా పెద్ద జేరి వోట్లను గెలవన్
    పద్ధతి యేమని యడుగ ప్ర
    బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

    గద్దెలు = పదవులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. '.... జేరి యోట్లను' అనండి.

      తొలగించండి
    2. గద్దెల నాశించిన యొక
      డొద్దికగా పెద్ద జేరి యోట్లను గెలవన్
      పద్ధతి యేమని యడుగ ప్ర
      బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

      తొలగించండి
    3. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. ఆర్యా “ద్ద” “ద్ధ” లకు ప్రాస వేయ వచ్చునా? తెలుప గోర్తాను. అలాగే నిన్నటి పూరణ లోను( శ్రీ గుండు మధుసూదన రావు గారి రెండవ పూరణ) ప్రాస పూర్వాక్షరము దీర్ఘమయితే హ్రస్వాక్షరము వేయ వచ్చునా?

      తొలగించండి
    4. సుకవి మిత్రులు శ్రీ కామేశ్వరావు గారూ!

      నిన్నటి నా పూరణము ప్రమాద పతితము. దానిని సవరించితిని. పరిశీలింపుఁడు.
      **************************

      శంకరయ్యగారూ,

      నిన్నటి నా రెండవ పూరణము ప్రమాద వశమున, ప్రాసపూర్వ హ్రస్వాక్షర యుతమైనందున, దానిని సవరించి మఱలం బ్రకటించితిని. పరిశీలించఁగలరు.

      తూలు నవ యౌవనముతో
      లాలితముగ భార్య లిద్ద ఱతనిం గొలువన్
      బేలల గృహముల కటనా
      వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్!

      తొలగించండి
    5. సుకవి మిత్రులు మధుసూదన్ గారికి నమస్కారములు. నా సందేహము నివృత్తి అయ్యినది. మీ సవరించిన పూరణ చక్కగా ఉన్నది. ధన్యవాదములు.

      తొలగించండి
    6. కామేశ్వర రావు గారూ,
      ద,ధ ప్రాస కొందరు లాక్షణికులకు అంగీకారమే.

      తొలగించండి
    7. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. సందేహము తీరింది. ధన్య వాదములు.

      తొలగించండి
  8. నా రెండవ పూరణము:

    ఇద్ధర పాపవ్యపగత
    బద్ధతతో శుద్ధమైన పద్ధతి యుతుఁడౌ
    బుద్ధునకుఁ గ్రుద్ధతను దు

    ర్బుద్ధుఁడు "హింసయె హిత"మని బోధించె నిలన్!

    రిప్లయితొలగించండి

  9. శుద్ధోదనునిసు తుండగు
    బుద్ధుడహింసతొ మనుడని బోధన చేయన్
    నిద్దరలో నొక మూర్ఖ ప్ర
    బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘బుద్ధు డహింసను మనుడని...’ అనండి.

      తొలగించండి
  10. సిద్ధులు దైత్యు లమరవర
    బద్ధాగర్భ సువిరోధ పాశుల కంతన్
    యుద్ధమున,శుక్రుడు వినుత
    బుద్ధుఁడు, హింసయె హితమని బోధించె నిలన్.
    [బుద్ధుఁడు = విద్వాంసుడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. వినుమిదె నా హితవాక్యము
    జనసేవను చేయనేత స్వార్థము తోడన్
    గని బుద్దుదు హింసయె మే
    లని బోధించె నిలను సవరణ గావించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      సమస్యాపూరణకు, పద్యరచనకు ఉభయతారకమైన పద్యాన్ని రచించారు. బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. నిద్దురయందున కలలో
    సిద్దునితో బాటువచ్చి చింతించకుడి
    బద్దకమును మాన్పించు|ప్ర
    బుద్దుడు హింసయె హితమని బోధించెనిలన్

    రిప్లయితొలగించండి
  13. బుద్ధిగ వ్రాయమనిచ్చెను
    బుద్ధుడ హింసయె హితమని బోధించె నిలన్
    బద్దకమునవ్రాసెనిటుల
    బుధ్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అని+ఇచ్చెను’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘వ్రాయగ నిచ్చెను’ అనండి.

      తొలగించండి
    2. గురువు గారికి ప్రణామములు
      నా దోషాలను సవరిస్తూ పద్యరచనలో మెలుకువలు మీరు సూచిస్తున్నప్పటికీ పొరపాటులు దొరలుతూ నే వున్నాయి. మన్నించగలరు
      మీసూచన ప్రకారం సవరించిన పద్యము

      తొలగించండి
    3. బుద్ధిగ వ్రాయగ నిచ్చెను
      బుద్ధుడ హింసయె హితమని బోధించె నిలన్
      బద్దకమునవ్రాసెనిటుల
      బుధ్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

      తొలగించండి
  14. యుద్ధము జేయననెడు నీ
    బుద్ధిని నాపై మరల్చి పోరుము పార్థా!
    సద్ధర్మమిదని గీతా
    బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. సిద్ధాంత మేమిలే దిట
    వద్దను మాంసంబు తినని వాడిల హింస స
    ద్భుద్ధిని మాంసమ్మును తిను
    బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘హింస స|ద్బుద్ధి..’ అన్నచోట గణదోషం.

      తొలగించండి
    2. శ్రీ శంకరయ్యా గురువుగారికి నమస్కారములు
      మీ సూచనకు ధన్యవాదములు
      పద్యము సవరించాను
      సిద్ధాంత మేమిలే దిట
      వద్దను మాంసంబు తినని వాడిల హింసన్
      బుద్ధిగ మాంసమ్మును తిను
      బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

      తొలగించండి
  16. గురువుగారికి నమస్కారం. నాకు చేతనైన పూరణకు ప్రయత్నించాను. దయచేసి తప్పులుంటే మన్నించి తెలుపగలరు.
    సిద్ధార్ధునిమత మెరుగక
    పధ్ధతితప్పి,పసయగునుపగయని పలికిన్
    యుద్ధమునకుసిధ్ధమగు, ప్ర
    బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పలికిన్’...?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు.
      సిద్ధార్ధునిమత మెరుగక
      పధ్ధతితప్పి,పసయగునుపగయని పలికీ
      యుద్ధమునకుసిధ్ధమగు, ప్ర
      బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

      తొలగించండి
  17. ఉద్ధవు డెంచెను మది నని
    రుద్ధుని దిక్కనుచు, తలచె రూఢిగ కంసుం
    డుద్ధతి శత్రువుగా, దు
    ర్బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

    రిప్లయితొలగించండి
  18. శుద్ధులఁజెప్పుచు నిత్యము
    గద్దెలపైనెక్కునట్టి కరమగు కాంక్షన్
    హద్దులను మరచి కడు దు
    ర్బుద్ధుడు హింసయె హితమని బోధించె నిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. బుద్ధియు శుద్ధియు వీడుచు
    సిద్ధులు తాకోరుచుండి చిల్లర గుడిని
    న్నిద్ధర పశుబలులిడు దు
    ర్బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్

    రిప్లయితొలగించండి


  20. బుద్ధి కొలిపెన్ జిలేబీ
    బుద్ధుఁడు, హింసయె హితమని బోధించె నిలన్
    బుద్ధిని వీడి ఒసామా!
    తద్ధామ పరమము తమది తమదని రిరువున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. బద్ధము కాదీ వాక్యము:
    "బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్"
    శుద్ధముగా సవరింపుము:
    "బుద్ధుఁడ హింసయె హితమని బోధించె నిలన్"

    రిప్లయితొలగించండి